గీత అద్భుతం! - ఆమిర్ | special chit chat with pk team | Sakshi
Sakshi News home page

గీత అద్భుతం! - ఆమిర్

Published Wed, Dec 10 2014 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM

గీత అద్భుతం! - ఆమిర్

గీత అద్భుతం! - ఆమిర్

సిటీకి ఎంతో మంది వస్తుంటారు...పోతుంటారు. కానీ ఆమిర్‌ఖాన్ మాత్రం స్పెషల్...
ఇతను ఆ....రడుగుల బుల్లెట్ కాడు... ఐదున్నర అడుగుల మిసైల్!
42 ఏళ్ళ వయస్సులో 18 ఏళ్ళ కుర్రతనం చూపాడు..
వినోదంలోనూ వివేకం కనబరుస్తాడు.
సమాజాన్ని నిద్రలేపుతూ సాక్షాత్తూ పార్లమెంట్‌నే దడదడలాడించాడు.

ఇవన్నీ ఆమిర్ గురించి తెలిసిన విషయాలు. కానీ స్వయంగా కలిస్తేనే తెలిసే సంగతులు, కలిగే స్ఫూర్తి మాటల్లో చెప్పడం కష్టం. చాలా మంది స్టార్స్‌ని చూస్తూంటాం కానీ, ఆమిర్‌ఖాన్ చుట్టూ ఉన్న పాజిటివ్ ఎనర్జీ తన పరిధిలోకి వచ్చిన వారందరినీ బహుశా తాకుతుందేమో. పదిమంది బాడీగార్డుల మధ్య ఈ కాంతికిరణం నడుచుకుంటూ వచ్చింది. మొదటిసారి ఆమిర్‌ని నేరుగా చూసాను.
 కళ్ళల్లో చిలిపితనం, సహజమైన మంచితనం, బాడీ లాంగ్వేజ్‌లో కాన్ఫిడెన్స్... ప్రవర్తనలో మనిషితనం.. స్పందనలో స్థిత ప్రజ్ఞత... ఇవన్నీ ఉన్నాయి కాబట్టే ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’ అనిపించుకున్నాడు ఆమిర్...

 ఇంతకీ...‘పీకే’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమిర్‌ఖాన్, అనుష్కాశర్మ ఇంకే పికే బృందం హైదరాబాద్ వచ్చారు. నేను రేడియో జాకీగా పనిచేస్తున్న బిగ్ ఎఫ్‌ఎమ్ నిర్వహించిన కాంటెస్ట్‌లో భాగంగా ఆమిర్‌ని కలిసే అవకాశం వచ్చింది. బిగ్ ఎఫ్‌ఎమ్ టీంతోపాటు ఆమిర్ ఎక్స్‌క్లూజివ్ చిట్‌చాట్ చేద్దామని వెళ్ళాను. ఆ సందర్భంగా వెలికి తీసిన కొన్ని సంగతులు...

హైదరాబాద్ మీకు వెల్‌కమ్ చెప్తోంది.
ఆమిర్: ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది.
మిమ్మల్ని మేం కేవలం ఒక స్టార్‌గా చూడట్లేదు. మీరు ఒక వ్యక్తిత్వం ఆమిర్!
ఆమిర్: నాపై ఇక్కడివారు చూపుతున్న ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. థాంక్యూ!

రాజూ హిరానితో మళ్ళీ పనిచేయడం ఎలా అనిపించింది?

ఆమిర్: మేము అనుకున్నది చేయగల్గుతామా, తెరపైకి తీసుకురాగల్గుతామా అన్నది ఒక్కటే నిత్యం మాముందుండే సవాల్. అంతకుమించి అంతా బావుంది. ఏమంటారు రాజూ? (రాజువైపు చూస్తూ)
 
రాజు: నిజమే! అంతిమంగా మనం తీసిన సినిమాని చూసి మనం గర్వపడాలి. అది అందరికీ నచ్చాలి. కనుక గతంలో తీసిన సినిమాకంటే బాగా రావాలన్న తపన ఉంటుంది.
 
అనుష్కా, ఆమిర్ నగ్నంగా ఉండే ఆ వివాదాస్పద పోస్టర్‌పై మీరు లేరేం?


అనుష్క: (ఉలిక్కిపడి)...ఉన్నానుగా... మిగిలినవాటిపై (నవ్వు) అవును ఆ పోస్టర్‌లో కూడా ఉండాల్సిందేమో!
 
‘పీకే’లో కళ్ళార్పకుండా నటించడం కష్టమనిపించిందా?

 
ఆమిర్: అవును. ిపీకేలో నా పాత్ర కళ్ళార్పకుండా ఉండడం.. కొంచెం కష్టమయ్యింది. అందులోనూ నేను కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాను. ఇలా చేయాలని సూచించింది విధువినోద్‌చోప్రా. రిహార్సల్స్‌లో తను చెప్పిన తర్వాత నా పాత్రకి కావలసిన మూలం దొరికింది. ....అదే కళ్ళార్పకపోవడం.
 
‘ప్రొడ్యూసర్ ఈజ్ కింగ్’ అంటారు. మరి మీరు?

వినోద్: నేను ప్రొడ్యూసర్‌ని కాను, మేమంతా కో-వర్కర్స్, అందరం సమానం. అది వాళ్ళంతా నాకు పెట్టిన పేరు మాత్రమే.
 
అనుష్కా! ఆమిర్‌తో నటించిన అనుభవం?

 
అనుష్క: వండర్‌ఫుల్, మొదట్లో ఇబ్బంది పడ్డాను. ఆమిర్ అసలు మాట్లాడడు- ఎంతో అవసరమైనప్పుడు తప్ప.
 ఆమిర్: (వెంటనే) దాట్స్ అబ్సర్డ్! నేను చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటాను.
 
మే బీ... మీ ఆవిడ చూస్తారని భయమా ఆమిర్? (అందరూ పగలబడి నవ్వు..)
 
అనుష్క: నేను ఆర్మీ వాతావరణంలో పెరిగాను కనుక సీనియర్లకి గౌరవం ఇవ్వడం నేర్చుకున్నాను. నా అంతట నేనే సరదాగా ఉండటం చేతకాదు. కానీ మెల్లగా చనువు పెరిగింది. ఆమిర్‌ది చాలా తెలివైన, షార్ప్ బ్రెయిన్.
 
ఆమిర్: ఆల్‌సో వెరీ లవ్వింగ్, డేరింగ్... అండర్‌స్టాండింగ్ (నవ్వుతూ)
 
అనుష్కా ... ఇందులో మీ పాత్ర?
 
అనుష్క: పీకేలో నేనొక జర్నలిస్ట్ పాత్ర వేసాను. నా పాత్రపేరు జగత్‌జనని. ఇంతకు మించి ఇప్పుడే ఏం చెప్పను. కానీ మీరందరూ చూసి గర్వపడతారు.
 
ఇంతకీ సినిమా కథ?
 
రాజు: చెప్తే... వీళ్ళందరూ నన్ను చంపేస్తారు!! ఒకటి మాత్రం నిజం. గతంలో మేం చేసిన ఫిలింస్‌లాగా ఇది కూడా కాన్సెప్ట్ ఫిల్మ్. చాలా భిన్నమైన కథాంశం.
 
హైదరాబాద్‌కి రావడం ఎలా అనిపిస్తోంది?
 
ఆమిర్: నేను షూటింగ్ కోసం గతంలో హైదరాబాద్ వచ్చాను. నాకిష్టమైన సిటీ హైదరాబాద్. ఇక్కడ బిరియానీ, హలీమ్ చాలా
ఇష్టపడతాను.
 
వినోద్: నాకు చాలా సంతోషంగా ఉంది. మా అమ్మాయి పెళ్ళి ఇక్కడే ఫలక్‌నుమాలో చేసాను. జస్టిస్ చలం నా వియ్యంకుడు.
 ఆమిర్: నా సినిమాలు చూసి ఇక్కడి వాళ్ళు చాలా  బాగా స్పందించారు. ఆ విధంగానూ హైదరాబాదు నా మనసుకి చాలా క్లోజ్. తెలుగువారందరికీ నా ప్రేమ!
 
అనుష్క: చాలాసార్లు ఇక్కడికి వచ్చాను. మోడలింగ్ డేస్‌లో, అలాగే ప్రమోషన్స్ కోసం కూడా వచ్చాను.
 
భగవద్గీతని జాతీయగ్రంథం చేయాలన్న ప్రతిపాదనపై మీ కామెంట్?


ఆమిర్: నేను రెండుసార్లు స్వయంగా భగవద్గీత చదివాను. గీత చాలా అద్భుతమైన గ్రంథం. కానీ ఈ అంశం పై నేను చెప్పలేను. నేను మహాభారతం అంతా చదివాను. చాలా ఉన్నతమైన తాత్వికగ్రంథం అని నమ్ముతాను. బహుశా... దీనిపై నిర్ణయం తీసుకోవలసింది సామాజిక, తత్వవేత్తలు.
 
సత్యమేవజయతే వెనుక ఉన్న సంకల్పం?
 
ఆమిర్: మన సమాజాన్ని ప్రతిబింబించడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. వీలైతే దానివల్ల కొంత మార్పు వస్తుందన్న ఆశ.
 హీరోకన్నా హీరోయిన్ పొడుగ్గా ఉంటే సినిమా సూపర్‌హిట్ అనే నమ్మకం ఉంది. నిజమా ఆమిర్?
 
ఆమిర్: వావ్! అవునా? అందుకేనేమో - నా సినిమాలన్నీ హిట్టయ్యాయి (నవ్వుతూ)
 అనుష్క: నేను ఆమిర్ కంటే పొడుగు కాబట్టి పీకే ఖచ్చితంగా హిట్!!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement