
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నల్గొండ: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి ఆరేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నించాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ హరిబాబు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూరు మండలం ఈదులూరు గ్రామానికి చెందిన చలకపల్లి రమేశ్(27) తన స్నేహితుడి బంధువుల ఇంటివద్ద జరిగిన శుభకార్యానికి హాజరయ్యాడు. కార్యక్రమం అనంతరం మద్యం సేవించి ఆ గ్రామంలోని సంబంధిత బంధువులకు చెందిన ఆరేళ్ల చిన్నారిని మాయమాటలతో దగ్గరకు పిలుచుకున్నాడు.
మద్యంమత్తులో లైంగికదాడికి యత్నించాడు. దీంతో ఆ చిన్నారి ఏడవటంతో వదిలేశాడు. ఆ చిన్నారి ఏడుచుకుంటూ రావడాన్ని గమనించిన కుటింబీకులు ఏం జరిగిందని అడుగగా విషయాన్ని వివరించింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు, బంధువులు రమేశ్‌ను పట్టుకొని చితకబాదారు అనంతరం పోలీసులకు అప్పజెప్పేందుకు ప్రయత్నించగా అక్కడనుంచి తప్పించుకొని పరారయ్యాడు. బాధిత చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసునమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ హరిబాబు తెలిపారు.
చదవండి: యువకుడు, మహిళ ఆత్మహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
చదవండి: తండ్రి ఆవేదన: కష్టపడి చదివించుకున్నా.. అలా చేస్తుందనుకోలేదు..
Comments
Please login to add a commentAdd a comment