ప్రేమ.. భావోద్వేగం  | Atharava Teaser: Karthik Raju Promised A Complete Action Packed Entertainer | Sakshi
Sakshi News home page

ప్రేమ.. భావోద్వేగం 

Published Fri, Oct 20 2023 3:23 AM | Last Updated on Fri, Oct 20 2023 3:23 AM

Atharava Teaser: Karthik Raju Promised A Complete Action Packed Entertainer - Sakshi

కార్తీక్‌ రాజు హీరోగా సిమ్రాన్‌ చౌదరి, ఐరా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్‌ నూతలపాటి  నిర్మించారు. ఈ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. 

దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ–‘‘సస్పెన్స్, క్రైమ్‌ జానర్లకు రొమాంటిక్, లవ్‌ ట్రాక్‌ను జోడించి అన్ని రకాల భావోద్వేగాలతో తెరకెక్కించిన చిత్రం ‘అథర్వ’. క్లూస్‌ టీమ్‌ విశిష్టతను,ప్రాముఖ్యతను చూపించే కథనం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. సినిమా ఔట్‌పుట్‌ పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నాం. ప్రస్తుతం సెన్సార్‌ జరుగుతోంది.. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్స్‌: విజయ, ఝాన్సీ.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement