ద్రౌపదిగా దీపిక? | Deepika Padukone play Draupadi in Aamir Khan's Mahabharata? | Sakshi
Sakshi News home page

ద్రౌపదిగా దీపిక?

Published Sun, Apr 29 2018 12:50 AM | Last Updated on Sun, Apr 29 2018 12:50 AM

Deepika Padukone play Draupadi in Aamir Khan's Mahabharata? - Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోన్‌ ద్రౌపదిగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ‘మహాభారతాన్ని వెండి తెరకెక్కించడం నా కల’ అంటూ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ ఖాన్‌ తన మనసులోని మాటను గతంలో బయటపెట్టిన సంగతి తెలిసిందే. అత్యధిక బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబాని నిర్మించనున్నారనే వార్తలు గతంలో హల్‌చల్‌ చేశాయి. ఆమిర్‌ అలా చెప్పారో లేదో.. ఏ పాత్రకు ఎవరు సరిపోతారంటూ బాలీవుడ్‌లో చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ చిత్రంలో ద్రౌపది పాత్రకి దీపిక పదుకోన్‌ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట ఆమిర్‌.

‘బాజీరావ్‌ మస్తానీ, పద్మావత్‌’ వంటి చారిత్రక సినిమాల్లో తన నటనతో దీపిక ఏ రేంజ్‌లో ప్రేక్షకులను అలరించారో తెలిసిందే. ఆ రెండు చిత్రాల్లో దీపిక కనబర్చిన నటన చూసి, ‘మహాభారతం’ సినిమాలో ద్రౌపది పాత్రకు ఆమె అయితేనే కరెక్ట్‌గా సరిపోతారని ఆమిర్‌ ఆలోచనట. ‘బాజీరావ్‌ మస్తానీ, పద్మావత్‌’ చిత్రాల్లో దీపిక పాత్రలు వివాదాస్పదమైన సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ అనుభవాలతో ద్రౌపదిగా నటించేందుకు దీపిక ఒప్పుకుంటారా? అని కొందరు అంటుంటే.. ఆమిర్‌ అంతటివాడు అడిగితే ఈ బ్యూటీ కాదంటారా? అనేవారూ లేకపోలేదు. ఇంతకీ  ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ద్రౌపది పాత్రను దీపికానే చేస్తారా? ఈ ప్రాజెక్ట్‌లో నటించే చాన్స్‌ ఎవరెవరికి దక్కుతుంది? అనే విషయాలకు కాలమే సమాధానం చెప్పాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement