Mahabharatam
-
ప్రేమించు... జీవించు...
ఈ సృష్టి సమస్తం ప్రేమ మయం.. సృష్టిలో సమస్త జీవరాశుల పట్ల ప్రేమ కలిగి ఉండటమే అత్యుత్తమమైన ఆధ్యాత్మిక సాధన అని మహాభారతం చెబుతోంది. ప్రాణం పోసే మహత్తర శక్తి ప్రేమకు ఉంది. శారీరక, మానసిక, నైతిక ఆరోగ్యాలకు ప్రేమ ఎంతో అవసరం. ప్రేమకు కొలతలు లేవు. తరతమ భేదాలు లేవు. అది అనంతమైనది. విశ్వవ్యాప్తమైనది.. మనిషి సంఘజీవి. ఏకాకిగా అతడు సంఘంలో ఎక్కువ కాలం ఉండలేడు. అతడు జీవించాలంటే ప్రేమ కావాలి. ప్రేమ లేనిదే మనిషి జీవితం వ్యర్ధం. మనిషి మనుగడకు మూలం ప్రేమ. మానవ సంబంధాలు నిలబడేది, కొనసాగేది ప్రేమ పునాది పైనే. అయితే ప్రేమ అనగానే మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది యువతీయువకుల మధ్య ఉండే ప్రేమ.. కేవలం యువతీయువకులదే కాదు ఇరుగు పొరుగు వారిది, తల్లిదండ్రులది, పిల్లలది, స్నేహితుల మధ్యన ఉండేది కూడా ప్రేమే. సమస్త మానవాళిలో ఉన్న ప్రేమను అవగతం చేసుకుంటే అది మానవ జీవితానికి పరిపక్వతనిస్తుంది. ప్రేమ గురించి సంపూర్ణంగా తెలిసినవారే, దాన్ని ఆస్వాదిస్తారు. ఇతరులకు పంచగలుగుతారు. ప్రేమ మనిషిని దైవంగా మారుస్తుంది.. ఆ దైవత్వంతోనే మనిషి ఎలాంటి కార్యాలనైనా సాధించగలుగుతాడు.. ప్రేమ గురించి , దాని శక్తి గురించి స్వామి వివేకానంద, గౌతమ బుద్ధుడు, జీసస్ క్రైస్త్ లాంటి ఎందరో మహనీయులు ఈ లోకానికి తెలియ చేశారు. ఈ క్రమంలో ప్రేమతత్వం ద్వారా కోట్ల మందిని ప్రభావితం చేశారు. ప్రేమలో నిర్భయత్వాన్ని, ఆనందాన్ని సాధించే మార్గాలను వారు ఈ లోకానికి అందించారు. అయితే ప్రేమ అనేది కేవలం మనుషుల మధ్యనే కాదు అది సమస్త జీవరాశుల మీదా ఉండాలి. అలాంటప్పుడే ఈ ప్రకతి అంతా ప్రేమ మయంగా అందంగా, ఆహ్వాదంగా కనిపిస్తుంది. బొందితో స్వర్గానికి వెళ్ళే అర్హత ధర్మరాజుకు ఉంది. ఆయన స్వర్గానికి వెళ్ళే సమయంలో ఓ కుక్క అతని వెంట పడుతుంది. ఆ కుక్కను ప్రేమగా చూసిన ధర్మరాజు కుక్కను వదిలి స్వర్గానికి వెళ్ళడానికి అంగీకరించడు. ఇలా చివరి క్షణంలో సైతం కుక్క మీద ప్రేమ కురిపించి మూగజీవాల పట్ల తన దయాగుణాన్ని చాటుకున్నాడు. సాక్షాత్తు శిరిడీ సాయి నాధుడు ఎప్పుడూ ప్రజలతో పాటు మూగ జీవాలను కూడా ఎంతగానో ప్రేమించేవారు. అలాగే రమణ మహర్షితో పాటు ఇంకా అనేక మంది యోగులు, మునులు, సిద్ధులు తమ ప్రేమను జంతు జీవాలపై కురిపించి విశ్వ మానవ ప్రేమను చాటుకున్నారు...ఇలా ఆపదలో ఉన్నవారిని, రోగ గ్రస్తులను మాత్రమే కాదు ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులను ప్రేమించిననాడే మానవ జీవితానికి పరిపక్వత సిద్ధిస్తుంది. ప్రేమ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో తారసపడుతుంది. జీవితంలో ప్రతి మనిషి తన స్నేహితులను, తల్లితండ్రులను, పిల్లలనూ ప్రేమిస్తూనే ఉంటాడు. అలాగే సుందరమైన నదులు, కొండలపై జారు జలపాతాలు, ఇసుకతో కూడిన ఎడారులు, ప్రకతి శోభ, చెట్టు చేమ, జంతువులు, పక్షుల, వింతగా కనిపించే మబ్బులు, మిణుకు మిణుకుమనే నక్షత్ర సముదాయం, రోదసి, అందం, సుందరం, బుజ్జి పాపాయి అమాయక నవ్వు, మనుషుల స్నేహం, అభిమానం, వీటి అన్నింటిలో కూడా ప్రేమ కనిపిస్తుంది. వికసిస్తుంది. ప్రేమ మనకు ప్రకృతి ఇచ్చిన వరం.మనిషి మౌలికంగా దైవస్వరూపుడని, శరీరంలో నివసించే ఆత్మే దైవమని అనేక మంది మహనీయులు సెలవిచ్చారు. జ్ఞానం పెరిగే కొద్దీ ఆధ్యాత్మికత వికసిస్తుంది. అలా వికసించినపుడే అన్ని భేదాలు అంతరించి ప్రేమతత్వం సాధ్యపడుతుంది. ఏవిధమైన ప్రతిఫలాపేక్ష లేకుండా, మంచి మనసుతో మనం ఒకరి పట్ల చూపే నిస్వార్థమైన ఆదరణే ప్రేమ‘. ఇది ఒక ఉన్నతమైన, పవిత్రమైన, గొప్పదైన భావన.– దాసరి దుర్గాప్రసాద్ -
సూర్యపుత్ర కర్ణ సినిమాకు అడ్డంకులు తొలగినట్లేనా?
భారతీయ ఇతిహాసం మహాభారతం ఆధారంగా దాదాపు ఐదు సంవత్సరాల క్రితం విక్రమ్ హీరోగా ఆర్ఎస్ విమల్ దర్శకత్వంలో ‘సూర్యపుత్రన్ కర్ణన్’ అనే సినిమా ప్రకటన వెల్లడైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాని దాదాపు మూడొందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తారనే ప్రచారం అప్పట్లో సాగింది. కానీ వివిధ కారణాల వల్ల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ‘సూర్యపుత్రన్ కర్ణన్’ సినిమా ‘రోలింగ్ సూన్’(త్వరలో చిత్రీకరణ ప్రారంభం అవుతుందన్నట్లుగా..) అంటూ కర్ణుడి పాత్రలో ఉన్న విక్రమ్ ఫోటోను షేర్ చేశారు విమల్. అలాగే ఈ సినిమా టీజర్ అంటూ మరో వీడియోను ఆదివారం షేర్ చేశారాయన. మరి... ఈ మూవీకి ఉన్న అడ్డంకులు తొలగినట్లేనా? త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందా? వేచి చూడాలి. -
‘మహాభారతంలోనూ లవ్ జిహాద్’.. కాంగ్రెస్ చీఫ్ క్షమాపణలు
‘మహాభారతంలోనూ లవ్ జిహాద్ జరిగింది’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై అసోం కాంగ్రెస్ చీఫ్ భూపేన్ బోరా క్షమాపణలు తెలియజేశారు. ప్రజల నుంచి క్షమాపణలు కోరుతూ వైష్ణవ్ ప్రార్థనకు చెందిన ఓ గీతాన్ని కూడా పాడారు. కాగా, గోలాఘాట్‌లో జరిగిన ట్రిపుల్ మర్డర్ కేసు ‘లవ్ జిహాద్’ అంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యానించడంపై బోరా స్పందిస్తూ.. శ్రీకృష్ణుడికి రుక్మిణితో ఉన్న బంధాన్ని ప్రస్తావించాడు. రుక్మిణిని శ్రీకృష్ణుడు వివాహం చేసుకోవాలని భావించినప్పుడు అర్జునుడు మహిళ వేషంలో వచ్చాడని.. మహాభారతంలోనూ లవ్ జిహాద్ ఉందని ఆరోపించాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీనిపై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ ఘాటుగా స్పందించారు. దీనిపై ఒకవేళ పోలీస్ కేసు నమోదైతే అతన్ని అరెస్ట్ చేయడానికి కూడా వెనకాడమని హెచ్చరించారు. శ్రీకృష్ణుడు, రుక్మిణి దేవిల అంశాన్ని లేవనెత్తడం ఖండించదగినదని చెప్పారు. సనాతన ధర్మం, హిందూ ధర్మాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు సరికావని మండిపడ్డారు. హజ్రత్ మహమ్మద్‌ను, జీసస్ క్రైస్ట్‌ను ఏ విధంగా అయితే వివాదాల్లోకి లాగబోమో, అదేవిధంగా శ్రీకృష్ణుడిని వివాదాల్లోకి లాగడం మానుకోవాలని హితవు పలికారు. నేరపూరిత చర్యలను భగవంతుడితో పోల్చడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. చదవండి: ఉడిపి వాష్‌రూమ్ కేసులో సీఎంపై అనుచిత ట్వీట్.. బీజేపీ కార్యకర్త అరెస్ట్ దీనిపై అసోం కాంగ్రెస్ చీఫ్ శుక్రవారం మాట్లాడుతూ.. తమ తాత నిన్న రాత్రి తన కలలోకి వచ్చారని తెలిపారు. తను చేసిన స్టేట్మెంట్ తప్పని, ఇది రాష్ట్ర ప్రజలను బాధపెట్టిందని ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. తన వ్యాఖ్యల కారణంగా పార్టీకి నష్టం జరగకూడదని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వైష్ణవ భక్తుల మనోభావాలను దెబ్బతీయడం కూడా ఇష్టం లేదన్నారు. వైష్ణవ్ భక్తులు తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు బాధగా అనిపించిందని భూపేన్ చెప్పారు. అందుకే వైష్ణవ ఆలయంలో మట్టి దీపం, తమలపాకులు సమర్పించాలని నిర్ణయించుకున్నాన్నారు. స్వామిని క్షమించమని ప్రార్థించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. అంతేగానీ బీజేపీ, సీఎంకు భయపడి క్షమించమని కోరడం లేదని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడిపై పలు కేసులు నమోదయ్యాయి. -
అసలు గాంధారి వాన ఏమిటి?..ఎందుకలా పిలుస్తారు?..
నేచురల్ స్టార్ నాని చేసిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలో ఓ ఊపూ ఊపేసిని జానపద పాటలో వస్తుంది ఈ గాంధరి వాన గురించి. అందులో కురస కురస అడివిలోన పిలగా..కురిసినీ గాంధారి వాన అంటూ.. మంచి బీట్తో సాగిపోతుంది. అసలు ఇంతకీ గాంధారి వాన అంటే ఏమిటి? ఎప్పుడైనా దాని గురించి విన్నారా? అయినా మహాభారతంలోని దృతరాష్ట్రుని భార్య గాంధారికి, ఈ వానకి సంబంధం ఏమిటి? ఎందకని అలా వానను ఆమె పేరుతో పిలుస్తున్నారు?.. గాంధారి వాన అంటే..అవసరం లేనప్పుడు అదును లేనప్పుడూ కురిసే పెద్ద వానను గాంధారి వాన అంటారు. గాంధారి వాన గురించి చెప్పాలంటే ముందు గాంధారి గురించి తెలియాలి. గాంధారి మహాభారతంలో ధృతరాష్ట్రుని భార్య. ఆమె గాంధార దేశ రాకుమారి. దుర్యోధనుని తల్లి. ఆమెకు నూరుగురు సంతానం అని మనందరికి తెలిసిందే. దుస్సల అనే కూతురుతో కలిపి మొత్తం నూటొక్కమంది పిల్లలు ఆమెకు. ఇక ఆమె పేరు మీదగానే వానను పిలవడానికి కారణం ఏంటంటే..ముందుగా ఆమె గురించి తెలుసుకోవాలి. ఆమె తన భర్తకు కళ్లు లేవని, తన భర్త చూడని లోకం తాను చూడనంటూ కళ్లకు గంతలు కట్టుకున్న మహాసాధ్వీమణి గాంధారి. కాని దానివల్ల ఎలాంటి నష్టం జరిగిందో మహాభారతంలో చూశాం. ఇక్కడ ఒక కుటుంబానికి రెండు చక్రాలాంటి వాళ్లు తల్లిదండ్రలు. అందులో ఒక చక్రం పరిస్థితి బాగోనప్పుడూ ఇంకో చక్రం పూర్తిస్థాయిలో ఆధారభూతమై నిలబడి సంసారాన్ని లాగాలి. ఇక్కడ ఆమె భర్తపై ఉన్న అమితమైన ప్రేమతో చేసిన పని కాస్తా తన పిలల్లను చెడు మార్గంలో పయనించేలా చేసింది. గాంధారి తన కళ్లకు గంతలు కట్టుకోవడంతో పిల్లలను తడిమి చూసుకునేదేగానే..వాళ్లు ఎలా పెరుగుతున్నారు, వారి బుద్ధే ఏ మార్గంలో పయనిస్తుందో చూసే అవకాశం లేకుండా పోయింది. దీంతో కౌరవులు పాండవులపై చేయరాని అకృత్యాలకు పాల్పడ్డారు. ఇక్కడ గాంధారి, దృతరాష్ట్రుడు ఇద్దరు కూడా వారిని సరైన మార్గంలో పెట్టకుండా అవ్యాజమైన ప్రేమను మాత్రమే చూపించారు. అలాగే సయమం కాని సమయంలో..అకాలంగా అవసరం లేకుండా ధారగా కురిసిన వాన వల్ల ఏం ప్రయోజనం ఉండదు. కేవలం నష్టమే తప్ప. పంట అదునుతో సంబంధం లేకుండా వర్షం అచ్చం గాంధారిలా.. పిల్లల ఎదుగుతున్న విదానంపై దృష్టి పెట్టకుండా చూపిన అవ్యాజ ప్రేమ మాదిరిగా వర్షం కురిస్తే..అచ్చం కౌరవులు నాశనం అయినట్లే..పంటలు పాడవుతాయి. దీనివల్ల అంతమంచి వర్షమైనా.. నిరుపయోగమే అవుతుందే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి దీన్ని గాంధారి వాన అని పిలిచారు. ఈ మాట రాయలసీమ, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎక్కువగా ఆపాదించవచ్చు. (చదవండి: ఈ తల్లులు ప్రకృతి మురిసేలా ..పిల్లల పెళ్లి ఘనంగా చేశారు) -
Ramayana and Indian poetry: వాటిని ఎందుకు చదవాలి?
మనిషి జీవితంలో సంతరించుకోవలసిన గొప్ప గుణాలను గురించి గురజాడ అప్పారావుగారు ఒకచోట ఇలా అన్నారు... ‘‘ ఈవియుదియ్యని మాటయు భావంబున జేయతగిన పనితెలియుటయున్ ఠీవియగు ధైర్యభావము రావు సుమీ యొకని వలన రావలె తనతోన్’’... ఈవియు .. అంటే త్యాగం. మనిషి తనకుతాను సుఖపడితే తప్పుకాదు. మనిషి త్యాగంతో గొప్పవాడు అవుతాడు. ఇతరుల గురించి ఆలోచించి, వాళ్ళను కష్టాల్లోంచి పైకి తీసుకురావడానికి.. తాను ఎంత శక్తిని వినియోగించుకోగలడో, అంత శక్తినీ, ఏ విధమైన గుర్తింపునీ కోరకుండా అది తన కర్తవ్యం అన్న భావనతో ప్రేమ భావనతో చేయదగిన వ్యక్తి ఎవరున్నారో ఆయన త్యాగశీలి. అటువంటి మహానుభావులు ఎందరో పుట్టకపోతే అసలీ దేశానికి స్వాతంత్య్రం ఎలా సిద్ధించి ఉండేది? మన దగ్గర విషయమే తీసుకుంటే... బెజవాడ గోపాలరెడ్డి గారు పుట్టుకతో శ్రీమంతుడయినా దేశంకోసం చాలా శ్రమించాడు, చివరకు జైళ్ళకు కూడా వెళ్ళాడు. ఆయనకేం కర్మ! అలాగే టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆరోజుల్లో లక్షల సంపాదన ఉన్న న్యాయవాద వృత్తిని వదిలి దేశంకోసం సర్వస్వం ధారపోశారు. స్వాతంత్య్రోద్యమ విశేషాలను, సందేశాలను ప్రజలకు చేరవేయడానికి తన స్వార్జితంతో ‘స్వతంత్ర’ పత్రిక నడిపారు. లక్షలు ఖర్చుపెట్టారు... అటువంటి వారిది త్యాగమయ జీవితం. అంటే... త్యాగం మనిషిని శాశ్వతమైన కీర్తికి అర్హుణ్ణి చేస్తుంది. తియ్యని మాటలు మాట్లాడడం ఒక మంచి సంస్కారం. తిరస్కరించవలసి వచ్చిన సందర్భాల్లోనూ ఎదుటివారిని నొప్పించకుండా మృదువుగా మాట్లాడగలగాలి. హనుమ నూరు యోజనాల సముద్రాన్ని దాటిపోతున్నప్పుడు మార్గమధ్యంలో మైనాకుడు తన ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలని కోరితే... కటువుగా తిరస్కరించలేదు. ‘‘నాయనా! రామకార్యం మీద పోతున్నాను. వేళ మించిపోతోంది. నీవు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను పుచ్చుకున్నట్లే...’’ అంటూ మృదువుగా చేతితో స్పృశించి వెళ్ళాడు తప్ప... ఎక్కడా కటువుగా మాట్లాడలేదు. రామాయణ భారతాది కావ్యాలు ఎందుకు చదవాలంటే... మాట మధురంగా ఉండడం కోసం, సంస్కారవంతమైన వాక్కు తయారవడం కోసం, మాట పదిమందికి పనికొచ్చేదిగా ఉండడం కోసం చదువుకుంటారు. ఎవ్వరికీ ఉపకారం చేయలేకపోవచ్చు. మనం చెప్పే ఓదార్పు మాటలు ఎదుటి వాళ్ళకు స్వాంతన కలిగిస్తాయి. చెడు మార్గంలో ఉన్న వాళ్లను మంచిమార్గం వైపు మళ్ళిస్తాయి. భావంబున చేయదగిన పనిచేయుటయున్... భావం మనోగతం. తాను ఏ పనిచేయాలో ఆ పనినే మనసు తనకు జ్ఞాపకం చేస్తూ ఉంటే ఆ వ్యక్తి గొప్ప శీలవంతుడవుతాడు. అటువంటి సౌశీల్యం ఉండాలి. ఠీవియగు ధైర్య భావము... ఠీవి అంటే వైభవం.. పిరికితనం చూపకుండా తెగువ, పోరాట పటిమ చూపే సందర్భంలో కాకుండా... ఇక్కడ ధైర్యం అంటే... ఎంత కష్టం కలిగినా ఓర్చుకుని నిలబడి ప్రయత్నాన్ని కొనసాగించి కృతకృత్యులు కావడం.. ఆయన ధైర్యశాలి. ఆ ధైర్యం వైభవోపేతం... ఇటువంటి గొప్పగుణాలు జన్మతః లేకపోయినా ప్రతివారూ ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. -
గురువాణి: పాతకొత్తల గొడవ మనకెందుకు!!!
అభ్యుదయం అంటే సమాజానికి మేలు చేయడం. మనుషులలో మంచి గుణాలు ఏర్పడితే అది అభ్యుదయానికి కారణమవుతుంది. మేలు జరగడానికి పాతదా కొత్తదా అని కాదు... పాతదంతా మంచీ కాదు, కొత్తదంతా చెడూ కాదు. అలాగే పాతదంతా చెడూ కాదు, కొత్తవన్ని మంచివీ కావు. రామాయణ భారతాల్లో అన్నీ ఉన్నాయండీ అని కొత్త వాఙ్మయం దేనికండీ అనడం మంచిదికాదు. కొత్తగా వచ్చిన గ్రంథాలలో ఎన్నో మంచి విషయాలుంటాయి. ‘‘పురాణమిత్యేవ న సాధు సర్వం/ నా చాపి కావ్యం నవమిత్యవద్యమ్/ సంతః పరీక్ష్యాన్యతరత్ భజంతే/ మూఢఃపరప్రత్యయనేబుద్ధిః’’ అంటారు మాళవికాగ్నిమిత్రంలో మహాకవి కాళిదాసు. అంటే పాతకాలానికి సంబంధించినది కాబట్టి ఇందులో ఏదీ పనికొచ్చేదీ, మంచిదీ ఉండదు – అనకూడదు. పాతవన్నీ చెడ్డవని ఎలా సిద్ధాంతీకరిస్తారు! ఈ రచన ఇప్పుడు కొత్తగా వచ్చింది, వీటిలో మన మేలు కోరేవి ఏం ఉంటాయి, వీటిని మనం ఆదరించక్కరలేదు... అని చెప్పడమూ కుదరదు. వివేకవంతులు ఏం చేస్తారంటే... అందులో ఏదయినా మంచి చెప్పారా.. అని పరిశీలిస్తారు. జీవితాలకు అభ్యున్నతిని కల్పించే మాటలు ఏవయినా వాటిలో ఉన్నాయా... అని చూస్తారు. కానీ ఎవరో ఏదో చెప్పారని తన స్వంత బుద్ధిని ఉపయోగించకుండా, మంచీ చెడూ విచారణ చెయ్యకుండా వాటినే అనుకరిస్తూ, అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మూఢుల లక్షణం. ..అంటున్నాడు కాళిదాసు. మనకు పనికొచ్చే విషయాలు ఎన్ని ప్రతిపాదింపబడ్డాయి.. అన్నదానిని పరిశీలించడం నిజమైన అభ్యుదయం. దాని విషయానికొస్తే అది పాతదా, కొత్తదా అని కాదు ఆలోచించాల్సింది, అందులో మంచి ఏముంది, ఇందులో మంచి ఏముంది? అని అంతకన్నా దాటి ఇక పరిశీలన చేయవలసిన అవసరం నాబోటివాడికి అక్కర లేదు. నా వరకు నాకు కావలసినది – అది ఎవరు రాసింది అయినా పాత కాలపుదయినా, కొత్తకాలపుదయినా, ఇప్పుడు సమాజంలో ఉన్న వ్యక్తులు రాసినది అయినా, పాతకాలంలో రుషుల వాఙ్మయం అయినా... అందులో అభ్యుదయానికి చెప్పబడిన మంచి విషయాలు ఏమున్నాయి? అనే. వాటిని స్వీకరించి, జీర్ణం చేసుకుని బాగుపడడానికి ప్రయత్నం చేయడం వరకే. పాతకాలంలో కూడా ఆదరణీయం కానివి, అంగీకారయోగ్యం కానివి, సమాజానికి ఉపయుక్తం కానివి ఎన్నో ఉండవచ్చు. అంతమాత్రం చేత పాతకాలంలో ఉన్న వాఙ్మయంలో పనికొచ్చేవి ఏవీ లేవు.. అని చెప్పడం సాధ్యం కాదు. ‘పురాణమిత్యేవ న సాధు సర్వం ...’ ఇది... ఆకాలంలో కాళిదాసు చెప్పిన మాట. ఈ మాట ఇప్పటికి పనికి రాదా!!! ఇది నేర్చుకుంటే అభ్యుదయం కాదా!!! ఇది నేర్చుకున్నవాడి జీవితం ... చేత దీపం పట్టుకుని నడుస్తున్న వాడిలా ఉండదా? పువ్వు పువ్వు లోంచి తేనెబొట్టు స్వీకరించిన తేనెటీగకాడా !!! అందువల్ల మంచి విషయాలు స్వీకరించడం ప్రధానం కావాలి. అవి ప్రాచీన వాఙ్మయం నుంచి కావచ్చు, కొత్తగా వెలువడుతున్న గ్రంథాలనుంచి కావచ్చు. వ్యక్తులందరూ అలా స్వీకరించాలి, మంచి గుణాలు అలవర్చుకోవాలి, ఆ వ్యక్తుల సమూహమే సమాజ అభ్యుదయానికి కారణమవుతుంది. ఎవరో ఏదో చెప్పారని తన స్వంత బుద్ధిని ఉపయోగించకుండా, మంచీ చెడూ విచారణ చెయ్యకుండా వాటినే అనుకరిస్తూ, అనుసరిస్తూ నిర్ణయాలు తీసుకోవడం మూఢుల లక్షణం అంటున్నాడు కాళిదాసు. -
