హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూను ఉన్నాయి. తాజాగా శనివారం మహబూబ్ నగర్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడితే, మరోవైపు కరీంనగర్ జిల్లాలో ఎండిన పంటను చూసి పొలంలోనే ఓ రైతు గుండె ఆగింది. వివరాలు కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం మారిపల్లి గ్రామానికి చెందిన కొమ్ము దేవయ్య(51) తనకున్న మూడెకరాల భూమిలో పత్తిసాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా పంట దిగుబడి సరిగా లేకపోవడంతో నష్టాపాలవుతున్నాడు. ఎన్నో ఆశలతో ఈ ఏడాది సాగు చేసిన పంటకూడా ఎండిపోవడంతో ఈరోజు ఉదయం పొలంలోనే గుండెపోటుకు గురై మృతి చెందాడు.
మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన నారాయణరెడ్డి(50) తనకున్న ఐదెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పుల బాధ పెరిగిపోవడంతో పాటు వాటిని తీర్చే దారి కానరాక పోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణలో మరో ఇద్దరు రైతుల మృతి
Published Sat, Oct 10 2015 1:11 PM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM
Advertisement
Advertisement