trs mp vinod kumar
-
అనువాదంలో అబద్ధాలు జోడించారు
సాక్షి, హైదరాబాద్: యూపీఐ చైర్పర్సన్ సోనియాగాంధీ హిందీలో మాట్లాడిన మాటల్లో లేని వాటిని కాంగ్రెస్ నేతలు తెలుగు అనువాదంలో జోడించి చెప్పారని కరీంనగర్ లోక్‌సభ సభ్యుడు బోయినిపల్లి వినోద్‌కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మేడ్చల్ సభలో సోనియా, రాహుల్‌గాంధీ, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడారనీ, సోనియా మాట్లాడిన హిందీ చాలామందికి అర్థమైందన్నారు. అనువాదంలో ఆమె మాట్లాడని మాటలు కూడా చేర్చారని వినోద్ ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమమని కేసీఆర్ చెప్పారని తెలి పారు. సోనియా మొదట తెలంగాణ కాంగ్రెస్ నేతల తీరును మార్చాలని వినోద్ సూచించారు. దేశంలో తెలంగాణకు పాలనలో అనేక అవార్డులు, రివార్డు లు వచ్చాయన్నారు. ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ మం త్రులు ఇక్కడకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వ తీరును కొనియాడారని గుర్తుచేశారు. ఇలా నవజ్యోత్సిద్దూ, రేవణ్ణలు ఇసుక పాలసీ, గొర్రెల పంపకంపై తెలంగాణ ప్రభుత్వా న్ని కొనియాడారని ఉటంకించారు. కేసీఆర్ ఆమరణదీక్ష తర్వాత తెలంగాణ ఇస్తామన్న ప్రకటన అమలు ఆలస్యం కావడం వల్లే ఆత్మహత్యలు జరిగాయి. ఆత్మహత్యలకు కాంగ్రెస్, టీడీపీలు కారణమన్న సంగతి కోదం డరాంకు తెలియదా? అని ప్రశ్నించారు. డిసెంబర్ 11న సోనియా సహా కూటమి నేతల కళ్లు తెరిపించే ఫలితాలు వస్తాయని చెప్పారు. ఇక రాహుల్ ప్రసం గం విన్న తర్వాత దేనితో కొట్టుకోవాలో తెలియడం లేదని ఎద్దేవా చేశారు. కొమరంభీంను, అంబేడ్కర్‌ను విస్మరించామని అంటున్నారనీ, ఓ జిల్లాకు కొమరం భీం పేరు పెట్టిన విషయం రాహుల్‌కు స్థానిక నేతలు చెప్పలేదా? అని నిలదీశారు. అంబేడ్కర్ పేరు ప్రాణహితకు యథావిధిగా కొనసాగుతోందన్నారు. కాం గ్రెస్ ప్రణబ్ కమిటీ వేసినా అన్ని పార్టీలను తెలంగాణకు ఒప్పించింది టీఆర్ఎస్ పార్టీయేననీ, ప్రణబ్ కమిటీకి మెజారిటీ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇచ్చినా అప్పుడు కాంగ్రెస్ నిర్ణయం తీసుకోలేదన్నారు. తెలంగాణను చంటిబిడ్డలా కేసీఆర్ సాకుతున్నారని వెల్లడించారు. హోదా అంటే ఏమిటో చెప్పాలి.. ప్రత్యేక హోదా అంటే ఏమిటో కాంగ్రెస్ నిర్వచనం చెప్పాలని వినోద్ కోరారు. ఇప్పటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదాను ఎవరూ ఇవ్వలేరనీ, ఏపీకి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే పన్నుల ప్రోత్సాహకాలు ఇస్తే తామే కాదు కర్ణాటక, తమిళనాడు కూడా వ్యతిరేకిస్తాయన్నారు. ఏపీ ప్రజలను మరోసారి మోసం చేయడానికే కాంగ్రెస్ ప్రత్యేక హోదా ఇస్తానంటోందనీ, చంద్రబాబు దాన్ని తీసుకుంటా అంటున్నారనీ విమర్శిం చారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసహనంతోనే టీఆర్ఎస్ను బొంద పెడతా అంటున్నారని విమర్శించారు. ఉత్తమ్ ఇంకా ప్రచారమే ప్రారంభిం చలేదని, కాంగ్రెస్ గాంధీభవన్ నుంచి పాలించాల్సిం దేనని, వారు మాక్ అసెంబ్లీ పెట్టుకోవాల్సిందేనని వినోద్ చమత్కరించారు. -
‘ప్రకటించని మేనిఫెస్టో కాపీ ఎలా సాధ్యం?’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మేనిఫెస్టో ఇంకా ప్రకటించలేదని, అలాంటప్పుడు కాపీ కొట్టడం ఎలా జరుగుతుందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ ప్రశ్నించా రు. రైతుబంధు, రైతు బీమా కొనసాగిస్తామని చెబుతున్న కాంగ్రెస్ నేతలు.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని చెబితే ఇంకా బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ నేతలు ప్రజల మధ్య లేరు. అందుకే మేమే గెలుస్తామని చెబుతూ ఊహల్లో పయనిస్తున్నారు. అధికారం లేనప్పుడు ప్రజల్లో తిరిగే అలవాటు కాంగ్రెస్ నేతలకు లేదు. 2014 మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశాం. చెప్పనివీ చేశాం. అందుకే కేసీఆర్‌ను జనం నమ్ముతున్నారు. రూ.200 ఉన్న పింఛను కూడా ఇవ్వని కాంగ్రెస్.. రూ.2వేలు ఎలా ఇస్తుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలవి బక్వాస్ మాటలు. ఎన్నికలు వద్దని డీకే అరుణ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అంటే ఎన్నికలకు ఎవరు భయపడుతున్నారు? ప్రజాకోర్టులో తేల్చుకుందామని కేసీఆర్ సవాల్ విసిరితే సై అన్నారు. ఇప్పుడు ప్రజాకోర్టును చూసి భయపడి హైకోర్టు, సుప్రీంకోర్టుల చుట్టూ తిరుగుతున్నారు‘ అని అన్నారు. -
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమైందని టీఆర్ఎస్ విమర్శించింది. లోక్‌సభలో అవిశ్వాసం తీర్మానంపై చర్చ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడారు. ‘నాలుగేళ్ల క్రితం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ప్రజల్లో ఎన్నో ఆశలుండేవి. వాటిని నెరవేర్చడంలో కేంద్రం విఫలమైంది. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా తొలి కేబినెట్ సమావేశంలో పోలవరం ముంపు మండలాలను ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో కలిపింది. ఈ మండలాలను మళ్లీ తెలంగాణలో కలిపేలా కేంద్రం విభజన చట్టాన్ని సవరించాలి. 7 ముంపు మండలాల్లో భాగమైన 500 మెగావాట్ల సీలేరు విద్యుత్ ప్రాజెక్టును ఏపీకే ఇవ్వడంతో మా రాష్ట్రంలోవిద్యుత్ సంక్షోభం ఏర్పడింది. విభజన చట్టం ప్రకారం తెలంగాణ ప్రభుత్వం సొంతంగా విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించుకొనేదాకా ఏపీ విద్యుత్ సరఫరా చేయాలన్న నిబంధన ఉన్నా అమలు కాలేదు. మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల మేం తీవ్రంగా నష్టపోయాం. ముంపు మండలాలను కలపకపోతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనని బాబు పలు సందర్భాల్లో మీడియా సాక్షిగా అన్నారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టులకు నిధులివ్వాలి ఏపీలో పోలవరం ప్రాజెక్టుకు పూర్తి ఖర్చును భరిస్తామని విభజన చట్టంలో పేర్కొన్న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని ప్రాజెక్టును విస్మరించిందన్నారు. మాకు జీవనాధారమైన కృష్ణా, గోదావరి నదులపై చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులివ్వాలి. బాబు వల్లే హైకోర్టు ఆలస్యం ‘హైకోర్టు విభజన జరగకపోవడానికి చంద్రబాబే ప్రధాన కారణం. ఏపీ ప్రభుత్వం ముందుకొస్తే వెంటనే హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అప్పటి కేంద్ర న్యాయ మంత్రి స్పష్టం చేశారు. కానీ ఏపీ ఇప్పటికీ ముందుకు రాలేదు. సచివాలయం, అసెంబ్లీ కట్టుకున్న ఏపీ, హైకోర్టును ఎందుకు నిర్మించుకోలేకపోతోందో చెప్పాలి. మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రూ.19 వేల కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లివ్వాలని నీతిఆయోగ్ సిఫార్సు చేసింది. దీనిపై ప్రధాని సమాధానం చెప్పాలి. గల్లా వ్యాఖ్యలపై సభలో దుమారం ఆంధ్రప్రదేశ్‌ను అప్రజాస్వామికంగా, అశాస్త్రీయంగా విభజించారని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గల్లా తన ప్రసంగంలో రాష్ట్ర విభజన అప్రజాస్వామికం అనండంపై టీఆర్ఎస్ సభ్యులు వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేశారు. గల్లా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ ఆమోదంతోనే విభజన బిల్లు ఆమోదం పొందిందని టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి గుర్తు చేశారు. పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్లు అప్రజాస్వామికమెలా అవుతుందని నిలదీశారు. తెలంగాణ ఏర్పాటు ప్రజాస్వామికంగానే జరిగిందన్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం చంద్రబాబు కేంద్రానికి రెండుసార్లు లేఖలు రాశారని గుర్తు చేశారు. ‘అప్రజాస్వామికం, అశాస్త్రీయం’ అనే మాటలను రికార్డుల్లోంచి తొలగించాలని స్పీకర్‌ను కోరారు. -
ప్రభుత్వ విధానాల వల్లే ఆత్మహత్యలు తగ్గుముఖం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగానే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. 2015తో పోల్చితే 2016లో తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు 54 శాతం తగ్గాయని కేంద్ర వ్యవసాయ మంత్రి బుధవారం పార్లమెంట్లో ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. 24 గంటల విద్యుత్‌తో పాటు నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా రైతులకు ప్రయోజనకారిగా నిలిచాయన్నారు. ఈ ఖరీఫ్ నుంచి ఎకరాకు రూ. 8 వేల చొప్పున పెట్టుబడి సాయం, కొత్త సాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయన్నారు. దీంతో ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాలి
టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ సాక్షి, హైదరాబాద్: ఏపీ పునర్విభజన చట్టానికి కొన్ని సవరణలు చేస్తే 2019 ఎన్నికలు జరిగేలోపు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు ఉండబోదని రెండు రోజుల కిందట రాజ్యసభలో కేంద్రం తేల్చిచెప్పిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డితో కలసి వినోద్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను కలసినప్పుడు అసెంబ్లీ సీట్లను పెంచాల్సిందిగా కోరారని వినోద్ చెప్పారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే దానిపై బిల్లు ప్రవేశ పెట్టాలని, 2019లో రెండు రాష్ట్రాల్లో ఎన్నికలున్నందున ఈ ప్రక్రియను మొదలు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచడానికి రాజ్యాంగ సవరణ అవసరమని రాజ్యసభలో కేంద్రం ఇచ్చిన సమాధానం సరికాదని వినోద్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం ఆహిర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. -
కాంగ్రెస్ సమయం వృధా చేస్తోంది: వినోద్
న్యూఢిల్లీ: పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించాలనడం సరికాదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయనిక్కడ మాట్లాడుతూ... నోట్ల కష్టాలపై పార్లమెంట్ లో చర్చించాలని సూచించారు. లోక్ సభలో కాంగ్రెస్ బాధ్యతాయుతంగా వ్యహరించడం లేదని విమర్శించారు. వాయిదాలతో సభా సమయాన్ని వృధా చేస్తోందన్నారు. శనివారం ఉదయం తమ ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రధాని మోదీని కలుస్తారని చెప్పారు. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్రధానికి కేసీఆర్ లిఖితపూర్వక సూచనలు ఇస్తారని వెల్లడించారు.