యానిమల్‌ పోటీ.. అయినా తప్పలేదు: ‘అథర్వ’ నిర్మాత | Sakshi
Sakshi News home page

యానిమల్‌ పోటీ.. అయినా తప్పలేదు: ‘అథర్వ’ నిర్మాత

Published Tue, Nov 28 2023 5:16 PM

Producer Subhash Nuthalapati Talk About Atharva Movie - Sakshi

ప్రతి వారం మూడు, నాలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. డిసెంబర్‌ ఒకటవ తేదిన పాన్‌ ఇండియా మూవీ ‘యానిమల్‌’తో పాటు అథర్వ కూడా రిలీజ్‌ అవుతుంది. మరో వారం నాని సినిమా..ఆ తర్వాత ప్రభాస్‌ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందుకే డిసెంబర్‌ 1 మా చిత్రానికి సరైన డేట్‌ అనిపించింది, మా చిన్న చిత్రంపై యానిమల్‌ ప్రభావం ఉంటుందని తెలిసినా..రిలీజ్‌ చేయక తప్పట్లేదు’ అని అన్నారు నిర్మాత  సుభాష్ నూతలపాటి. కార్తీక్ రాజు, సిమ్రాన్ చౌదరి, ఐరా  హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘అథర్వ’.  మహేష్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుభాష్ నూతలపాటి నిర్మించారు.విజయ, ఝాన్సీ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరించారు. డిసెంబర్ 1న ఈ చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో నిర్మాత సుభాష్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

ప్రస్తుతం అందరూ థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడుతున్నారు. అథర్వలో సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉంటాయి. క్లూస్ డిపార్ట్మెంట్ మీద ఇంత వరకు సినిమా రాలేదు. వారు చేసే పనిని ఇందులో మరింత డీటైలింగ్‌గా చూపిస్తాం. ప్రతీ పది నిమిషాలకు ఓ ట్విస్ట్ ఉంటుంది.

మా డైరెక్టర్ మహేష్ రెడ్డి బ్రదర్ క్లూస్ టీంలో పని చేస్తున్నారు. క్లూస్ టీం వెంకన్న గారితో మా డైరెక్టర్ ఆరు నెలలు కలిసి రీసెర్చ్ చేశారు. ప్రతీ విషయాన్ని ఎంతో క్షుణ్నంగా రీసెర్చ్ చేశారు. క్లూస్ టీంకు ప్రివ్యూ వేస్తే వారంతా చాలా ఎమోషనల్ అయ్యారు.

ప్రతీ సినిమాకు బడ్జెట్‌ పెరుగుతూనే ఉంటుంది. అయితే సినిమాను మరింత బాగా తీయాలనే ఉద్దేశంతోనే ఖర్చు పెడతాం. ఈ సినిమా కోసం స్పెషల్ సెట్స్ వేశాం. వాటి గురించి ఇప్పుడే చెప్పలేం. సినిమా చూస్తే అందరికీ అర్థం అవుతుంది.

అథర్వలో ఇద్దరు హీరోయిన్లు ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తారు. కథలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉండటంతోనే పెట్టాం. ఒకరు క్రైమ్ రిపోర్టర్‌గా నటించారు. ఇంకొకరు సినిమాలో సినిమా హీరోయిన్‌గా నటించారు.

ప్రతీ వారం ఏదో ఒక సినిమా వస్తూనే ఉంటుంది. తరువాత నాని, ప్రభాస్ గార్ల సినిమాలున్నాయి. ఇలా ఎప్పుడూ ఏదో ఒక సినిమా ఉంటుంది. యానిమల్ ప్రభావం ఉంటుందని తెలిసినా మాకు ఇదే సరైన డేట్ అనిపించింది. 

అథర్వ చిత్రంలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. అన్ని రకాల జానర్లు ఇందులో ఉంటాయి. ఒక్కొక్కొరికి ఒక్కో పాయింట్ నచ్చింది. ముఖ్యంగా ట్విస్టులు అందరినీ ఆకట్టుకున్నాయి.

Advertisement
Advertisement