బిడ్డ సరే... మరి నీ భర్త ఎక్కడ? | Kalki Koechlin Shares About Trolls Over Her Pregnancy | Sakshi
Sakshi News home page

నువ్వసలు ఇలా చేస్తావనుకోలేదు.. జాగ్రత్త

Published Thu, Oct 31 2019 9:22 AM | Last Updated on Thu, Oct 31 2019 9:26 AM

Kalki Koechlin Shares About Trolls Over Her Pregnancy - Sakshi

ముంబై : తాను తల్లి కాబోతున్నానని ప్రకటించిన నాటి నుంచి బాలీవుడ్‌ హీరోయిన్‌ కల్కి కొచ్లిన్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. గతంలో బాలీవుడ్‌ డైరెక్టర్‌, నటుడు అనురాగ్‌ కశ్యప్‌ను వివాహం చేసుకున్న కల్కి.. 2015లో అతడి నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె... జెరూసలేం(ఇజ్రాయెల్‌)కు చెందిన పియానిస్ట్‌ గయ్‌ హర్ష్‌బర్గ్‌తో సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం గర్భం దాల్చిన కల్కి.. తాను త్వరలోనే మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవించబోతున్నానంటూ సన్నిహితులు, అభిమానులతో పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. బేబీ బంప్‌తో కనిపిస్తున్న కల్కి ఫొటోలను కొంతమంది నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. ‘ బిడ్డను కంటున్నావు సరే. మరి నీ భర్త ఎక్కడ. నువ్వసలు ఇలా చేస్తావని అనుకోలేదు. సరే జరిగిందేదో జరిగింది. ఇప్పుడైనా జాగ్రత్తగా ఉండు. సౌకర్యవంతంగా ఉండే దుస్తులు వేసుకో’ అంటూ చివాట్లు పెడుతూనే జాగ్రత్తలు చెబుతున్నారు. 

ఈ విషయంపై స్పందించిన కల్కి పింక్‌విల్లాతో మాట్లాడుతూ... ‘ నేను సెలబ్రిటీ కాబట్టి అందరూ నాపై దృష్టిసారిస్తున్నారు. ఒకవేళ నేను కూడా సెలబ్రిటీ కాకపోయినా నా అభిప్రాయాలు, నిర్ణయాలకు అందరి ఆమోదం లభించదు. నన్ను తిడుతున్న వాళ్లతో పాటు అండగా నిలిచేవాళ్లు కూడా ఉన్నారు. అయితే వారంతా నాకు నేరుగా ఎదురుపడటం లేదు. ఎవరు ఏమన్నా ఇది నా జీవితం. ఇక ఎవరి సంగతి ఎలా ఉన్నా మా అపార్టుమెంటులో చాలా మందికి తెలుసు... నేను డివోర్సీని. నాకు ఇప్పుడు పెళ్లి కాలేదు అని. అయినా కొంతమంది ఆంటీవాళ్లు నా పట్ల ప్రేమపూర్వకంగానే ఉంటున్నారు. తినడానికి ఏమైనా చేసి పెట్టాలా అమ్మా అని అడుగుతున్నారు. వాళ్లు నిజంగా నాకు ఎంతో మనోస్థైర్యాన్ని ఇస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు. ఇక ఇరవైల్లోనే.... డివోర్సీ అయిన అనురాగ్‌ను పెళ్లి చేసుకున్న కల్కి స్వల్ప కాలంలోనే అతడి నుంచి విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో పాటు, వెబ్‌సిరీస్‌లతోనూ బిజీగా ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement