ధైర్యం కావాలి | Radhika Apte, Kalki Koechlin And Rajkummar Rao Got A Surprise Coming | Sakshi
Sakshi News home page

ధైర్యం కావాలి

Published Mon, Nov 12 2018 2:28 AM | Last Updated on Mon, Nov 12 2018 2:28 AM

Radhika Apte, Kalki Koechlin And Rajkummar Rao Got A Surprise Coming - Sakshi

రాజ్‌కుమార్‌ రావు, రాధికా ఆప్టే

ఈ ఏడాది ఫుల్‌ రైజింగ్‌లో ఉన్నారు కథానాయిక రాధికా ఆప్టే. ఇటు బాలీవుడ్‌ సినిమాలతో పాటు అటు హాలీవుడ్‌ చాన్స్‌లను దక్కించుకుంటున్నారు. మరోవైపు డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లోనూ సత్తా చాటుతున్నారు. తాజాగా ఈ బ్యూటీ మరో హిందీ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. రాజ్‌కుమార్‌ రావు హీరోగా నటిస్తారు. అలాగే కల్కి కోచ్‌లిన్‌ మరో కథానాయిక. మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. ఇందులో ఓ డైనమిక్‌ లేడీ పాత్రలో కనిపించనున్నారు రాధిక.

‘‘ఓ ఖాళీ ప్రదేశంలో కనిపించకుండా ఉన్నారు. వారిని దాటుకుంటూనే చాలామంది వెళ్తుంటారు. ఆ కనిపించనివారికి హలో కూడా చెప్పవచ్చు. కానీ వాళ్ల గురించి తెలుసుకోవడానికి మాత్రం ధైర్యం కావాలి. కమింగ్‌ సూన్‌’’ అని ఈ సినిమా కథనాన్ని వివరించే ప్రయత్నం చేశారు రాధిక. ‘‘ఈ మూవీలో మంచి ఎమోషనల్‌ కంటెంట్‌ ఉంటుంది. ప్రస్తుతానికి ఇంతకు మించి చెప్పలేను. ఈ నెల 13న మరిన్ని వివరాలు చెబుతాం’’ అని రాజ్‌కుమార్‌ రావు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement