ఎంతమంచి వంటకం అయినా నోటికి రుచిగా లేకపోతే అస్సలు తినబుద్దికాదు. ఇక చేదుగా ఉండే కాకర కాయ డిష్ అంటే..‘‘అమ్మో కాకరకాయ’’ అంటూ ముఖం మాడ్చేస్తారు. అనేక పోషకాలున్న కాకరకాయను మళ్లీమళ్లీ తినాలనిపించేలా ఎలా వండాలో చెబుతోంది ఈ వారం మన వంటిల్లు...
బిట్టర్ ఆమ్లెట్ తయారీకి కావాల్సినవి..
కాకకర కాయ – మీడియం సైజుది ఒకటి
గుడ్లు – మూడు
ఉప్పు – రెండు టీస్పూన్లు
గరం మసాలా – అరటీస్పూను
నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
తయారీ విధానమిలా..
కాకర కాయను శుభ్రంగా కడిగి, విత్తనాలు తీసేసి సన్నగా తరగాలి. మరుగుతోన్న నీళ్లలో కొద్దిగా నూనె, టీస్పూను సాల్ట్ , కాకరకాయ ముక్కలు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. ఉడికిన ముక్కలను నీటినుంచి వేరుచేసి, తడిలేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి. గిన్నెలో గుడ్లసొనను వేసి చక్కగా కలపాలి. ఈ సొనలో రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, కాకరకాయ ముక్కలు వేసి కలపాలి. పెనం మీద నూనెవేసి, వేడెక్కిన తరువాత గుడ్ల మిశ్రమం వేసి రెండు వైపులా చక్కగా కాల్చితే బిట్టర్ ఆమ్లెట్ రెడీ.
Comments
Please login to add a commentAdd a comment