
ప్రతికాత్మక చిత్రం
కొన్ని నెలల క్రితం విమానంలో బాలీవుడ్ మైనర్ నటిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రయాణికున్ని సహారా పోలీసులు అరెస్ట్ చేశారు. నటి చేసిన ఫిర్యాదు మేరకు వికాస్ సచ్‌దేవ్ (39) అనే వ్యక్తి మీద పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి, దిన్‌దోషి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు పోలీసలు తెలిపారు. వివరాల ప్రకారం.. కొన్ని నెలల క్రితం బాలీవుడ్ ఫేం ‘దంగల్’ నటి ఢిల్లీ - ముంబై విమానంలో ప్రయాణం చేస్తున్నారు. ఆ సమయంలో ఆమె పక్కన కూర్చున్న తోటి ప్రయాణికుడు వికాస్ సచ్‌దేవ్ తనతో తప్పుగా ప్రవర్తించాడని, తనను అసభ్యరీతిలో తాకడానికి ప్రయత్నించాడని ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సదరు నటి తనకు జరిగిన అనుభవాన్ని గురించి చెప్తూ వీడియో తీసి, తన సోషల్‌మీడియాలో పోస్టు చేశారు.
ఈ వీడియో వైరల్‌గా మారటమే కాక సదరు నటికి దేశవ్యాప్తంగా మద్దతు లభించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం గురించి సచ్‌దేవ్ ఆ సమయంలో తాను అలసిపోయి గాఢనిద్రలో ఉన్నానని.. ఏం చేశానో తనకు తెలియదని తెలిపాడు. అంతేకాక ఆమె కావాలనే తన మీద ఇలాంటి ఆరోపణలు చేస్తోందని ఆరోపించాడు. సచ్‌దేవ్ లీగల్ టీం కూడా అతనికి మద్దతూ ఇస్తూ నిజంగా అలాంటి పరిస్థితే ఎదురయితే సదరు నటి విమానంలో ఉన్న అలారంను మోగించాల్సింది అంటున్నారు. అంతేకాక ఈ విషయం గురించి కోర్టులోనే పోరాడతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment