నిజాం రాజుల ఆగడాలను ఎదురించిన వీరులనుగన్న జన్మభూమి.. నక్సల్ బరి ఉద్యమానికి ఊతమిచ్చి..
భూస్వామ్య పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన పోరుగడ్డ..
నాడు నల్లగొండ జిల్లాలో అంతర్భాగమై..
నేడు రెండు వందల గ్రామాలకు ప్రధాన వ్యాపార కేంద్రంగా విలసిల్లుతూ ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ దినదిన ప్రవర్థమానంగా వెలుగొందుతోంది జనగామ జిల్లా. ఎన్నో అవాంతరాలు..
మరెన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ మొక్కవోని దీక్షతో ముందుకుసాగి సొంత జిల్లా కలను సాకారం చేసుకుని ఇక్కడి ప్రజలు జయహో అంటూ నినదించారు.
ఆర్థిక, సామాజిక వనరులు కలిగిన ఈ ప్రాంతం జిల్లా గా ఏర్పడడంతో మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నారు.
జనగామ: బ్రిటిష్ పాలనలో వ్యాపార, వాణిజ్య, విద్య రం గాలను అభివృద్ధి చేయడంలో జనగామ ప్రాంతానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వందేళ్ల క్రితం ప్రారంభించిన ప్రిస్ట¯ŒS పాఠశాల, మిషనరీ చారిటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాల ను రైల్వే మార్గాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని సాగించారు. స్వాతంత్య్రం వచ్చిన ఐదేళ్ల తర్వాత 1952 నవంబర్‌లో జనగామ పట్టణాన్ని జిల్లాలోనే ఏకైక మునిసిపాలిటీగా ఏర్పాటు చేశారు. అయితే మునిసిపాలిటీకి ఆదాయ వనరులు తగ్గిపోవడంతో మధ్యలో మూడేళ్ల పాటు నగర పంచాయతీగా కు దించబడింది. అప్పటి వరకు నల్లగొండ జిల్లా పరిధిలో వరంగల్, ఖమ్మం ప్రాంతాలు కలిసే ఉండేవి. కాగా, మద్రాసు నుంచి విడిపోయి నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ అనంతరం వరంగల్, ఖమ్మం ప్రాంతాలను వేరు చేశారు. ఆ సమయంలోనే నల్లగొండ పరిధిలో ఉన్న జనగామ తాలూకాను వేరు చేయడంతో వరంగల్ జిల్లాలో కలిసి.. దినాదినాభివృద్ధి చెందుతూ జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం జనగామ పట్టణంలో 28 వార్డులు, 1.12 లక్షల జనాభాతో గ్రేడ్–1 మునిసిపాలిటీగా కొనసాగుతుంది.
ఆలయాలకు నెలవు..
జనగామ కొత్త జిల్లా ఆలయాలకు నెలవుగా మారనుంది. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం కొమురవెల్లి, మ ద్దూరు మండలం బెక్కల్ రామలింగేశ్వరాలయం, నిజాం రజాకార్లను ఎదిరించిన వీరబైరా¯ŒSపల్లి చరిత్ర జనగామ నుం చి విడిపోయాయి. జిల్లాల విభజనలో భాగంగా కొత్తగా పాలకుర్తి సోమేశ్వరస్వామి, చిల్పూర్‌లోని బుగులు వెంకటేశ్వరస్వామి, దేవరుప్పులలోని మానకొండ లక్ష్మీనర్సింహస్వా మి, లింగాలఘనపురంలోని జీడికల్ సీతారామచంద్రస్వా మి, నవాబుపేటలోని శ్రీకోదండరామస్వామి ఆలయాలతో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక చింతనతో విరాజిల్లనుంది. చీట కో డూరులోని కోటిలింగాల పుణ్యక్షేత్రం..పట్టణ ప్రజలకు 365 రోజుల పాటు తాగునీరు అందించే చీటకోడూరు రిజర్వాయర్ జనగామ జిల్లాలోనే ఉండడం గమనార్హం.
సాహితీ రంగంలో ప్రత్యేక గుర్తింపు..
కళలకు పుట్టినిల్లు అయిన జనగామ చరిత్ర ప్రపంచ పుటల్లోకి ఎక్కింది. హస్తకళలకు ప్రసిద్ధి గాంచిన పెంబర్తి గ్రామం దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. అమెరికా, లండ¯ŒS, ఆసే్ట్రలి యా, అరబ్ దేశాలతో పాటు పలు ఖండాల్లో ఇక్కడ తయా రు చేసే హస్తకళలకు పేరుంది. ప్రపంచ గుర్తింపు పొందిన ఒగ్గుకథ పితామహుడు చుక్క సత్తెయ్యది కూడా జనగామ ప్రాంతమే. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా ఆయన గండ పెండేరం అందుకుని, ఎన్నో అవార్డులను పొందారు. కాగా, ఐఐటీ ద్వారా ఎందరో విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు వేసి, ప్రపంచం నలుమూలా ల తన శిషు్యలను తయారు చేసుకున్న చుక్కా రామయ్య పా లకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెందిన వారు కావడం విశేషం. సాహిత్య రంగానికి వన్నెతెచ్చిన పలకనూరి సోమేశ్వర్, బమ్మెర పోతన ఈ ప్రాంతానికి చెందిన వారే.
జనగామ జిల్లాలోని మండలాలు..
కొత్తగా ఏర్పాటైన జనగామ జిల్లాలో జనగామ, నర్మెట, లింగాలఘణపురం, బచ్చన్నపేట, తరిగొప్పుల (కొత్త), గుండాల(నల్లగొండ జిల్లా) స్టేషన్‌ఘన్‌పూర్, రఘునాథపల్లి, జఫర్‌గఢ్, చిల్పూరు(కొత్త), పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పు ల మండలాలు ఉన్నాయి. మొత్తంగా 13 మండలాలతో సుమారు 5,82,457 జనాభాతో జనగామ జిల్లా నూతనంగా ఆవిర్భవించింది.
అభివృద్ధిలో పోటీ పడుతూ..
గ్రామంగా ఆవిర్భవించిన జనగామ అభివృద్ధిలో పోటీపడుతూ జిల్లాస్థాయికి ఎదిగింది. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను కలిపే రైల్వే మార్గం, ఐదు రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ కలిగి ఉన్న రోడ్డు మార్గం జనగామ సొంతం. వైద్యవిధాన పరిషత్ ఆధ్వర్యంలో వంద పడకల ఆస్పత్రికి అనుసంధానంగా చంపక్‌హిల్స్ లో మాతాశిశు సంక్షేమ ఆస్పత్రితో జిల్లాస్థాయి కేడర్‌ను కలిగి ఉంది. విద్య, ఉపాధి రంగాలకు నెలవుగా ఇంజనీరింగ్, ఫార్మసీ, కోచింగ్ సెంటర్లు, కళాశాలలు, నర్సింగ్‌తో పాటు వైద్య రంగంలో కార్పొరేట్ స్థా యి కలిగిన ప్రైవేట్ ఆస్పత్రులతో వరంగల్ తర్వాత జనగామ విద్యాహబ్‌గా విలసిల్లుతోంది.
దేశంలోనే ఏకైక పట్టుదారం రోలింగ్ యూనిట్ సెంటర్ ఇక్కడ ఉండడం విశేషం. రైతులు పండించిన సరుకులను భద్రపరుచుకునేందుకు వేల మెట్రిక్ టన్నులు నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగిన గోదాంలు, వ్యవసాయ మార్కెట్, కాటన్ యార్డు ఉన్నాయి. రెండు ఫస్ట్ క్లాస్ మెజిసే్ట్రట్ కోర్టులు, సెకండ్ క్లాస్ మెజిసే్ట్రట్, సబ్‌కోర్టు, అడిషనల్ జిల్లా కోర్టుతో పాటు సబ్ జైలు ఉంది. క్రీడాపరంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన మినీ స్టేడియం, మినీట్యాంకు బండ్ ఉంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండసీ్ట్రయ ల్, ఐటీ కారిడార్‌తో జనగామకు మరింత ప్రాధాన్యం కలుగనుంది.
పది దశాబ్దాల చరిత్ర కలిగిన జనగామ ఘనకీర్తి ప్రచారానికి నోచుకోవడంలేదు. ప్రపంచానికి శాంతి మంత్రాన్ని అందించిన జైనులు జీవించిన ఈ ప్రాంతంలో సజీవ సాక్ష్యాలెన్నో కళ్లెదుటే కని పిస్తున్నా.. నేటి తరానికి అందించే ప్రయత్నం జరగడంలేదు. నల్లగొండ జిల్లా కొలనుపాక రాజధానిగా క్రీ.శ 973లో తెలంగాణను పాలించి న కళ్యాణ చాణక్యులు ఇక్కడ జైన మతాన్ని ఆచరించారు. దేవాలయాలు, విద్యాలయాల ను ని ర్మించి సాక్ష్యాలుగా అనేక శాసనాలు వేయిం చా రు. జనగామ కేంద్రంగా జైనులు వర్తక వ్యా పారం చేస్తూ కాలక్రమేణా ఇక్కడే స్థిర పడ్డారు.
ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన కొలనుపాక జైన దేవాలయంతో పాటు మద్దూరు మండలం బైరాపల్లి జైన దేవాలయం (ప్రస్తుత వీరభద్రస్వామి) ఆలయాలు నాటి పూర్వ వైభవానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. జనగామ మం డలం ఎల్లంల గ్రామ శివారులో శిథిలమైన జైన యక్ష దేవాలయం గుట్టపై బసది (విడిది కేం ద్రం) బండ్ల గూడెంలోని జైన ఆనవాళ్లు కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. సిద్ధెంకి గుట్టపై ఉన్న ఓ బండరాయిపై వర్ధమాన మహావీరుడు, పా ర్శ్వనాథుడు, జైనయక్షిణి శిల్పలాలు సుందరం గా చెక్కినట్టు కనిపిస్తాయి. గ్రీకు రాయబారి మొ గస్తనీస్ తన రచనల్లో నగ్న సన్యాసులను ఎంతో మందిని తెలంగాణ ప్రాంతంలో చూసినట్లు రా సిన గ్రంథాన్ని ఆంగ్లంలో అనువదించిన ‘మాక్ క్రిండాల్’ అనే పరిశోధకుడు వివరించారు
జైనమతాన్ని విస్తరించేందుకు లింగాలఘనపురం మండలం కళ్లెంలో ఆర్యవైశ్యులు భూమిని దా నం ఇచ్చినట్లు అక్కడి శాసనంలో కనిపిస్తుంది. ప్రపంచ పర్యాటక ప్రాంతాలకు తీసిపోని చరిత్ర కలిగిన జనగామకు గురింపు తీసుకొచ్చేందుకు పురావస్తు శాఖ స్పందించాలి. ఇక్కడ మ్యూజి యం ఏర్పాటు చేసి భావితరాలకు నాటి ఘనచరిత్రను తెలియజేసేందుకు చర్యలు తీసుకోవాలి. పర్యాటక అర్హతలున్న ఎల్లంల, బండ్లగూడెం, బండనాగారం, సిద్దెంకి గుట్టలను తీర్చిదిద్దాలి.
పారిశ్రామిక అభివృద్ధికి అవకాశాలు
హైదరాబాద్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనగామ రాబోయే రోజుల్లో అభివృద్ధికి చిరునామాగా మారనుంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ఇండసీ్ట్రయల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించిన నేపథ్యంలో జనగామకు సువర్ణ అవకాశం దక్కనుంది. పరిశ్రమల స్థాపనకు జనగామ జిల్లా అన్నింటికి తగిన విధంగా ఉంది. అనుకూల, ప్రతికూల వాతావరణాన్ని తట్టుకునే స్వభావమున్న ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు కు పెట్టుబడిదారులు ఆకర్షితులవుతున్నారు. లింగాలఘణపురం మండలం ఏనె బావి వద్ద గతంలో ప్రభుత్వం 150 ఎకరాల విస్తీర్ణంలో కామోజీ టెక్స్‌టైల్స్ పా ర్కు ఏర్పాటుకు సన్నాహాలు చేయగా, నాటి ఉమ్మడి ప్రభుత్వం దానిని ఆంధ్ర ప్రాంతానికి తరలించింది. నూతన జిల్లాల విభజన తరుణంలో టెక్స్‌టైల్స్ పా ర్కు నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తే వందలాది కార్మికులు, నిరుగ్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే ఆవకాశం ఉంది.