సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో రానా ప్రస్తుతం పీరియాడిక్ జానర్‌లో తెరకెక్కుతున్న హాథీ మేరీ సాథీ సినిమాలో నటిస్తున్నాడు. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు తెలుగులో అరణ్య అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో రానాకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ నటించనుందన్న టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్‌లో విభిన్న పాత్రల్లో ఆకట్టుకున్న కల్కి కొచ్చిన్, అరణ్యలో రానాకు జోడీగా నటించనుంది. పాండిచ్చేరిలో పుట్టి పెరిగిన కల్కికి తమిళ్ చాలా బాగా వచ్చు. అందుకే సౌత్ సినిమాలో అవకాశం వచ్చిన వెంటనే ఒప్పేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment