
సాక్షి, నిజామాబాద్ : ధాన్యం కొనుగోళ్లలో రైతు సమస్యలపై గురువారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో బీజేపీ ఎంపీ దర్మపురి అర్వింద్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపీ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. కడ్తా పేరుతో 3 నుండి 5కిలోల వరకు తరుగు తీస్తున్నారని, దీని వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న ఇతర రాష్ట్రాల వలస కార్మికుల కోసం కేంద్రం ఇచ్చిన రూ. 599 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం కుడా ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. వలస కార్మికుల కోసం కేటాయించిన 599 కోట్ల నుంచే 1500 చొప్పున అందరికి ఇస్తున్నారని ఆరోపించారు. కేంద్ర నిధులను దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. (మే 17 వరకు లాక్‌డౌన్ పొడగింపు)
Comments
Please login to add a commentAdd a comment