Adivi Sesh Major Promise To Those Who Wants To Join In Army: ‘‘ఎమోషనల్‌గా, కలెక్షన్స్ పరంగా ఇప్పటివరకూ నా సినిమాలన్నిటి కంటే ‘మేజర్’ ఐదు రెట్లు పెద్దది. ఈ సినిమా చూసిన చాలామంది ఫోర్స్‌లో జాయిన్ అవ్వాలని ఉందని మెసేజ్ పెడుతున్నారు. ఈ వేదికపై నేనొక మేజర్ ప్రామిస్ చేస్తున్నాను. సీడీఎస్, ఎన్డీఏలో చేరాలనుకుని సరైన వనరులు లేక కష్టపడుతున్నవారికి సపోర్ట్ చేయాలని మా టీమ్ నిర్ణయించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పేరుతో ఈ మూమెంట్‌ని లాంచ్ చేస్తాం’’ అన్నారు అడివి శేష్.
26/11 ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ‘మేజర్’. సందీప్ పాత్రలో అడివి శేష్ నటించగా, శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. మహేశ్‌బాబు జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం జూన్ 3న విడుదలైంది. ఈ నేపథ్యంలో శనివారం ‘ఇండియా లవ్స్ మేజర్’ ప్రెస్ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్. దర్శకుడు శశికిరణ్ మాట్లాడుతూ– ‘‘సందీప్ రియల్ హీరో అని తెలుసు కానీ ఈ సినిమాకి నన్ను డైరెక్టర్‌గా చేయమని శేష్ అన్నప్పుడు నేను పెద్దగా స్పందించలేదు. ఆ తర్వాత ఒక టీమ్‌ని ఏర్పాటు చేసుకుని, సందీప్ గురించి చాలా విషయాలు తెలుసుకుంటూ ఈ సినిమా చేశాం. శేష్‌కి స్పెషల్ థాంక్స్. అలాగే రచయిత అబ్బూరి రవిగారి సపోర్ట్‌ని మర్చిపోలేం’’ అని తెలిపారు.
చదవండి: 'మేజర్'పై సందీప్ తండ్రి రియాక్షన్.. కన్నీళ్లు పెట్టుకున్న తల్లి
‘‘మా మొదటి సినిమా ‘మేజర్’ గొప్ప విజయాన్ని సాధించడం ఆనందంగా ఉంది. అడివి శేష్ మేజర్ సందీప్ కథ చెప్పడం, నమ్రత మేడమ్ గారిని కలవడం, తర్వాత సోనీ పిక్చర్స్ రావడం.. ఇలా యూనిట్ అంతా నమ్మకంగా పని చేశాం. ఆ నమ్మకమే ఇప్పుడు తెరపై అంత అద్భుతంగా కనిపిస్తోంది. ‘మేజర్’ లాంటి క్లాసిక్ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ప్రేక్షకులు ఒక ఎమోషనల్ లెవల్ దాటి మనసుతో స్పందిస్తున్నారు’’ అని నిర్మాతలు శరత్, అనురాగ్ పేర్కొన్నారు. చిత్రకథానాయిక సయీ మంజ్రేకర్, సినిమాటోగ్రాఫర్ వంశీ పచ్చిపులుసు, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, నటుడు అనీష్ కురువిల్లా ‘మేజర్’ విజయం పట్ల తమ ఆనందం వ్యక్తం చేశారు.
చదవండి: మేజర్ గుండెల్ని పిండేసే సినిమా: అల్లు అర్జున్
Comments
Please login to add a commentAdd a comment