
దీపికా పదుకోన్
‘మహాభారతం’ ఇతిహాసం ఆధారంగా ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్‌లో మరో చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో ద్రౌపది పాత్రలో దీపికా పదుకోన్ నటించనున్నారు. ఈ సినిమాను మధు మంతెన, దీపికా పదుకోన్ నిర్మించనున్నారు. రెండు మూడు భాగాలుగా ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. తొలి పార్ట్‌ను 2021 దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దీపిక. ‘‘ద్రౌపది పాత్రలో నటించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
గౌరవంగా ఫీల్ అవుతున్నాను. నా జీవితాంతం గుర్తిండిపోయేలా ద్రౌపది పాత్ర వెండితెరపైకి వస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు దీపిక. ‘‘మహాభారతం గురించి, ఈ గ్రంథం ద్వారా వచ్చిన సినిమాల గురించి మనందరికీ తెలుసు. కానీ మా సినిమా ద్రౌపది దృష్టి కోణంలో సాగుతుంది. కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయాన్ని, ఇతర నటీనటుల వివరాలను త్వరలో చెబుతాం’’ అన్నారు మధు మంతెన.
Comments
Please login to add a commentAdd a comment