సైకలాజికల్‌ థ్రిల్లర్‌ | Bahumukham Movie Teaser Launch | Sakshi
Sakshi News home page

సైకలాజికల్‌ థ్రిల్లర్‌

Published Mon, Feb 26 2024 2:34 AM | Last Updated on Mon, Feb 26 2024 2:34 AM

Bahumukham Movie Teaser Launch - Sakshi

హర్షివ్‌ కార్తీక్, శశికిరణ్‌

హర్షివ్‌ కార్తీక్‌ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సస్పెన్స్ అండ్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ మూవీ ‘బహుముఖం’. ‘గుడ్, బ్యాడ్‌ అండ్‌ ది యాక్టర్‌’ అనేది ట్యాగ్‌లైన్ . ఈ చిత్రంలో స్వర్ణిమ సింగ్, మరియా మార్టినోవా హీరోయిన్లుగా నటించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ టీజర్‌ రిలీజ్‌ వేడుకకి అతిథిగా హాజరైన డైరెక్టర్‌ శశి కిరణ్‌ తిక్క మాట్లాడుతూ– ‘‘బహుముఖం’ టీజర్‌ బాగుంది.

టీజర్‌ చూస్తుంటే విజువల్స్‌తో పాటుగా సౌండ్‌కి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం కార్తీక్‌ చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అన్నారు. ‘‘అమెరికాలో చేసిన పక్కా తెలుగు సినిమా ఇది. ప్రేక్షకులకు గుర్తుండిపోవాలనే ఉద్దేశంతో ఈ చిత్రం చేశాం’’ అన్నారు హర్షివ్‌ కార్తీక్‌. చిత్ర సంగీత దర్శకుడు ఫణి కళ్యాణ్, నేపథ్య సంగీతం అందించిన శ్రీ చరణ్‌ పాకాల మాట్లాడారు. ఈ చిత్రానికి సహ–నిర్మాత అరవింద్‌ రెడ్డి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement