సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటిన స్టార్ వారసుడు రానా. కెరీర్ స్టార్టింగ్ నుంచి హీరో అన్న ఇమేజ్‌లో ఫిక్స్ అవ్వకుండా విలన్, క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. బాహుబలి సినిమాతో రానా ఇమేజ్ తారా స్థాయికి చేరింది. కానీ బాహుబలి తరువాత రానా స్పీడు తగ్గించేశాడు.
కొద్ది రోజులు క్రితం రానా ఆరోగ్య పరిస్థితి పై రకరకాల వార్తలు వినిపించాయి. రానా తండ్రి సురేష్ బాబు కూడా రానా చిన్న ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టుగా వెల్లడించారు. తాజాగా రానా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంటపడ్డాడు. ఈ ఫోటోల్లో రానా లుక్ మరోసారి చర్చకు దారి తీస్తోంది.
బాగా సన్నబడ్డ రానాను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం హాథీ మేరే సాథీ, విరాటపర్వం సినిమాల్లో నటిస్తున్న రానా ఆ సినిమాల కోసం ఇలా బరువు తగ్గాడా? లేక హెల్త్ ప్రాబ్లం కారణంగా తగ్గాడా? అని చర్చించుకుంటున్నారు. మరి ఈ వార్తలపై రానా ఎప్పుడు స్పందిస్తాడో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment