![Fight Between TRS And BJP Leaders At janagaon - Sakshi](/styles/webp/s3/article_images/2022/08/15/WGL.jpg.webp?itok=GlAfgg_Y)
సాక్షి, జనగామ: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. జనగామలో టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
వివరాల ప్రకారం.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రలో భాగంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాదయాత్ర సందర్భంగా దేవరుప్పుల టీఆర్‌ఎస్ నాయకులు.. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం.. బీజేపీ నాయకులపై టీఆర్‌ఎస్ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీంతో, వారి మధ్య వాగ్వాదం నెలకొంది. రాళ్ల దాడిలో కొందరు నేతలు తలలు పగిలిపోయాయి. రక్తం కారడంతో అంబులెన్స్‌లో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బండి సంజయ్.. విధుల్లో ఉన్న సీపీ ఏం చేస్తున్నాడంటూ సీరియస్ అయ్యారు.
ఇది కూడా చదవండి: ఎందరో వీరుల త్యాగఫలమే మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం: సీఎం కేసీఆర్
Comments
Please login to add a commentAdd a comment