
ఆమిర్‌ఖాన్ బాధ!
‘నా జీవితంలో ముఖ్యమైన నిర్ణయుం తీసుకున్నప్పుడల్లా... అందరూ దాన్ని తప్పుగా చూసేవారే గానీ... మద్దతిచ్చేవారే లేరు’ అంటూ తెగ బాధపడిపోతున్నాడు సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్. ‘నాకిదో బాధాకరమైన పరిస్థితి. ఎప్పుడే కీలక నిర్ణయుం తీసుకున్నా... నువ్వు తప్పు చేస్తున్నావంటూ హెచ్చరిస్తారు.
నాకు దగ్గరవారు,ముఖ్యమైనవారు... అందరిదీ ఇదే వూట. అయితే ఎవరేం చెప్పినా వింటా. తరువాత నా మనసేం చెబితే అదే చేస్తా. 25 ఏళ్ల విజయువంతమైన కెరీర్‌లో ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకొంటే... ఎంతో సంతోషం కలుగుతుంది’ అంటూ ఓ సెమినార్‌లో చెప్పుకొచ్చాడు ఆమిర్.