సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా అన్ని భాషల్లోనూ వరుస సినిమాలతో దూసుకుపోతున్న దక్షిణాది నటుడు రానా. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రానా, ప్రస్తుతం బహుభాషా చిత్రాలుగా తెరకెక్కుతున్న హాథీ మేరి సాథి, రాజా మార్తాండ వర్మ సినిమాల్లో నటిస్తున్నాడు. మరికొన్ని ఇంట్రస్టింగ్ సినిమాలకు చేతిలో ఉన్న రానాకు హాలీవుడ్ నుంచి పిలుపు వచ్చినట్టుగా తెలుస్తోంది.
ఓ హాలీవుడ్ యాక్షన్ మూవీలో అతిథి పాత్ర కోసం రానాను సంప్రదించారట. అయితే ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉన్న రానా, ప్రస్తుతానికి హాలీవుడ్ ప్రాజెక్ట్‌ను పెండింగ్‌లో పెట్టినట్టుగా తెలుస్తోంది. సెట్స్‌మీద ఉన్న సినిమాలు ఓ కొలిక్కి వచ్చిన తరువాత డేట్స్ అడ్జస్ట్ అయితే హాలీవుడ్ సినిమాలో నటించే ఆలోచనలో ఉన్నాడట. రానా కీలక పాత్రలో నటించిన యన్.టి.ఆర్ మహానాయకుడు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment