సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగానే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని టీఆర్‌ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. 2015తో పోల్చితే 2016లో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు 54 శాతం తగ్గాయని కేంద్ర వ్యవసాయ మంత్రి బుధవారం పార్లమెంట్‌లో ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. 24 గంటల విద్యుత్‌తో పాటు నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా రైతులకు ప్రయోజనకారిగా నిలిచాయన్నారు. ఈ ఖరీఫ్ నుంచి ఎకరాకు రూ. 8 వేల చొప్పున పెట్టుబడి సాయం, కొత్త సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయన్నారు. దీంతో ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment