బాలీవుడ్తో పాటు, ఖాన్లపై వర్మ ఏమన్నారంటే.. | Which Star of Bollywood since Alam Ara would have taken a decision of putting on weight to look like a father of grown up daughters ? | Sakshi
Sakshi News home page

మ‍ళ్లీ రెచ్చిపోయిన రాంగోపాల్‌ వర్మ..

Published Wed, Dec 28 2016 4:49 PM | Last Updated on Mon, Sep 4 2017 11:49 PM

బాలీవుడ్తో పాటు, ఖాన్లపై వర్మ ఏమన్నారంటే..

బాలీవుడ్తో పాటు, ఖాన్లపై వర్మ ఏమన్నారంటే..

ముంబై: వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ  మరోసారి ట్విట్టర్ లో సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. బస్తీమే  సవాల్ అంటూ.. వంగ వీటి సినిమా వివాదాన్ని చాలెంజ్ చేసిన  వర్మ  ఈ సారి బాలీవుడ్ ఖాన్ లపై  విరుచుకుపడ్డారు.  అమీర్ ఖాన్  తాజా మూవీ దంగల్ పై ప్రశంసలు కురిపించడంతో పాటుగా  అటు సినిమా ఇండస్ట్రీపై , ఇటు ఇతర ఖాన్ లపై  వరుస ట్వీట్లలో  రెచ్చిపోయి కమెంట్ చేశారు.

భారతీయ ప్రేక్షకుల తెలివితేటలపై అమిర్ ఖాన్ నమ్మకానికి సలాం కొట్టాల్సిందే. సూపర్ స్టార్లు ఎప్పటికీ యంగ్ గానే కనిపిస్తుంటారు. 50ల తర్వాత కూడా సిక్స్ ప్యాక్ లు చేసి చూపిస్తుంటారు. అమిర్ కూడా అదే చేశాడు. అసాధ్యం అనుకున్న వాటిని చేసి చూపిస్తాడు.అలా ఎదగడంలో అమీర్  సిన్సియారిటీని చూస్తే.. ఆయన పాదాలను తాకాలని ఉంది. అమిర్ కారణంగా ప్రపంచం అంతా ఇండియాను సీరియస్ గా తీసుకోవాల్సి వస్తుంది.  బాలీవుడ్ లో ఆలం ఆరా కాలం నుంచి చూస్తున్నా.. ఏ స్టార్ హీరో అయినా తండ్రిగా కనిపించేందుకు బరువు పెరిగి లావుగా కనిపించాలని అనుకున్నాడా? ఇతర ఖాన్స్ అంతా ప్రేక్షకులను వెర్రివాళ్లను చేద్దామని అనుకుంటే.. అమిర్ మాత్రం ప్రేక్షకుల ఇంటెలిజెన్స్ ను నమ్ముతాడు' అంటూ  ట్వీట్ చేశాడు.   ఇంతటితో సరిపెట్టలేదు వర్మ...  'దంగల్‌' చూశాక మొత్తం చిత్ర పరిశ్రమతోపాటు మిగిలిన ఖాన్లు కూడా జిమ్నాస్టిక్‌, మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకుని తీరాలని తాను ఫీల్ అవుతున్నట్టు వర్మ ట్వీట్‌ చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement