సారూ.. ఈసారైనా! | Gossip | Sakshi
Sakshi News home page

సారూ.. ఈసారైనా!

Published Tue, Oct 6 2015 11:00 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సారూ.. ఈసారైనా! - Sakshi

సారూ.. ఈసారైనా!

 గాసిప్
 
ఐశ్వర్యరాయ్, ఆమిర్‌ఖాన్‌లు కలిసి నటిస్తే చూడాలనేది ఇద్దరి అభిమానుల చిరకాల కోరిక. కారణాలు ఏమైతేనేంగానీ... అదో తీరని కోరికగానే మిగిపోతోంది. నిజానికి ఐషు తన తొలి సినిమాను ఆమిర్‌తోనే చేయాల్సి ఉంది. అయితే ఆమిర్‌ఖాన్‌తో నటించే అవకాశాన్ని ఆమె తిరస్కరించింది. దీనికి సంబంధించి ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’ కార్యక్రమంలో ఆమె ఇలా చెప్పింది...

 ‘‘రాజా హిందుస్థానీ సినిమాలో ఆమిర్‌తో నటించే అవకాశం వచ్చింది. అయితే అప్పుడు నేను పూర్తిగా చదువులపైనే దృష్టి పెట్టాను. దీంతో ఆ ఆఫర్‌ను వదులుకోక తప్పలేదు’’ అని. ఐషు, ఆమిర్‌ఖాన్‌లతో ఒక సినిమా తీయడానికి గత సంవత్సరం కరణ్ జోహార్ ప్రయత్నించాడు.
 ఆమిర్‌కు స్క్రిప్ట్ నచ్చలేదని ఒకవైపు, ఆమిర్‌కు నచ్చిందిగానీ ఐశ్వర్యారాయ్‌కు నచ్చలేదని మరోవైపు గాసిప్‌లు వినబడ్డాయి. అయితే ఏది నిజమో తెలియదుగానీ మొత్తానికైతే ఈ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కలేదు.

 ‘‘ఆమిర్‌ఖాన్‌తో కలిసి ఎప్పుడు నటిస్తున్నారు?’’ అనే మీడియా ప్రశ్నకు -‘‘ఇది తెలుసుకోవాలని నాకు కూడా భలే ఆసక్తిగా ఉంది’’ అని అందంగా నవ్వేది ఐషు. బాలీవుడ్ సూపర్ స్టార్‌లు ఆమిర్‌ఖాన్, ఐశ్వర్యరాయ్‌లతో సినిమా తీయడానికి ఒక బాలీవుడ్ దర్శకుడు బాగా కష్టపడి ఒక స్క్రిప్ట్ తయారుచేసినట్లు వినికిడి. పుసుక్కున ఆ సినిమా వర్కవుట్ అయితే ఆమిర్, ఐషు అభిమానులకు పండగే. ఆ డెరైక్టర్ ఎవరో తెలిస్తే మాత్రం...‘సారూ... ఈసారైనా’ అని అభిమానులు వెంట పడడం ఖాయం!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement