నేడు ఆకాశంలో అద్భుతం.. ఆరు గ్రహాల పరేడ్‌ | Six Planets to align in the Night sky will see Rare event | Sakshi
Sakshi News home page

నేడు ఆకాశంలో అద్భుతం.. ఆరు గ్రహాల పరేడ్‌

Published Tue, Jan 21 2025 11:53 AM | Last Updated on Tue, Jan 21 2025 12:03 PM

Six Planets to align in the Night sky will see Rare event

ఈ రోజు(జనవరి 21) రాత్రి.. ఆకాశంలో ఒక అద్భుతమైన ఖగోళ దృశ్యం కనిపించనుంది. నేటి నుంచి మొదలుకొని రాబోయే కొన్ని వారాల పాటు, మన సౌర వ్యవస్థలోని ఆరు గ్రహాలు  అంటే.. అంగారక గ్రహం, బృహస్పతి, యురేనస్, నెప్ట్యూన్, శుక్రుడు, శని  ఒక సరళ రేఖలోకి రానున్నారు. ఇది ఒక అందమైన ప్లానెట్‌ పరేడ్‌గా కనిపించనుంది.

గ్రహ సంయోగంగా పేర్కొనే ఈ దృగ్విషయం పలు గ్రహాల వరుస క్రమం ఏర్పడినప్పుడు సంభవిస్తుంది. ఈ ఖగోళ అద్భుతం జరిగే సమయంలో యురేనస్, నెప్ట్యూన్‌లను వీక్షించడానికి బైనాక్యులర్లు టెలిస్కోప్‌లు అవసరం అవుతాయి. మిగిలిన నాలుగు గ్రహాలను నేరుగా కళ్లతో చూడవచ్చు. ఈ అరుదైన గ్రహాల అమరిక రాబోయే కొన్ని వారాల పాటు కనిపించనుంది.

గత వారం శని, శుక్ర గ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా రావడం మొదలయ్యింది. ఇలాంటి గ్రహ అమరికలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు, నక్షత్ర పరిశీలకులు సాగించే అధ్యయనానికి ఇవి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అందిస్తున్నాయి. ఈ గ్రహాలు సంపూర్ణ సరళ రేఖను ఏర్పరచకపోయినప్పటికీ, ఆకాశంలో కనిపించే వీటి అమరిక అద్భుతంగా ఉంటుంది.

పరేడ్‌ రూపంలో కనిపించే ఈ ఆరు గ్రహాలలో శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ ఉన్నాయి. ఈ గ్రహాలన్నీ  అంతరిక్షంలో మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. భూమి దాని కక్ష్యలో ఉన్న స్థానం కారణంగా ఈ అమరిక జరిగింది. జనవరిలో అంగారక గ్రహం సూర్యుడి నుండి భూమికి ఎదురుగా నేరుగా ఉండి, సరళ రేఖను ఏర్పరుస్తుందని నాసా తెలిపింది. ఈ సమయంలోనే ఈ గ్రహం భూమికి దగ్గరగా ఉంటుంది. దీని వలన అది అతిపెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

జనవరి 21న ఈ అమరిక ప్రారంభమవుతుంది. ఈ అమరికను సూర్యాస్తమయం అయిన 45 నిమిషాల తర్వాత వీక్షించవచ్చు. రోజులో చీకటి పడిన తర్వాత నెల రోజుల పాటు  నైరుతి దిశలో శుక్రుడు, శనిని రెండు గంటల పాటు చూడవచ్చని, బృహస్పతి ప్రకాశవంతంగా ప్రకాశిస్తుందని, తూర్పున అంగారక గ్రహం కనిపిస్తుందని నాసా తెలిపింది. భారతదేశంలోని దాదాపు ప్రతి నగరం నుంచి ఈ అరుదైన గ్రహ అమరికను చూసే అవకాశం ఉంటుంది.

నేటి నుంచి రాత్రి సమయంలో ఆకాశంలో శుక్రుడు, శని, బృహస్పతి, అంగారక గ్రహాలను  ఏ విధంగా వీక్షించవచ్చో ప్లానెస్ట్రీ సొసైటీకి చెందిన శాస్త్రవేత్త ఎన్‌ రఘనుందన్‌ కుమార్‌ తెలిపారు.

1. శుక్రుడు: పశ్చిమ దిశలో ప్రకాశవంతంగా, మిణుకుమిణుకుమంటూ నక్షత్రం  మాదిరిగా శుక్రుడు కనిపిస్తాడు. రాత్రి 8.30 గంటలకు అస్తమయం జరుగుతుంది.  ఆ సమయంలో మనం శుక్రగ్రహాన్ని వీక్షించగలుగుతాం.

2. శని: శుక్రుడిని గుర్తించిన మాదిరగానే నిశితంగా గమనించగలిగితే, శని గ్రహాన్ని కూడా చూడవచ్చు. లేత పసుపురంగుతో పాటు తెల్లని నక్షత్రంలా శని గ్రహం కనిపిస్తుంది.

తూర్పు దిశలో

3. బృహస్పతి: ఆకాశంలో తూర్పు వైపుకు తిరిగి చూస్తే మెరుస్తున్న నక్షత్రం లా బృహస్పతి కనిపిస్తుంది.

4. అంగారక గ్రహం: తూర్పు దిశలో నారింజ ఎరుపు నక్షత్రంలా కనిపించేదే అంగారక గ్రహం.

అర్ధరాత్రి, సూర్యోదయానికి ముందు..
బృహస్పతిని రాత్రి 10 గంటల ప్రాంతంలో ఆకాశంలో నడినెత్తిపై చూడవచ్చు. అర్ధరాత్రి 12 గంటల తరువాత అంగారక గ్రహాన్ని చూడవచ్చు. ఇది సూర్యోదయానికి ముందు పశ్చిమ దిశలో కనిపిస్తుంది.  ఈ వివరాలను అందించిన శాస్త్రవేత్త రఘునందన్‌ కుమార్‌ తన ఇంటి సమీపం నుంచి ఆకాశంలో ఇటీవలి కాలంలో ఈ గ్రహాలు ఎలా కనిపించాయో ఒక ఫొటో ద్వారా తెలియజేశారు. 

ఇది కూడా చదవండి: Mahakumbh: కుంభమేళాకు భయపడిన బ్రిటీష్‌ పాలకులు.. విప్లవగడ్డగా మారుతుందని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement