Atharva: ఆకట్టుకుంటున్న ఐరా లుక్‌ | Ayraa First Look Poster Out From Atharva Movie | Sakshi
Sakshi News home page

Atharva: ఆకట్టుకుంటున్న ఐరా లుక్‌

Published Wed, Oct 12 2022 2:10 PM | Last Updated on Wed, Oct 12 2022 2:10 PM

Ayraa First Look Poster Out From Atharva Movie - Sakshi

యంగ్ హీరో కార్తీక్ రాజు ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘అధర్వ’. మహేశ్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పెగ్గో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సుభాష్‌ నూతలపాటి నిర్మిస్తున్నారు.  క్రైమ్ థ్రిల్లర్ మూవీగా డిఫరెంట్ కాన్సెప్ట్ టచ్ చేస్తూ రాబోతున్న ఈ చిత్రంలో  సిమ్రాన్ చౌదరి, ఐరా ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌కు విశేషమైన స్పందన వచ్చింది.

దీంతో అదే జోష్‌లో తాజాగా ఐరా ఫస్ట్ లుక్ పోస్టర్ వదిలారు. నేను నమ్మిన సత్యం, వెతికే లక్ష్యం, దొరకాల్సిన సాక్ష్యం చేధించేవరకు ఈ కేసును వదిలిపెట్టను సార్..’ అంటూ మోషన్ పోస్టర్‌లోని డైలాగ్ అందరిలోనూ ఈ అధర్వ సినిమాపై ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. ఇందులో హీరో కార్తీక్ రాజు పవర్‌ఫుల్ రోల్‌ పోషించినట్టు గతంలో వచ్చిన ఫస్ట్ లుక్ ను బట్టి అర్థమైంది. డీజే టిల్లు, మేజర్ లాంటి సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు బాణీలు కట్టడం విశేషం. అరవింద్ కృష్ణ, కబీర్ సింగ్ దుహాన్, కల్పిక గణేష్, గగన్ విహారి, రామ్ మిట్టకంటి, కిరణ్ మచ్చ, మారిముత్తు, ఆనంద్, విజయరామరాజు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement