భోపాల్: 1990కి పూర్వం భారతరత్న అవార్డులను అనర్హులకే కట్టబెట్టారని బీజేపీ ఎంపీ ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని సాగర్ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న లక్ష్మీ నారాయణ్ యాదవ్ ఏప్రిల్ 14న 126వ అంబేడ్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ విధంగా స్పందించారు.
‘డ్యాన్సర్లు, సింగర్లు, చిన్నా, పెద్ద ఎంత చెడ్డవాడైతే అయితే అంత తొందరగా అవార్డును పట్టుకెళ్లారు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై ఆయన స్పందిస్తూ, స్థానికులకు అర్థమవ్వడం కోసమే తానలా మాట్లాడానని స్పష్టం చేశారు. వీపీ సింగ్ ప్రభుత్వం 1990లో అంబేడ్కర్‌కు భారతరత్న ప్రదానం చేసేవరకూ ఆయన తీవ్ర అలక్ష్యానికి గురయ్యారని యాదవ్ తెలిపారు. దేశంలోని కులతత్వానికి ఇదే నిదర్శనమన్నారు.