థ్రిల్లింగ్‌ అథర్వ.. త్వరలోనే టీజర్, ట్రైలర్‌ | Karthik Raju Atharva Movie Updates | Sakshi
Sakshi News home page

థ్రిల్లింగ్‌ అథర్వ.. త్వరలోనే టీజర్, ట్రైలర్‌

Published Tue, Jan 17 2023 12:49 AM | Last Updated on Tue, Jan 17 2023 8:05 AM

Karthik Raju Atharva Movie Updates - Sakshi

కార్తీక్ రాజు, సిమ్రాన్‌ చౌదరి, ఐరా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అథర్వ’. నూతలపాటి నరసింహం, అనసూయమ్మ సమర్పణలో సుభాష్‌ నూతలపాటి నిర్మిస్తున్నారు. నేడు కార్తీక్‌ రాజు బర్త్‌ డే. ఈ సందర్భంగా ఈ సినిమా అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్‌.

‘‘క్రైమ్, థ్రిల్లింగ్, ఎమోషన్స్‌.. ఇలా అన్ని జానర్లను టచ్‌ చేసేలా ఈ సినిమా ఉంటుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ చివరి దశలో ఉన్నాయి. త్వరలోనే టీజర్, ట్రైలర్‌ను రిలీజ్‌ చేసేలా ప్లాన్‌ చేస్తున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్‌ చేయాలనుకుంటున్నాం’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement