బాలీవుడ్ దర్శకురాలు, నిర్మాత కిరణ్ రావు సింగిల్ మదర్‌గా పిల్లల పెంపకం విషయంలో ఎదురయ్యే సాధకభాదల్ని గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ఇటీవల కరీనా కపూర్‌తో జరిగిన విమెన్స్ వాంట్ వాంట్ అనే చాట్ షోలో కిరణ్ రావు తల్లిదండ్రులిద్దరూ పిల్లల బాధ్యతల్లో పాలుపంచుకోవడంపై చాలా ఆసక్తికరమైన విషయాలు షేర్ చేసుకున్నారు. అంతేగాదు సింగిల్ పేరెంట్‌గా తన అనుభవాన్ని గురించి కూడా చెప్పారు. పిల్లల విషయంలో చాలామంది తండ్రులు చేసే అతి పెద్ద తప్పు గురించి చెప్పడమే గాక అమీర్ ఖాన్ కూడా అంతే అంటూ ఆ షోలో నిజాయితీగా మాట్లాడారు. ఇంతకీ పిల్లల విషయంలో తండ్రులు చేసే తప్పు ఏంటంటే..
కిరణ్ రావ్ అమీర్ ఖాన్ దంపతులకు అజాద్ అనే కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. అమీర్ బిజీ షెడ్యూల వల్ల పిల్లలకు తగిన సమయం కేటాయించలేకపోయాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు కూడా. కిరణ్ రావు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ..మేము వివాహం చేసుకుని ఒక్కటైనప్పటికీ అమీర్ చాలా బిజీగా ఉండేవారని అన్నారు. తాము తల్లిదండ్రులుగా మారిన తర్వాత కూడా అతడి తీరులో మార్పులేదు.
ఇక తాను ఒక తల్లిగా తల్లిదండ్రులిద్దరూ అందించాల్సిన ప్రేమని కొడుకు ఆజాద్‌కి తానే అందించానని అన్నారు. ఆ సమయంలో అమీర్‌కి ఆజాద్‌కి సమయం కేటాయించడం అనేది ఓ పెద్ద సమస్యాత్మకమైన నిర్ణయంగా ఉండేది. తామిద్దరం కలిసి ఉండటం వల్ల అదంతా నేనే చూసుకున్నాను. ఎప్పుడైతే 2021లో విడాకులు తీసుకున్నామో అప్పుడు ఆజాద్ విషయం సున్నితమైన అంశంగా మారిపోయింది. ఇక అమీర్ కూడా అజాద్ విషయంలో తానేం చేసింది గ్రహించాడు. నిజానికి చాలామంది తండ్రులు ఇలానే ఉంటున్నారు. పిల్లల స్కూల్‌కి సంబంధించిన విషయాలకు దూరంగా ఉంటారు. అదంతా తల్లి బాధ్యత అన్నట్లుగా వదిలేస్తారు. అని భావోద్వేగంగా మాట్లాడారు కిరణ్ రావ్.
సింగిల్ పేరెంట్‌గా..
తనకు తన కొడుకుతో గడిపే క్షణాలన్నీ మంచిరోజులే అన్నారు. అతడు తనని నవ్వించే యత్నం చేస్తుంటాడని అన్నారు. తనను ఒక్క క్షణం కూడా నిశబ్దంగా ఉండనివ్వడని కొడుకు ఆజాద్ గురించి సంతోషంగా చెప్పుకొచ్చారు. అలాగే ఈ సమయంలో తన తల్లిదండ్రులు తనకు పూర్తి మద్దుతగా నిలిచారని అన్నారు. వారి సహాయంతోనే మరింత సమర్థవంతంగా తన పిల్లవాడిని పెంచగులుగుతన్నాని అన్నారు. అయితే తల్లులు ఎప్పుడూ తండ్రుల్లా వారి బాధ్యతల విషయంలో తప్పించుకోరు.
ఒకరకంగా ఇలా.. తల్లి పిల్లల మధ్య స్ట్రాంగ్ అనుబంధం ఏర్పడుతుందన్నారు. అంతేగాదు భవిష్యత్తులో సింగిల్ మదర్‌లకు వారి పిల్లలే పూర్తి ఆసరాగా ఉండి వారి బాగోగులను చూసుకుంటారని చాలా నమ్మకంగా అన్నారు. అయితే సింగిల్ మదర్ రోల్‌ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలన్నారు. ముఖ్యంగా పిల్లలకు తండ్రి లేని లోటుని కనిపించనీయకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యం అని కిరణ్ రావ్ చెప్పుకొచ్చారు.
కాగా, గతంలో అమీర్ రియా చక్రవర్తితో జరిగిన పోడ్‌కాస్ట్‌లో "నా బిజీ షెడ్యూల్ కారణంగా పిల్లల కోసం సమయం కేటాయించలేకపోయాను. అందువల్లే ఇరా, ఇరా డిప్రెషన్‌తో బాధపడిందని అన్నారు. అయితే ఆమె ఇప్పుడు మెరుగ్గా ఉంది. ఇక జునైద్ తన కెరీర్‌ని ప్రారంభించాడు. అతడు కూడా నేను లేకుండానే గడిపాడు. కనీసం ఆజాద్ అయినా అలాకాకుడదని భావించి సమయం కేటాయించే ప్రయత్నం చేస్తున్నా. అయితే నాకు కుటుంబం పట్ల బలమైన అనుభూతి ఉంది, కానీ ప్రేక్షకుల మనసుని గెలుచుకునే హీరో అవ్వాలనే తాపత్రయంలో ఫ్యామిలీకి దూరం అయ్యాను." అని అమీర్ చెప్పారు.
(చదవండి: 'తల్లులు' డోంట్ వర్రీ!..ప్రసవానంతరం జస్ట్ 34 రోజుల్లోనే..!)
Comments
Please login to add a commentAdd a comment