రెండు బైక్ లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
రెండు బైక్ లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలకేంద్రంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సింహాద్రిపురంలోని కల్యాణమంటపం వద్ద ఎదురెదురుగా వేగంగా వచ్చిన బైక్‌లు ఢీకొనటంతో నారాయణరెడ్డి(70) అక్కడికక్కడే చనిపోగా లక్ష్మీనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.