‘లీడర్’ సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన రానా దగ్గుబాటి కేవలం హీరో పాత్రలే కాకుండా విలన్ పాత్రలు చేస్తూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. టాలీవుడ్‌తో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న రానా తాజాగా బహు భాషా చిత్రంగా రూపొందుతున్న ‘హాథీ మేరే సాథీ’ సినిమాలో నటిస్తున్నాడు. ఈరోస్ ఇంటర్నేషనల్ పతాకంపై ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందుతోంది. జంతువులు-మానవుల మధ్య సంబంధాల్ని ప్రతిబింబించే వాస్తవ కథాంశాలతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమా హిందీలో ‘హాథీ మేరే సాథీ’, తెలుగులో ‘అరణ్య’గా, తమిళంలో ‘కాదన్’గా ప్రేక్షకుల ముందుకు రానుంది. (కేరాఫ్ కేరళ అడవులు).
ఈ సినిమా అధిక భాగాన్ని కేరళ అడవుల్లో చిత్రీకరించారు. ఆస్కార్ విజేత రసూల్ సౌండ్ ఇంజినీర్‌గా పనిచేశాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తాజాగా సినిమాలో రానా పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రానా డిఫరెంట్ వేషధారణ, హావభావాలతో అగ్రెసివ్‌గా కనిపిస్తున్నారు. రౌద్రంగా.. కన్నెర్ర చేస్తూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. రానా ఫస్ట్ లుక్‌తో అభిమానులకు సినిమా అంచనాలు మరింత పెంచాయి. జోయా హుస్సేన్, శ్రియా పిల్లావుంకర్, పుల్‌కిత్ సామ్రాట్, విష్ణు విశాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా అన్ని భాషల్లో ఏప్రిల్ 2న విడుదల కానుంది. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మైథాలజీ మూవీ ‘హిరణ్యకశ్యప’ లో రానా నటించనున్నారు. (బాహుబలి కంటే గొప్పగా...)
Release date finalized... #HaathiMereSaathi to release on 2 April 2020... Will also release simultaneously in #Tamil and #Telugu... Stars #RanaDaggubati... Directed by Prabu Solomon... Produced by Eros International. pic.twitter.com/WHS9PTighw
— taran adarsh (@taran_adarsh) February 10, 2020
Comments
Please login to add a commentAdd a comment