Lakshmi Narayan
-
‘మనది భారతదేశం.. అతడిని అభినందించాలి’
లక్నో : కొందరు మంత్రులు చెలాయిస్తున్న అధికార దుర్వినియోగానికి నిలువెత్తు నిదర్శనం ఈ వీడియో. ప్రభుత్వాధికారి చేత షూలేస్ కట్టించుకోవడమే కాక రామయణాన్ని తెర మీదకు తెచ్చి మరి దాన్ని సమర్థించుకున్నాడో మినిస్టర్. వివరాలు.. ఉత్తరప్రదేశ్ మినిస్టర్ లక్ష్మీ నారాయణ్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా షాజహాన్పూర్లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో సదరు మినిస్టర్ షూ లేస్ ఊడిపోయింది. దాంతో పక్కనే ఉన్న ప్రభుత్వ ఉద్యోగి వెంటనే వెళ్లి అమాత్యుల వారి షూలేస్ కట్టి తన ప్రభు భక్తిని చాటుకున్నాడు. వారించాల్సిన మినిస్టర్ కాస్తా దర్జాగా నిల్చూని ప్రభుత్వ ఉద్యోగి చేత సేవ చేపించుకుని తరించారు. #WATCH: UP Minister Laxmi Narayan gets his shoelace tied by a government employee at a yoga event in Shahjahanpur, yesterday. pic.twitter.com/QbVxiQM7bI — ANI UP (@ANINewsUP) June 22, 2019 ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో లక్ష్మీ నారాయణ్‌ని, ఉద్యోగిని తెగ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ సంఘటన గురించి లక్ష్మీ నారాయణ్‌ని ప్రశ్నించగా.. ఆయన సిగ్గుపడకపోగా సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ‘షూ లేస్ కట్టి నాకు సాయం చేసిన వ్యక్తిని అభినందిస్తున్నాను. భారతదేశం చాలా గొప్ప దేశం. ఇక్కడ రాముని బదులు ఆయన పాదరక్షలు 14 ఏళ్ల పాటు పాలన చేశాయి. మన పురాణాల్లో పాద రక్షలకు చాలా ప్రాధాన్యం ఉంది. అలాంటి చెప్పులు ధరించే విషయంలో నాకు సాయం చేసిన వ్యక్తిని అభినందిస్తున్నాను’ అంటూ రామయణాన్ని తెరమీదకు తెచ్చి పొంతన లేని వాదనను వినిపించాడు. అయితే ఇలా తలా తోకా లేకుండా మాట్లాడటం సదరు మినిస్టర్‌కు కొత్త కాదు. గతంలో హనుమంతుడు జాట్ల తెగకు చెందిన వాడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు లక్ష్మి నారాయణన్. -
1990కి పూర్వం అనర్హులకే భారతరత్న
భోపాల్: 1990కి పూర్వం భారతరత్న అవార్డులను అనర్హులకే కట్టబెట్టారని బీజేపీ ఎంపీ ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న లక్ష్మీ నారాయణ్ యాదవ్ ఏప్రిల్ 14న 126వ అంబేడ్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు. ‘డ్యాన్సర్లు, సింగర్లు, చిన్నా, పెద్ద ఎంత చెడ్డవాడైతే అయితే అంత తొందరగా అవార్డును పట్టుకెళ్లారు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై ఆయన స్పందిస్తూ, స్థానికులకు అర్థమవ్వడం కోసమే తానలా మాట్లాడానని స్పష్టం చేశారు. వీపీ సింగ్ ప్రభుత్వం 1990లో అంబేడ్కర్‌కు భారతరత్న ప్రదానం చేసేవరకూ ఆయన తీవ్ర అలక్ష్యానికి గురయ్యారని యాదవ్ తెలిపారు. దేశంలోని కులతత్వానికి ఇదే నిదర్శనమన్నారు. -
చెల్లని చెక్కు కేసులో నిందితునికి జరిమానా
చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన నిందితునికి లక్ష రూపాయల జరిమానా విధిస్తూ 10వ స్పెషల్ మేజిస్ట్రేట్ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... ఎల్బీనగర్ కాకతీయకాలనీకి చెందిన గోవర్ధన్, నల్లగొండ జిల్లా పానగల్‌కు చెందిన యాదయ్యలు పరిచయస్తులు. తన కుటుంబ అవసరాల నిమిత్తం 2013లో యాదయ్య లక్ష రూపాయలను అప్పుగా గోవర్ధన్ నుంచి తీసుకుని ఆరు నెలల్లోగా తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. గడువు ముగిసిన మీదట డబ్బులు చెల్లించమని యాదయ్యను కోరగా ఇందుకు గాను ఎస్బీఐ రవీంద్రనగర్బ్రాంచికి చెందిన లక్ష రూపాయల చెక్కును గోవర్ధన్ పేరిట జారీ చేశాడు. సదరు చెక్కును ఎస్బీహెచ్ నాగోలు బ్రాంచిలో జమచేయగా ఖాతాలో సరిపడా డబ్బులు లేకపోవడంతో చెక్కు చెల్లలేదు. నోటీసు పంపినప్పటికీ యాదయ్య స్పందించకపోవడంతో గోవర్ధన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 10వ స్పెషల్ మేజిస్ట్రేట్ పైవిధంగా తీర్పు చెప్పారు. మరో కేసులో... రంగారెడ్డి జిల్లా కోర్టులు: చెల్లని చెక్కు ఇచ్చి మోసం చేసిన నిందితునికి సంవత్సరం జైలుశిక్ష, రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ 3వ స్పెషల్ మేజిస్ట్రేట్ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన శ్రీనివాసరావు, షాద్‌నగర్‌కు చెందిన లక్ష్మీనారాయణలు పరిచయస్తులు. తన వ్యాపార అవసరాల నిమిత్తం 2014లో లక్ష్మీనారాయణ రూ.15 లక్షలను అప్పుగా శ్రీనివాసరావు నుంచి తీసుకుని మూడు నెలల్లోగా తిరిగి చెల్లిస్తానని హామీ ఇచ్చాడు. గడువు ముగిసిన మీదట డబ్బులు చెల్లించమని లక్ష్మీనారాయణను కోరగా అందులకు గాను తన ఖాతాకు చెందిన 15 లక్షల రూపాయల చెక్కును శ్రీనివాసరావు పేరిట జారీ చేశాడు. సదరు చెక్కును బ్యాంకులో జమచేయగా లక్ష్మీనారాయణ ఖాతాలో సరిపడా డబ్బులు లేకపోవడంతో చెక్కు చెల్లలేదు. నోటీసు పంపినప్పటికీ లక్ష్మీనారాయణ డబ్బులు చెల్లించకపోవడంతో శ్రీనివాసరావు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన 3వ స్పెషల్ మేజిస్ట్రేట్ పైవిధంగా తీర్పు చెప్పారు. -
'ఏపీకి ప్రత్యేక హోదా అమలు చేయాల్సిందే'
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను అమలు చేయాల్సిందే అని విశ్రాంత న్యాయమూర్తి, జన చైతన్య వేదిక కన్వీనర్ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి.. కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక ప్యాకేజీతో ఎలాంటి ఉపయోగం ఉండదని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్లో ఏపీకి ప్రత్యేక హోదా కోసం జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్సైట్ (http://www.apspecialstatus.in)ను ఆయన ప్రారంభించారు. ప్రత్యేక హోదాతోనే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని, అందుకు ఉద్యమించడమే మార్గమన్నారు. ఉద్యమం ద్వారానే ప్రత్యేకహోదా సాధ్యమవుతుందని దీనికి యువత ముందు వరుసలో నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ పాత్రికేయుడు తెలకపల్లి రవి మాట్లాడుతూ... పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యమని రాజకీయ ప్రముఖ విశ్లేషకులు లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రత్యేక హోదా కేంద్రం భిక్ష కాదు.. ఏపీ ప్రజల హక్కు అని లక్ష్మీ నారాయణ స్పష్టం చేశారు. -
టీవీ ప్లగ్ పెడుతూ..
టీవీ ప్లగ్ పిన్ను కరెంట్ బోర్డ్‌కు అనుసంధానిస్తూ ఓ వ్యక్తి షాక్‌కు గురై మృతి చెందాడు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం కోడుపల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. లక్ష్మీనారాయణ (40) అనే వ్యక్తి ఉదయం 7 గంటల సమయంలో ఇంట్లో ఉన్న టీవీ ప్లగ్‌ను బోర్డ్‌కు పెట్టే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఆ ఇంట్లో విషాదం నెలకొంది. -
రెండు బైక్‌లు ఢీకొని ఒకరు మృతి
రెండు బైక్ లు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలకేంద్రంలో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. సింహాద్రిపురంలోని కల్యాణమంటపం వద్ద ఎదురెదురుగా వేగంగా వచ్చిన బైక్‌లు ఢీకొనటంతో నారాయణరెడ్డి(70) అక్కడికక్కడే చనిపోగా లక్ష్మీనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.