సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటిన స్టార్ వారసుడు రానా. కెరీర్ స్టార్టింగ్ నుంచి హీరో అన్న ఇమేజ్‌లో ఫిక్స్ అవ్వకుండా విలన్, క్యారెక్టర్ రోల్స్ కూడా చేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు రానా. ప్రస్తుతం రానా బహు భాషా చిత్రంగా తెరకెక్కుతున్న హాథీమేరి సాథీ సినిమాలో నటిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పిక్‌లో రానా బాగా పెరిగిన గెడ్డంతో వయసైన వ్యక్తిలా కనిపిస్తున్నాడు. ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్‌లో నీట్ షేవ్‌తో కనిపించిన రానా ఇప్పుడు పూర్తిగా మారిపోయిన ఓ అడవి మనిషిలా కనిపిస్తున్నాడు.
ఈ సినిమా తరువాత పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కనున్న విరాటపర్వం సినిమాలో నటించనున్నాడు రానా. అంతేకాదు గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో హిరణ్యకశ్యప అనే పౌరాణిక చిత్రాన్ని స్వయంగా నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment