‘అక్టోబర్ స్కై’ 1999లో విడుదలైన హాలీవుడ్ సినిమా. అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో కోల్ వుడ్ అనే ఓ చిన్న గ్రామంలో జరిగిన నిజజీవిత కథ ఆధారంగా తీశారు. ఆ గ్రామానికి చెందిన నలుగురు కుర్రాళ్ల కథ ఇది. కథ జరిగిన కాలం 1957. పెద్దగా సౌకర్యాలు లేని ఓ కుగ్రామానికి చెందిన ఆ కుర్రాళ్లకి కొన్ని కారణాల వల్ల రాకెట్ తయారు చెయ్యాలని ఆలోచన వస్తుంది.
ఎన్నో కష్టనష్టాలకి ఓర్చి ఎంతో వ్యతిరేకతని ఎదుర్కొని చివరికి చిన్న రాకెట్ తయారు చేస్తారు. ఆ రాకెట్‌ని ఓ జాతీయస్థాయి సైన్స్ ప్రాజెక్ట్ పోటీలో ప్రదర్శించి మొదటి స్థానంలో విజయం సాధిస్తారు. అత్యంత స్ఫూర్తిదాయకమైన ఈ కథలో ముఖ్య పాత్ర పేరు ‘హోమర్ హికమ్’. ఆ హోమర్ హికమ్ ఆ తర్వాతి కాలంలో తన రాకెట్ తయారీ అనుభవాన్ని ‘రాకెట్ బోయ్స్’ పేరుతో పుస్తకం రాశాడు. యూనివర్సల్ స్టూడియోస్ వారు పుస్తకం హక్కులు కొని ‘అక్టోబర్ స్కై’ పేరుతో సినిమాగా విడుదల చేసి హిట్ సాధించారు.
పుస్తకం పేరు ‘రాకెట్ బోయ్స్’ను యథాతథంగా సినిమాకు కూడా పెడితే ‘ముప్పై ఏళ్లు నిండిన స్త్రీలు ససేమిరా చూడరు’ అని యూనివర్సల్ స్టూడియోస్ వారు అభిప్రాయపడడం చేత Rocket Boys అని మార్చవలసి వచ్చింది. ఇక్కడ తమాషా ఏంటంటే 'Rocket అన్న పదజాలంలోని అక్షరాలని తారుమారు చేస్తే అది 'October Sky' అవుతుంది. ఈ కథ పిల్లలకి ఎంత స్ఫూర్తి దాయకంగా ఉంటుందంటే ఈ పుస్తకాన్ని అమెరికాలో ఎన్నో బళ్లు పిల్లలు తప్పనిసరిగా సిలబస్‌లో పెట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment