devaiah
-
టీడీపీ-బీజేపీ ప్రచార ‘పంచాయితీ’!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ టీడీపీ, బీజేపీల మధ్య ఇప్పట్లో సయోధ్య కుదిరేలా కనిపించడం లేదు. వరంగల్ లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీకి చెందిన ఎన్నారై డాక్టర్ దేవయ్య అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయనను ఎన్డీయే అభ్యర్థిగా ప్రచారం చేయాలని ముందు నుంచీ ఇరు పార్టీల నేతలు ప్రకటించినా... వాస్తవానికి వచ్చే సరికి ఈ రెండు పార్టీల నేతలు కలసి ప్రచారంలో పాల్గొనలేకపోతున్నారు. ఇరు పార్టీల మధ్య సమన్వయం కోసం ఇప్పటికే ఓ మారు సమావేశం నిర్వహించుకుని ఉమ్మడి ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసినా అది కార్యరూపం దాల్చలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ టీడీపీ నేతల నుంచి తమకు సరైన సహకారం, తోడ్పాటు అందడం లేదని తెలంగాణ కమలనాథులు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారని సమాచారం. ఈనెల 21న వరంగల్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతుంది, 19 నాటికల్లా ప్రచారం ముగుస్తోంది. అంటే ప్రచారానికి కేవలం ఆరు రోజుల సమయమే మిగిలి ఉంది. అయినా ఇరు పార్టీల నేతలు కలసి ప్రచారం చేయడం లేదు. సమన్వయమే సమస్య! ముందు నుంచీ టీడీపీ, బీజేపీల మధ్య సమన్వయం పెద్ద సమస్యగా మారిందన్న అభిప్రాయం ఉంది. వరంగల్ జిల్లాకు చెందిన టీటీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మినహా తెలంగాణ టీడీపీలో పేరున్న నేతలెవరూ పెద్దగా ప్రచారంపై దృష్టి పెట్టడం లేదు. ఈ పరిస్థితుల్లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడంతో తమ పార్టీ నాయకులతో పాటు, వరంగల్ బీజేపీ అభ్యర్థి దేవయ్యను కూడా గురువారం విజయవాడకు పిలిపించుకున్న చంద్రబాబు... వారిని కూర్చోబెట్టి పంచాయితీని పరిష్కరించే ప్రయత్నం చేశారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సార్వత్రిక ఎన్నికలప్పుడు వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు చోట్ల టీడీపీ విజయం సాధించింది. దాంతో క్షేత్ర స్థాయిలో బీజేపీ కన్నా తమ పార్టీ పరిస్థితే మెరుగ్గా ఉందని, టికెట్ తమకే ఇవ్వాలని టీడీపీ పట్టుబట్టినా బీజేపీ వినలేదు. ఈ గొడవ ఇప్పటికీ కొనసాగుతుండడంతో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేయక తప్పలేదంటున్నారు. అసలు బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేయడానికి టీడీపీ వ్యూహ రచన కూడా చేసుకుంది. ఏడు సెగ్మెంట్లకు తొమ్మిది జిల్లాల నాయకులకు బాధ్యతలు అప్పజెప్పింది. కానీ అది పెద్దగా కార్యరూపం దాల్చినట్లు లేదంటున్నారు. మరోవైపు ఆ పార్టీ కార్యకర్తలకు కూడా కనీస పరిచయం లేని వ్యక్తికి టికెట్ కేటాయించిన బీజేపీ... ఎన్నికల్లో ఓడిపోతే ఆ నెపం తమపై నెట్టివేయడానికి ముందు నుంచే తాము సహకరించడం లేదంటూ అభియోగం మోపుతోందని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. టికెట్ కోసం పట్టుబట్టిన బీజేపీ.. డబ్బున్న వ్యక్తిని చూసింది కానీ, నియోజకవర్గ ఓటర్లకు తెలిసిన వాడా, కార్యకర్తలతో కనీస పరిచయాలు ఉన్నాయా లేదా అనేది పట్టించుకోలేదని ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్న టీడీపీ రాష్ట్ర స్థాయి నాయకులు వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తానికి ఎన్నికల ప్రచారం ముగింపు దశకు వచ్చినా, ఇంకా ఈ రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరక పోవడంపై చర్చ జరుగుతోంది. -
తెలంగాణలో మరో ఇద్దరు రైతుల మృతి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూను ఉన్నాయి. తాజాగా శనివారం మహబూబ్ నగర్ జిల్లాలో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడితే, మరోవైపు కరీంనగర్ జిల్లాలో ఎండిన పంటను చూసి పొలంలోనే ఓ రైతు గుండె ఆగింది. వివరాలు కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం మారిపల్లి గ్రామానికి చెందిన కొమ్ము దేవయ్య(51) తనకున్న మూడెకరాల భూమిలో పత్తిసాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండేళ్లుగా పంట దిగుబడి సరిగా లేకపోవడంతో నష్టాపాలవుతున్నాడు. ఎన్నో ఆశలతో ఈ ఏడాది సాగు చేసిన పంటకూడా ఎండిపోవడంతో ఈరోజు ఉదయం పొలంలోనే గుండెపోటుకు గురై మృతి చెందాడు. మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రామానికి చెందిన నారాయణరెడ్డి(50) తనకున్న ఐదెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అప్పుల బాధ పెరిగిపోవడంతో పాటు వాటిని తీర్చే దారి కానరాక పోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నలుగురు రైతుల బలవన్మరణం
నెట్వర్క్: అప్పుల బాధ రైతన్నను బలి తీసుకుంటోంది. మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో వేర్వేరు ఘటనల్లో నలుగురు రైతులు బలవన్మరణం చెందారు. మెదక్ జిల్లా రామాచంపేట మండలం నగరం గ్రామానికి చెందిన రైతు కొమ్మాట మల్లయ్య(50) రెండెకరాల్లో పెట్టుబడుల కోస రూ. లక్ష అప్పు చేశాడు. సాగునీరు లేక పంట ఎండిపోయింది. అప్పు తీరే మార్గం కనిపించక శనివారం రాత్రి పొలం వద్ద ఉరి వేసుకున్నాడు. దౌల్తాబాద్ మండలం దీపాయంపల్లికి చెందిన రైతు పిట్ల బిక్షపతి(50) పంటల కోసం పెట్టుబడుల కోసం సుమారు రూ. 2 లక్షలకు పైగా అప్పు చేశాడు. అప్పుల తీర్చే మార్గం కనిపించక శనివారం రాత్రి ఇంటి వద్ద ఉరి వేసుకొన్నాడు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం గొల్లపల్లికి చెందిన రైతు మెండె దేవయ్య(60) దిగుబడి రాక, అప్పు పెరిగిపోవడంతో శనివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రానికి చెందిన రైతు లస్మన్న రూ. 40 వేలు అప్పు చేశాడు. అప్పు తీరే మార్గం లేక పొలంలో ఉరి వేసుకున్నాడు. -
ముగ్గురు రైతుల ఆత్మహత్య
సిరిసిల్ల/కమలాపూర్/ ముథోల్: వర్షాభావ పరిస్థితులు రైతులను బలవన్మరణాల వైపు నడిపిస్తున్నాయి. వేసిన పంటలు మొలకెత్తకపోవడంతో దిక్కుతోచని స్థితిలో శుక్రవారం కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చినబోనాల గ్రామానికి చెందిన పత్తి రైతు పడిగె దేవయ్య(60) మూడేళ్లుగా పత్తి పంట వేస్తున్నాడు. పదెకరాల్లో పత్తి పంట వేసేందుకు చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో మనస్తాపం చెందిన దేవయ్య ఇంట్లో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కమలాపూర్ మండలం మర్రిపెల్లిగూడెం గ్రామానికి చెందిన దాసరి రవీందర్(40) చేనేత కార్మికుడు. కులవృత్తితో పాటు వ్యవసాయం చేస్తున్నాడు. అప్పులు తీరే మార్గం కనిపించక శుక్రవారం గ్రామ శివారులో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా ముథోల్ మండలం విఠ్ఠోలి గ్రామానికి చెందిన రైతు ముత్యాలోల్ల పుండలిక్ (42) తనకున్న పన్నెండు ఎకరాల్లో ఎనిమిది ఎకరాలు పత్తి, నాలుగు ఎకరాల్లో సోయా వేయగా, వర్షలు పడక విత్తనాలు మొలకెత్తలేదు. సాగు కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలనే బెంగతో క్రిమిసంహారక మందు తాగాడు. -
ప్రాణం తీసిన పందెం
మద్యం ఫుల్‌బాటిల్ దింపకుండా తాగి ఒకరి మృతి అపస్మారక స్థితిలో మరో ఇద్దరు సిరిసిల్ల: మద్యంపై ముగ్గురు స్నేహితులు కాసుకున్న పందెం ఒకరి ప్రాణం తీసింది. మరో ఇద్దరి ప్రాణాల మీదికి తెచ్చింది. దించకుండా ఫుల్‌బాటిల్ తాగాలని పందెం కాసుకున్న మిత్రులు ముగ్గురూ మద్యం తాగగా వారిలో ఒకరు వాంతులు చేసుకుని మరణించారు. మిగిలిన ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం తంగళ్లపల్లికి చెందిన హమాలీ కరికె రవి(38), తాపీమేస్త్రీ రంగు నర్సయ్య, ఆటో డ్రైవర్ కుమ్మరి దేవయ్య స్నేహితులు. ఈ ముగ్గురు గురువారం ఫుల్‌బాటిల్ మద్యం దించకుండా తాగాలని, ఎవరు ముందు తాగితే వారు గెలిచినట్టు అని పందెం కాసుకున్నారు. మూడు మద్యం బాటిళ్లు తెప్పించుకుని ఎవరికి వారు గటగటా తాగేశారు. ఘాటు నషాళానికి ఎక్కడంతో తీవ్రంగా వాంతులు చేసుకున్నారు. కరికె రవి తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. రంగు నర్సయ్య, కుమ్మరి దేవయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వెంటనే వారిని కుటుంబసభ్యులు సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. మద్యంలో విషప్రయోగం జరగడం వల్లే రవి మరణించాడని కుటుంబసభ్యులు, తంగళ్లపల్లికి వచ్చి రోడ్డుపై బైఠాయించారు. రూ.కోటి విలువైన గుట్కా ప్యాకెట్ల పట్టివేత చింతూరు : రాజస్థాన్, గుజరాత్ నుంచి తెలంగాణ, కర్నాటకకు నాలుగు లారీలలో తరలిస్తున్న కోటి రూపాయల విలువైన నిషేధిత గుట్కా, పాన్ మసాల ప్యాకెట్లను చింతూరు పోలీసులు గురువారం పట్టుకున్నారు. లారీలను సీజ్ చేసి చింతూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ లారీలలో మొత్తం 32 టన్నుల బరువున్న 490 బ్యాగులు ఉన్నాయి. చింతూరు మండలం చట్టి వద్ద గురువారం వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు.. వీటిలోని గుట్కా ప్యాకెట్ల బ్యాగులను స్వాధీనపర్చుకున్నారు. లారీలను సీజ్ చేసి, డ్రైవర్లను, సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. -
‘నిర్మల్ భారత్’ డబ్బులు పక్కదారి!
నవాబుపేట, న్యూస్‌లైన్: పేదలకు అందించాల్సిన నిధులు పక్కదారి పడుతున్నాయి. మండల పరిధిలోని పూలపల్లి గ్రామంలో నిర్మల్ భారత్ అభియాన్ డబ్బులు దుర్వినియోగం అయిన సంఘటన ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. వివరాలు.. నిర్మల్ భారత్ అభియాన్ కింద పూలపల్లి గ్రామస్తులకు మరుగుదొడ్లు మంజూరు అయ్యాయి. ఎస్సీ, ఎస్టీలు నిర్మాణాలను పూర్తి చేసుకోకపోవడంతో డీఆర్డీఏ కింద అధికారులు రూ. 40 వేల రుణాలు మంజూరు చేశారు. నిధులను గ్రామ సంఘం తీర్మానం మేరకు అర్హులకు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా గ్రామ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాలమణి, యాదమ్మ, కోశాధికారి నాగమణి, గ్రామ సీసీ పోచయ్యలు ఎలాంటి తీర్మానం లేకుండా రూ. 30 వేలు డ్రా చేశారు. విషయం శుక్రవారం మండల మహిళా సంఘానికి తెలిసింది. దీంతో వారు శనివారం గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిధుల దుర్వినియోగం వాస్తవమేనని తేల్చారు. డబ్బులు తిరిగి చెల్లించాలని స్వాహా చేసిన వారిని ఆదేశించారు. ఈవిషయమై ఏపీఎం దేవయ్య వివరణ కోరగా.. అదేం లేదు. గ్రామ సభ తీర్మానం ఉంది. లోన్లు తిరిగి చెల్లించాలని ఆదేశించామని తెలిపారు.