Margarita
-
ఒలింపిక్ చాంపియన్ సంచలన నిర్ణయం
మాస్కో : ఒలింపిక్ చాంపియన్, రష్యా జిమ్నాస్ట్ మార్గరిటా మామున్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేవలం 22 ఏళ్ల వయసులో కెరీర్‌కు గుడ్ బై చెప్పింది. ఈ విషయాన్ని మార్గరిటా కోచ్ ఇరినా వైనర్ ఉస్మనోవా రష్యా మీడియా సంస్థ టాస్కు తెలిపారు. 'మామున్ కెరీర్ క్ స్వస్తి పలికారు. ఇక ఆమె పోటీలో పాల్గొనదు. క్రీడల్లో ఆమె పోరాటం ముగిసింది' అంటూ ఇరినా వెల్లడించారు. గతేడాది (2016) బ్రెజిల్ లోని రియో డీ జనీరోలో జరిగిన రిథమిక్ జిమ్నాస్టిక్ పోటీలో దేశానికే చెందిన యానా కుర్దవత్సేవాను ఓడించి పసిడి పతకాన్ని సగర్వంగా అందుకుంది మార్గరిటా మామున్. 2000 నుంచి జరుగుతున్న జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో కనీసం ఓ పసిడిని తన ఖాతాలో వేసుకుంది మార్గరిటా. రష్యా-బంగ్లాదేశ్ దంపతులకు మాస్కోలో జన్మించిన ఈ ఒలింపిక్ చాంపియన్.. ఏడు ప్రపంచ చాంపియన్ షిప్ స్వర్ణాలు సాధించింది. కెరీర్లో ఓవరాల్‌గా 28 స్వర్ణాలు, 13 రజతాలు, ఓ కాంస్యంతో జిమ్నాస్టిక్స్ లో తనకు తిరుగులేదని నిరూపించుకుంది రష్యా జిమ్నాస్ట్. ఆమె ఆకస్మిక నిర్ణయంపై క్రీడా విశ్లేషకులు షాక్‌కు గురయ్యారు. -
'అమీర్ ఖాన్ కంటతడి పెట్టాడు'
ముంబై: బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కంటతడి పెట్టాడు..'మార్గరిటా' విత్ ఏ స్ట్రా చిత్రాన్ని స్పెషల్ షోలో చూసిన అమీర్ ఖాన్ ప్రశంసలతో ముంచెత్తారని హీరోయిన్ కల్కి కోయిచ్లిన్ ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ చిత్రంలో ఏముంటిందిలే అంటూ.. భార్య కిరణ్ రావు బలవంతం మీదే మార్గరిటా చిత్రాన్ని అమీర్ ఖాన్ చూశారని, అయితే ఈ సినిమా చూసే సమయంలో అమీర్ కంటతడి పెట్టకుండా ఉండలేక పోయారన్నారు. అమీర్‌కి ఈ సినిమా బాగా నచ్చిందన్నారని కల్కి చెప్పారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో అందరి ప్రశంసలు అందుకున్న తర్వాత భారత అభిమానుల ముందుకు ఈ చిత్రం త్వరలో రాబోతోంది. ఈ చిత్రంలో కల్కి ఒక 'మస్తిష్క పక్షవాతం'(సెరెబ్రల్ పల్సి) వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి పాత్రలో నటించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షోకి మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తోపాటు ఆయన భార్య జయాబచ్చన్ కూడా వచ్చి తిలకించారు.