ఫలితం మన చేతుల్లో ఉండదు
‘‘ఎందుకీ వేదాంతం... ఏంటా వైరాగ్యం?’’ అంటూ మంగళవారం సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ గురించి నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ చర్చకు కారణం మహాభారతంలోని సమంత షేర్ చేసిన శ్లోకం. ‘కర్మణ్యే వాధికారస్తే.. మా ఫలేషు కదాచన.. మా కర్మఫలహేతుర్భూః మాతే సంగోత్స్వ కర్మణి’ అనే శ్లోకంతో పాటు కారులో కూర్చుని ఎటో చూస్తున్న ఫొటోను షేర్ చేశారు సమంత. ‘కర్మ చేయడానికి మాత్రమే గానీ ఆ కర్మఫలానికి అధికారివి కాదు.. ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు.. అలాగని ఫలితాలకు భయపడి ప్రయత్నం చేయడం మానకు. ఏది ఏమైనా ముందుకు సాగిపో’ అనేది ఈ గీతాశ్లోకానికి అర్థం. సమంత ఈ శ్లోకం పెట్టడానికి కారణం ‘శాకుంతలం’ అని నెటిజన్లు అభి్రపాయపడుతున్నారు. ఆ సినిమా ఆశించిన ఫలితం సాధించకపోవడంవల్లే ‘ఫలితం మన చేతుల్లో ఉండదు.. ప్రయత్నాలు చేసుకుంటూ వెళ్లడమే’ అని చెప్పడానికి సమంత ఈ శ్లోకాన్ని షేర్ చేశారన్నది నెటిజన్ల ఊహ. -
మరోసారి మెగా-నందమూరి కాంబో రిపీట్ కానుందా!
మహాభారతం ఆధారంగా బాలీవుడ్లో ‘ది ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ అనే మైథలాజికల్ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ దర్శకుడు ఆదిత్యా థార్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో హీరోగా తొలుత విక్కీకౌశల్, రీసెంట్గా రణ్వీర్ సింగ్ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ పేర్లను మేకర్స్ పరిశీలిస్తున్నారని బాలీవుడ్ టాక్. వారిద్దరిలో ఎవరో ఒకర్ని హీరోగా తీసుకునేందుకు పరిశీలిస్తున్నారా? లేక ఇద్దర్నీ ఈ సినిమాలో నటింపచేసేలా సంప్రదింపులు జరుపుతున్నారా? అనే విషయంపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. రోనీ స్క్రూవాలా నిర్మించనున్న ఈ సినిమాను ఇటీవల జీ స్టూడియో టేకోవర్ చేసిందని బీటౌన్‌లో ప్రచారం సాగుతోంది. అదేవిధంగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు సమంత పేరు పరిశీలనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరి.. ‘ది ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ చిత్రంలో ఫైనల్‌గా ఎవరు హీరోగా నటిస్తారు? అనే విషయంపై ఓ క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. -
కర్ణుడు స్వతహాగా మంచివాడే...కానీ...!!!
మహాభారతంలో కర్ణుడి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే.... ఆయన పుట్టుకతో చెడ్డవాడు కాడు. కుంతీదేవికి, సూర్యభగవానుడికి జన్మించిన వాడు. నిజానికి పాండవులు యుద్ధంలో గెలుస్తారని ముందే తెలిసున్నవాడు. కురుసభలో రాయబారం ముగించుకుని శ్రీ కృష్ణ పరమాత్మ తిరిగి వెడుతూ కర్ణుడిని రథం ఎక్కించుకుని మాట్లాడుతూ వెళ్ళాడు. అప్పుడు కర్ణుడు –‘‘ధర్మరాజు నిజంగా ధర్మం ఎరిగినవాడు. దాన్ని పాటించేవాడు. ధర్మం అంతా పాండవులవైపే ఉంది. అందుకే సాక్షాత్ భగవంతుడవయిన నువ్వు ఆ పక్షాన ఉన్నావు. వారు గెలిచి తీరుతారు. ధర్మరాజు పట్టాభిషిక్తుడవుతాడు. దుర్యోధనాదులందరూ కూడా యుద్ధభూమిలో మడిసిపోతారు. ఎవరూ మిగలరు. కానీ దుర్యోధనుడిని నమ్మి ఇంతకాలం ఉండి అతడిని విడిచిపెట్టి రాలేను. నాకు కూడా మరణమే శరణ్యం. నేను కూడా అక్కడ మరణించాల్సిందే’’ అన్నాడు. అంటే – పాండవుల పక్షాన ధర్మం ఉందనీ, వారు గెలుస్తారని, వారి చేతిలో కౌరవులు మరణిస్తారని, తాను కూడా అక్కడే చనిపోతానని కర్ణుడికి ముందే తెలుసు. ఇన్ని తెలిసిన యోధానుయోధుడయిన కర్ణుడు జీవితాంతం తప్పులు చేస్తూ, ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది !!! దుర్యోధనుడు పరమ క్రూరుడు. దుర్మార్గుడు. బద్దెనగారే మరొక పద్యంలో ‘‘తలనుండు విషము ఫణికిని, వెలయంగా తోకనుండు వశ్చికమునకున్ తలతోక యనకనుండును ఖలునకు నిలువెల్ల విషము..’’ అంటారు... ఖలుడు అంటే దుర్మార్గుడు. అటువంటి వాడికి మంచి ఆలోచనలు ఎలా వస్తాయి? అదే ధర్మరాజు పక్కన ఉంటే ...మంచి పనులు చేస్తూ ఉంటాడు.. అప్పడు ఆయన పక్కన ఉన్నవారికి కూడా అటువంటి మంచి పనులు చేయడానికి లేదా కలిసి పాలు పంచుకొనే అవకాశం దొరుకుతుంది. అలా చేస్తే ధర్మరాజు కూడా సంతోషిస్తూ ఉంటాడు. దుర్యోధనుడితో కలిసి ఉన్నందుకు అతని మెప్పుకోసం కర్ణుడు చేయకూడని పనులన్నీ చేస్తూ వెళ్ళాడు. చిట్టచివరకు ఏమయ్యాడు ...యుద్ధభూమిలో అర్జునుడి చేతిలో మరణాన్ని పొందాడు. అలాగే మనిషి ఎంత మంచివాడయినా, ఎంత చదువు చదువుకొన్నవాడయినా, ఎన్ని ఉత్తమ గుణాలు కలిగిఉన్నా... ఒక దుర్మార్గుడితో స్నేహం చేస్తే మాత్రం ఉన్న పేరుప్రతిష్ఠలు కూడా నశించిపోతాయి. సన్మార్గంలో ఉన్న వ్యక్తి దుర్మార్గులతో చేరితే... నల్లులు పట్టిన మంచం ఎలా దెబ్బలు తింటుందో అలాగే ఉంటుందని సుమతీ శతకకారుడు బద్దెనచెబుతూ ‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్ /గించిత్తు నల్లి కుట్టిన/ మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ’’ అంటున్నారు. శవం మీద ఉన్న పూలదండనే కాదు, కింద జారిపడినా దాన్ని ఎవరూ తీసుకుని వాడుకోరు సరికదా... అసలు వేలితో ముట్టుకోరు. కర్రతో పక్కకు నెట్టేస్తారు. అదే దేవుడి మెడలో పడిన పూలదండ... మరుసటి రోజువరకు ఉన్నా, వాడిపోయినా.. కళ్ళకద్దుకుని తీసుకుని తలమీద పెట్టుకుంటారు, కొప్పుల్లో తురుముకుంటారు. పూలదండ తనంత తానుగా చేసిన మంచీ లేదు, చెడూ లేదు. శవంతో చేరితే గౌరవాన్ని పోగొట్టుకుంది, భగవంతుడి మెడను అలంకరిస్తే పవిత్ర ప్రసాదమయింది. ఎవరితో కలిసున్నామన్న దాన్నిబట్టి గౌరవమయినా, ఛీత్కారమయినా ఉంటుంది. ఇనుప ఊచ ఎంత గట్టిగా ఉంటుంది!!! అగ్నితో చేరితే మెత్తబడి ఇంటికి కిటీకీ ఊచవుతుంది, నీటితో చేరితే తుప్పుపట్టి నేలరాలిపోతుంది. అందుకే ఎప్పుడూ కూడా దుర్మార్గులతో స్నేహం చేయకూడదు. అలా చేస్తే మనం పాడయిపోవడమే కాదు, మనచుట్టూ ఉన్నవారిని కూడా భ్రష్టుపట్టించే ప్రమాదం ఉంటుందని తెలుసుకుని జీవితంలో ప్రతి క్షణం ఆచితూచి అడుగేస్తుండాలి. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
రామాయణ, భారతాలపై ఒబామా ఆసక్తికర వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన బాల్యంలో రామాయణం, మహాభారతం వంటి హిందూ ఇతిహాస కథలను వింటూ పెరిగానని గుర్తు చేసుకున్నారు. ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ పుస్తకంలో తన బాల్య స్మృతులను నెమరువేసుకున్నారు. చిన్నతనం అంతా ఇండోనేషియాలో రామాయణ, భారతాలను వింటూ గడిపానని.. ఆ కారణంగా భారతదేశానికి తన మనసులో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు."ప్రపంచ జనాభాలో ఆరవ వంతు, రెండువేల విభిన్న జాతి సమూహాలు, ఏడు వందలకు పైగా భాషలతో మాట్లాడే ప్రజలతో (భారతదేశం) పరిపూర్ణ పరిమాణం కారణంగా భారత్‌కు నా మనసులో ప్రత్యేక స్థానం ఉంది" అని ఒబామా తన తాజా పుస్తకంలో భారతదేశంపై తనకు గల ఇష్టాన్ని చెప్పుకొచ్చారు. 2010లో తన అధ్యక్ష పర్యటనకు ముందు వరకు తాను భారతదేశానికి వెళ్ళలేదని.. కాకపోతే ఆ దేశం గురించి తన మదిలో ఎప్పుడు ఓ ప్రత్యేక స్థానం ఉందన్నారు ఒబామా. "నా బాల్యంలో కొంత భాగం ఇండోనేషియాలో రామాయణం మహాభారతం పురాణ హిందూ కథలు వింటూ గడపడం వల్లనో.. తూర్పు మతాల పట్ల నాకున్న ఆసక్తి కారణంగానో.. పాకిస్తానీ, భారతీయ కళాశాల స్నేహితుల బృందం కారణంగా కావచ్చు. వారి వల్ల నాకు పప్పు, కీమా వండటం అలవాటయ్యింది. బాలీవుడ్ సినిమాలకు ఆకర్షితుడిని అయ్యాను" అని ఒబామా తన పుస్తకంలో రాసుకొచ్చారు. (చదవండి: అపరిపక్వత, సౌందర్యం, చిత్తశుద్ధి!) అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (2009 – 2017) రాసుకున్న జ్ఞాపకాల దొంతర ‘ఎ ప్రామిస్డ్ ల్యాండ్’లో తన బాల్యంతోపాటు రాజకీయంగా ఎదిగిన వైనం వంటి పలు అంశాలు ఉన్నాయి. 2008లో అధ్యక్ష పదవి కోసం నడిపిన చారిత్రక ఎన్నికల ప్రచారం వివరాలు, అధ్యక్షుడిగా తన అనుభవాలను ఈ 768 పేజీల పుస్తకంలో పొందుపరిచారు. అంతర్జాతీయ ప్రచురణ సంస్థ పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒబామా ప్రస్థానాన్ని రెండు భాగాలుగా ప్రచురించనుంది. తొలి భాగమైన ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’ ఈ రోజు విడుదల అయ్యింది. (ప్రామిస్డ్ ల్యాండ్: ‘సారా పాలిన్ ఎవరు?’) -
ప్రముఖ కామెడీ షోపై నటుడి సంచలన వ్యాఖ్యలు
ముంబై: ప్రముఖ టీవీ నటుడు ముఖేష్ కన్నా తరచూ సహనటులపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదంలో ఉంటారు. ఇటీవల హీరోయిన్ సోనాక్షి సిన్హాపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ప్రముఖ కామెడీ కపిల్ శర్మ షోపై కూడా వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు. అంతేగాక ఆ షోకు ఆహ్వానం అందినప్పటికీ హాజరు కాకపోవడంపై గల కారణాన్ని కూడా వెల్లడించాడు. ఇటీవల మహాభారతం సీరియల్ సభ్యులను కపిల్ శర్మ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఇందులో ముఖేష్ కన్నా కూడా ఉన్నారు. కానీ ఆయన షోకు హాజరు కాలేదు. దీంతో భీష్మా పితామాహ మహాభారతం ప్రదర్శనలో ఎందుకు పాల్గొనలేదు అంటూ షోషల్ మీడియాలో ప్రశ్నలు వెల్లువెతున్నాయి. (చదవండి: ‘సోనాక్షిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు’) అంతేగాక ఆయనను షోకు ఎందుకు ఆహ్వనించలేదని కూడా అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్పందిస్తూ అభిమానులకు సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. మంగళవారం ట్వీట్ చేస్తూ.. ‘నన్ను కపిల్ శర్మ షోకు నిరాకరించారని అందరూ అంటున్నారు. నేనే నిరాకరించానని మరి కొందరు అంటున్నారు. ఏదేమైనా షోకు నాకు ఆహ్వానం అందలేదన్న వార్తల్లో నిజం లేదు. నేనే కపిల్ శర్మ ఆహ్వానాన్ని తిరస్కరించాను. ఎందుకు తిరస్కరించానని కూడా నన్ను అడుగుతున్నారు. కపిల్ శర్మ తన షోకు మహాభారతం టీంను ఆహ్వానించనున్నట్లు గుఫీ నాకు ముందే చెప్పాడు. అప్పుడు మీరు వెళ్లండి నేను రాను అని చెప్పాను’ అని పేర్కొన్నాడు. (చదవండి: ఎక్తా కపూర్‌పై విరుచుకుపడ్డ ‘శక్తిమాన్’ హీరో) అయితే ‘‘ఈ షోకు ప్రముఖ స్టార్ నటులంతా వెళ్తారు.. కానీ ముఖేష్ కన్నా మాత్రం వెళ్లడు. ఎందుకంటే కపిల్ షో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినప్పటికీ.. దాని కంటే చెత్త షో మరోకటి ఉండదని నా అభిప్రాయం. ఈ షో మొత్తం డబుల్ మీనింగ్ పదాలతో నిండి ఉంటుంది. ప్రతి క్షణం అసభ్యత ఉట్టిపడుతోంది. ఇందులో పురుషులు స్త్రీల దుస్తులు ధరించి చెత్త ప్రదర్శన ఇస్తారు. దానిని ప్రజలు నవ్వుతూ కడుపులు పట్టుకుంటారు’’ అంటూ విమర్శలు గుప్పించారు. అయితే లాక్డౌన్ రామాయణం, మహాభారతం సీరియల్లు తిరిగి పున: ప్రసారం అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కపిల్ తన షోకు మహాభారతం తారాగాణాన్ని ఇటీవల ఆహ్వానించాడు. దీనికి నితీష్ భరద్వాజ్, పునీత్ ఇస్సార్, ప్రదీప్ కుమార్, గజేంద్ర చౌహాన్, గుఫీ పెయింట, అర్జున్ ఫిరోజ్ ఖాన్లు హాజరయ్యారు. View this post on Instagram Baat ki khaal, aao 🐃 behas kare’n 🤪 #thekapilsharmashow #comedy #comedyvideos #fun #laughter #weekend #masti #family #familytime don’t miss it this weekend 🥳🥳🥳🤪🤪 A post shared by Kapil Sharma (@kapilsharma) on Oct 1, 2020 at 9:55am PDT -
మన (కరోనా) మహాభారతంలో నెత్తురోడిన పాదాలు
నేటి భారతంలో వందల ౖమైళ్ళ దూరం సైతం వలస కూలీలు కాలి నడకన పోతున్నారు. ఈ దయనీయ స్థితిని నేటి కవులు చాలా మంది వచన కవితలలో రాశారు. ఒకరిద్దరు పద్యాలు కూడా రాశారు. కింద ఒక ఉత్పలమాల పద్యం చూడండి. ఉ. డప్పి జనించె వ్రేళులపుటంబులు పొక్క దొడంగె గోళ్ళలో జిప్పిల జొచ్చె నెత్తురులు చిత్తము నాకు గడున్ వశంబు గా దప్పుర మిచ్చ టచ్చటను నాసల వచ్చితి నెంత దవ్వొకో యిప్పటి భంగి నొక్కడుగు నేగెడు దానికి నోర్వ నెమ్మెయిన్ (బాగా దప్పిక పుట్టింది; వేళ్ళకొసలు పొక్కులు పొక్కాయి; గోళ్ళనుండి నెత్తురులు చిప్పిలుతున్నాయి; నామనసు నాకు వశం కావడం లేదు; ఆ (నా) ఊరు ఇక్కడెక్కడో అనుకొని వచ్చాను, ఎంత దూరం ఉందో కదా; ఇప్పుడున్న పరిస్థితిలో ఒక్క అడుగు కూడా వేసే ఓపిక లేదు.) వలస కూలీలు భగభగమండే రోడ్ల మీద నడవలేని స్థితిని నేటి పద్య కవి ఎవరో చక్కగా వర్ణించినట్లుగా ఉంది కదా! కానీ ఇది మహాభారత విరాటపర్వం ప్రథమాశ్వాసంలోని 148వ పద్యం. పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం పూర్తి చేసుకుంటారు. ధౌమ్యుని అశ్రమంలో ఉన్నారు చివరిగా. అక్కడనుండి విరాట రాజు పాలించే మత్స్య దేశపు రాజధాని విరాట నగరానికి పోయి, అక్కడ ఒక సంవత్సరం అజ్ఞాతవాసం గడపాలని అనుకుంటారు. ధౌమ్యుని ఆశీస్సులు, రాజకొలువులో ఎలా మెలగాలి అని చెప్పిన హితోక్తులు విని ద్రౌపదితో సహా బయలుదేరారు. కనీసం ఐదువందల మైళ్ళు నడవాలి. మధ్యలో ఏ నగరం తగలకుండా అడవి మార్గంలోనే నడవాలనుకుంటారు. రెండుమూడు రోజులు నడిచే సరికే కుసుమ కోమలి ద్రౌపది ఒక్క అడుగు కూడా వేయలేనంతగా అలసిపోయి కూలబడింది. అలాంటి స్థితిలో ఉన్న ద్రౌపదిని మహాకవి తిక్కన వర్ణించిన పద్యం ఇది. కాని 900 సంవత్సరాల తర్వాత ఈనాటి వలస కూలీల దుస్థితిని వర్ణించడానికి నూరు శాతం ప్రతి అక్షరం పనికి వచ్చిన పద్ధతిలో ఉంది కదా. ఏమి చిత్రము. ఏమి మన కవుల శక్తి. అలాంటి ద్రౌపదిని చూచి ధర్మరాజు నకుల సహదేవులకు చెబుదామనుకుని, వారు కూడా అలసి ఉండటంతో అర్జునుడిని పిలిచి ద్రౌపది ఇక నడవలేదు, కానీ ఇక్కడ విడిది చేద్దామన్నా కుదరదు, కాబట్టి ఆమెను నీవే ఎత్తుకో అని చెప్తాడు. అలా ద్రౌపదిని మోసుకొని పోయారు వారు. కాని నేటి మన వలస కూలీలను మోయడానికి ఏలినవారే వాహనాలు ఏర్పాటు చేయాలి. -ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి -
వీరమాత
మహా భారతంలో కుంతి పాత్ర ఎంతో వైవిధ్యమైనది. విలక్షణ మైనది. భర్త పాండురాజు మరణించిన నాటి నుండి తన పిల్లలని, మాద్రి పిల్లలని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, వారికి విద్యాబుద్ధులు నేర్పించి, గొప్ప వీరులుగా తీర్చిదిద్దింది. ఏక చక్రపురంలో ప్రజలు బకా సురుని బారినపడి ప్రాణాలు కోల్పోతున్నప్పుడు భీముణ్ణి వానికి ఆహా రంగా పంపుతుంది. ఆమె అలా పంపటంలో ఆంతర్యాన్ని ప్రశ్నించిన ధర్మజునికి ఇచ్చిన సమాధానం ఆమె విజ్ఞతను, ఆశ్రయమిచ్చిన యజ మాని పట్ల చూపవలసిన కృతజ్ఞతను, మాద్రి పిల్లలలో ఒకరిని కాక తన పిల్లలలో ఒకర్ని పంపడంలో గల నిస్వార్థ చింతనను, ధర్మసూక్ష్మతా శక్తిని విశ దపరుస్తాయి. తన బిడ్డల బలాన్ని, బలగాన్ని పెంచేటందుకు హిడిం బను కోడలిగా స్వీకరించింది. కురు, పాండవుల మధ్య పోరు తప్పదని ఊహిం చిన ప్రజ్ఞాశాలి ఈమె. పాండవుల మధ్య ఐక్యత సాధించేటందుకు ద్రౌపదిని ఐదుగురు భార్యగా భావించాలని ఆదేశమిచ్చింది. కుంతి, కృష్ణుడు హస్తి నకు రాయబారిగా వచ్చినప్పుడు ధర్మజుని ‘ఐదూళ్లు చాలన్న’ మాట విని కోపించింది. యుద్ధం చేయమని ధర్మజునికి హితవు చెప్పమని కృష్ణునితో అంటుంది. ఇక్కడ కుంతి వీరమాతగానే కాక నిజమైన రాజమాతగా కూడా కనిపిస్తుంది. వ్యాసుడు, విదురుడు, భీష్ముడు, మేనల్లుడైన కృష్ణుడి అండదండ లతో, సహాయ సహకారాలతో పాండవులని పెంచి పెద్ద చేసి, వారిని అసహాయ శూరులను చేసింది. వారి శక్తి సామర్థ్యాలను జగద్విదితం చేసింది. ఓ ఉదాత్తమైన మాతృమూర్తిగా నిలిచింది. యుద్ధానంతరం, తన శేష జీవితాన్ని అడవులలో ఆశ్రమాలలో గడపటానికి వెళుతున్న కుంతిని భీముడు ఇందుకోసమా మమ్మల్ని యుద్ధం చేయమని ప్రేరే పించింది అని ఆక్రోశంతో ప్రశ్నిస్తాడు. కుంతి ఇదంతా వారి సుఖం కోసమని, హక్కుగా రావలసిన రాజ్యాధికారం కోసమని, గౌరవ జీవితం కోసమని చెబుతుంది. ఒక మాతృమూర్తిగా తన పిల్లల నుండి గౌరవ మర్యాదలను విరివిగా పొందిన ధీర వనిత కుంతి. వ్యాస భగ వానుని అద్భుత సృష్టి. – డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి -
ఒక్కరోజులోనే ఆ సీరియల్‌కు 50 మిలియన్ వ్యూస్
సాక్షి, ఢిల్లీ : ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఇప్పటికే సినిమాలు, సీరియళ్లు, వీడియోగేమ్‌లు, అమెజాన్‌ప్రైమ్‌లు..అబ్బో చాలానే వచ్చేశాయి. అయినప్పటికీ మన భారతీయులకు రామాయణ, మహాభారతం లాంటి పౌరాణిక గాధలపై మమకారం ఏమాత్రం తగ్గలేదు. అప్పటికీ, ఇప్పటికీ అదే ఆదరణ, అదే భక్తి వాత్సల్యం. దీనికి నిదర్శనమే ఇప్పుడు దూరదర్శన్ ఛానెల్‌కు లభిస్తున్న రేటింగ్. ప్రస్తుతం దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న రామాయణ్, మహాభారత్ సీరియల్స్.. రేటింగ్స్‌లో దుమ్ముదులిపే రికార్డులను సాధిస్తుంది. 33 ఏళ్ల క్రితం ప్రసారమైన ఈ సీరియల్స్..లాక్డౌన్ పుణ్యమా అని మళ్లీ టెలికాస్ట్ అయ్యాయి. రామానంద్‌సాగర్, బిఆర్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన రామాయణ్, మహాభారత్ సీరియళ్లకు భారీ ఆదరణ లభిస్తోంది. దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న ఈ సీరియల్స్ మొదటి నాలుగు ఎపిసోడ్లకు 170 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు బార్క్ ఇండియా తెలిపింది. వీటిలో ఆదివారం ప్రసారమైన ఒక్క ఎపిసోడ్‌కే 5కోట్ల వ్యూయర్షిప్ నమోదైంది.దేశ చరిత్రలోనే సీరియల్స్‌కు ఈ రేంజ్లో వ్యూయర్షిప్ రావడం ఇదే మొదటిసారి.దీంతో డీడీ ఛానల్ వ్యూయర్షిప్ అమాంతం పెరిగింది. దీంతో డీడీ ఛానల్‌కి మునుపెన్నడూ లేనంతగా 650 శాతం లాభాల్లో దూసుకుపోయింది. దీనిపై దూదర్శన్ సీఈవో శశి శేఖర్ మాట్లాడుతూ.."దూరదర్శన్ వీక్షకులందరికీ చాలా ధన్యవాదాలు. భారతదేశం అంతటా అత్యధిక వీక్షించిన ఛానెల్ ఇదే. మీ అందరి మద్దతుకు కృతఙ్ఞతలు. ఇంట్లోనే ఉండండి. సురక్షితంగా ఉండండి "అంటూ ట్వీట్ చేశారు. A Big Thank You to all the viewers of Doordarshan - per @BARCIndia the most viewed channel during week 13 is @DDNational across India. With your support Public Broadcaster has helped India Stay Home, Stay Safe as we fight back #COVID-19 pandemic. — Shashi Shekhar (@shashidigital) April 9, 2020 మార్చి 28న రీ టెలికాస్ట్ అయిన ఈ సీరియల్స్..పాత రికార్డులను బద్దలుకొడుతూ కొత్త రికార్డులను సెట్చేసింది. పైగా దీని ద్వారీ ఈ తరం వారికి పౌరణిక గాధలపై అవగాహన ఏర్పడే మంచి అవకాశం లభించింది. -
ద్రౌపదిగా దీపిక
‘మహాభారతం’ ఇతిహాసం ఆధారంగా ఇప్పటికే చాలా చిత్రాలు వచ్చాయి. తాజాగా బాలీవుడ్లో మరో చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాలో ద్రౌపది పాత్రలో దీపికా పదుకోన్ నటించనున్నారు. ఈ సినిమాను మధు మంతెన, దీపికా పదుకోన్ నిర్మించనున్నారు. రెండు మూడు భాగాలుగా ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. తొలి పార్ట్‌ను 2021 దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దీపిక. ‘‘ద్రౌపది పాత్రలో నటించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. గౌరవంగా ఫీల్ అవుతున్నాను. నా జీవితాంతం గుర్తిండిపోయేలా ద్రౌపది పాత్ర వెండితెరపైకి వస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు దీపిక. ‘‘మహాభారతం గురించి, ఈ గ్రంథం ద్వారా వచ్చిన సినిమాల గురించి మనందరికీ తెలుసు. కానీ మా సినిమా ద్రౌపది దృష్టి కోణంలో సాగుతుంది. కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయాన్ని, ఇతర నటీనటుల వివరాలను త్వరలో చెబుతాం’’ అన్నారు మధు మంతెన. -
భారతానికి వెళితే ఇంట్లో దొంగలు పడ్డారు!
చిత్తూరు అర్బన్ : మహాభారతం అంటే ఉన్న మక్కువ కొద్దీ వెళ్లి వచ్చేసరికి ఇంటిని దొంగలు ఊడ్చేశార్రా నాయనా! అని ఆ దంపతులు లబోదిబోమన్నారు. పోలీసుల వద్దకు పరుగులు తీశారు. వివరాలు.. స్థానిక సాంబయ్యకండ్రిగ పెట్రోలు బంకు ఎదురుగా ఉ న్న ఇంట్లో లోకనాథరెడ్డి కాపురముంటున్నాడు. అక్కడే ఉన్న ఓ ట్రాక్టర్ కంపెనీ లో ఈయన పనిచేస్తున్నాడు. మంగళవారం తన సొంతూరైన గంగాధరనెల్లూరు మండలం నెల్లేపల్లెమిట్టలో ‘మహాభారత యజ్ఞం’ ధ్వజారోహణ కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఇంటికి తాళం వేసి తన భార్యతో బైక్‌లో వెళ్లాడు. మంగళవారం అర్ధరాత్రి నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో పాల్గొని, అక్కడే పూజలు చేశారు. బుధవారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి బయట తాళం పగులగొట్టి ఉండటం చూసి ఠారెత్తారు. లోపలకు వెళ్లి చూస్తే బీరువాను కూడా పగులగొట్టి దాదాపు 160 గ్రా ములకు పైగా బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి బావురుమన్నారు. ఫిర్యాదు చేయడంతో చిత్తూరు క్రైమ్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. చోరీ జరిగిన ఇంటికి సీసీ కెమెరాలు ఉండటంతో ఫుటేజీని పోలీసులు పరి శీలించారు. చేతికి తొడుగులు ధరించి చోరీకి పాల్పడ్డట్లు ఫుటేజీల్లో నిక్షిప్తమవడం చూసి పోలీసులు ఈ దొంగోడు తెలివిగా పని కానిచ్చేశాడని నిర్ధారణకు వచ్చారు. కాగా, బయటి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని..నగలను ఇంట్లో ఉంచరాదని చెబుతున్నా పెడచెవిన పెట్టడంతో పోలీ సులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. 3రోజుల క్రితమే ఓ ఇంట్లో దొంగలు పడి 80 సవర్ల బంగారు, రూ.1.50లక్షల చోరీ ఘటన మరువక ముందే మళ్లీ 48 గంటల వ్యవధిలోనే చోరీ జరగడంతో హడలిపోతున్నారు. -
‘బాబర్, ఔరంగజేబుగా పేరు మార్చుకో’
సాక్షి, ముంబై: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తన పేరు మార్చుకుంటే మంచిదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సూచించారు. రామాయణ, మహాభారతాలు మొత్తం హింసతో నిండి ఉన్నాయని ఏచూరి చేసిన వ్యాఖ్యలపై సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హిందూ ధర్మపై నమ్మకం లేనప్పుడు ఆయనకు సీతారాం అనే పేరేందుకని .. బాబర్, చెంగిఛ్‌ఖాన్, ఔరంగజేబుగా పేరు మార్చుకుంటే బాగుంటుందని వ్యంగ్యంగా సలహా ఇచ్చారు. రాముడిపై నమ్మకం లేని వారు ఈ దేశంలో ఉండడానికి అనర్హులని సంజయ్ వ్యాఖ్యానించారు. ‘హిందువులు హింసాత్మకంగా ఉంటారనడంలో ఆయన ఉద్దేశం ఏంటి? రామాయణం, మహాభారతాలు ఒకటే సందేశాన్ని ఇస్తున్నాయి. ఎప్పటికైనా చెడు మీద మంచి గెలుస్తుందనేదే దాని సందేశం. రాముడు, కృష్ణుడు, అర్జునుడు అంతా సత్యానికి సంకేతాలు. రామాయణ, మహాభారతాల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు.. రేపు పాకిస్తాన్ మీద భారత సైనికుల పోరాటం కూడా హింసాత్మకం అంటారు. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌ను ఎదుర్కోవడం కూడా హింసేనా?’ అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. హిందువులను ఎటాక్ చేయడమే ఆయన విధానమని.. ఆ విధంగా తనను తాను సెక్యులర్‌గా గుర్తింపు పొందాలని తాపత్రయం పడుతున్నారని సంజయ్ అన్నారు. ఇదిలావుండగా ఏచూరి వ్యాఖ్యలు తమ మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయంటూ.. యోగా గురువు రామ్‌దేవ్ బాబా హరిద్వార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఏచూరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భోపాలో ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న సీతారం ఏచూరి పలు వివాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రామాయణ ,మహభారతం లు రెండు కూడ యుద్దాలతోపాటు హింసాత్మక ఘటనలతో నిండి ఉన్నాయని అన్నారు. హిందు ప్రచార వాదులు చెబుతున్నట్టుగా హిందువులు హింసను ప్రోత్సహించే వారు కాదని చెప్పగలరా అని ఏచూరి ప్రశ్నించారు. మరోవైపు హిందువుల ఓట్ల కోసం బీజేపీ ఉగ్రవాద ఆరోపణలు ఎదుర్కోన్న సాధ్విని పోటిలోకి దింపిందని ఏచూరి ఆరోపించారు. -
ఆమిర్ వద్దనుకుంటే షారుక్
మన దర్శకధీరుడు రాజమౌళి నుంచి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్‌ఖాన్ వయా మలయాళంలో మోహన్‌లాల్ వరకూ ఉన్న కామన్ డ్రీమ్ మహాభారతాన్ని సిల్వర్ స్రీన్‌పై తీసుకురావడం. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో వ్యక్తపరిచారు కూడా. ఈ సినిమాను వెయ్యి కోట్ల భారీ బడ్జెట్‌తో వెబ్ సిరీస్‌గా ఆవిష్కరించాలనుకున్నారు ఆమిర్‌ఖాన్. అయితే ఈ ఆలోచనను ఆపేశారని ఇటీవల పలు వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఇంకా డిస్కషన్స్‌లో ఉందని షారుక్ హింటిచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎలాంటి పాత్ర చేయాలనుంది? అని అడగ్గా – ‘‘మహాభారతం’లో శ్రీకృష్ణుడి పాత్ర చేయాలనుంది. కానీ ఈ పాత్రను ఆమిర్‌ఖాన్ ఆల్రెడీ టేకప్ చేశారు కాబట్టి చేయడం కుదరదేమో’’ అని సమాధానం ఇచ్చారు. అంటే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే డిస్కషన్లో ఆమిర్ ఉన్నారని ఊహించవచ్చు. అన్నట్లు.. ఒకవేళ షారుక్ ఆకాంక్ష తెలుసుకుని ఆమిర్ ఈ పాత్ర చేయకపోతే అప్పుడు బాద్షానే శ్రీకృష్ణుడు అవుతారేమో. -
రాజధర్మం
దేశాన్ని పాలించే రాజు నీతిమంతుడైతే, న్యాయ బద్ధంగా వ్యవహరిస్తే ప్రజా క్షేమాన్ని కాంక్షిస్తే ఆ దేశం సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది. యధా రాజా తథా ప్రజా అని ఆర్యోక్తి. రాజును బట్టే ప్రజలు. చరిత్రలో చక్కని పాలన చేసి, గణుతికెక్కిన రాజులను రామునితోను, ఆ రాజ్యాన్ని రామరాజ్యంతోను పోలుస్తారు. రాముడు అంతటి ఆదర్శవంతుడైన పాల కుడు. ప్రజాభిప్రాయానికి విలువనిచ్చిన పాలకుడు. ప్రాచీన సాహిత్యం ఓ విజ్ఞాన భాండాగారం. పాలకులు పాటించవలసిన ధర్మాలు అందులో చక్కగా చెప్పారు. సుస్థిర దేశ పాలనకు, దేశ సౌభా గ్యానికి అవి ఎంతో ఉపకరిస్తాయి. మహా భారతంలో సభా పర్వంలో నారదుడు ధర్మరాజు దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని ప్రశ్నలడుగు తాడు. పాలకులైనవారు ఎలా ఉండాలో తెల్పుతా యవి. సర్వకాలాలకు వర్తించే ధర్మాలవి. రాజు ఎప్పుడూ ధర్మమందే మనసు నిలపాలి. తను చేయవలసిన రాజకార్యాలను సొంత బుద్ధితో అర్ధరాత్రి దాటిన తర్వాత ఆలోచించాలి. ఎందుకంటే అప్పుడు రాజు ఏకాంతంగా ఉంటాడు. అతని ఆలోచ నలకు ఏకాగ్రత ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో యోగ్యులైన వాళ్లను, వారి వారి శక్తి సామర్థ్యాలను గుర్తించి నియమించాలి. ముఖ్యంగా పన్నులు వసూలు చేయటంవంటి ధనార్జనకు సంబంధించిన పనులలో నిజా యితీపరులను, సమబుద్ధితో వ్యవహరించేవారిని, విలువలను పాటించే వారిని నియమించాలి. అవినీతిపరులను నియమిస్తే ప్రభుత్వ ధనానికి లోటు ఏర్పడుతుంది. ప్రజలకు ప్రభుత్వంపై విముఖత ఏర్పడుతుంది. దేశాల మధ్య యుద్ధాలు జరిగినప్పుడు ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోతారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల కుటుంబాలను రాజు శాశ్వ తంగా ఆదుకోవాలి. ప్రభుత్వం ఎప్పుడూ వ్యవసా యాన్ని, వాణిజ్యాన్ని ప్రోత్సహించాలి. సమాజాభ్యుదయానికి ఇవి చాలా అవసరం. మహాభారత కాలం లోనే అధికాహారోత్పత్తికి విత్తనాలు, తక్కువ వడ్డీతో రుణాలు వ్యవసాయదారులకు ప్రభుత్వం ఇచ్చినట్లు నారదుని మాటల వల్ల తెలుస్తోంది. రాజు దృష్టిలో ప్రజలందరూ సమానమే. అయితే లోపమున్న పిల్లలను తల్లి ఇంకా ఎంత బాగా ప్రేమి స్తుందో అలా కుంటివారు, గుడ్డివారు, వికలాంగు లకు రాజు ప్రత్యేక సదుపాయాలు కలుగజేయాలి. ఎప్పుడో మహాభారత కాలం నాడు చెప్పిన ఈ రాజధర్మాలు ఇప్పటికీ ఎప్పటికీ శిరోధార్యాలు! వాసంతి -
ద్రౌపదిగా దీపిక?
బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్ ద్రౌపదిగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ‘మహాభారతాన్ని వెండి తెరకెక్కించడం నా కల’ అంటూ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ తన మనసులోని మాటను గతంలో బయటపెట్టిన సంగతి తెలిసిందే. అత్యధిక బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబాని నిర్మించనున్నారనే వార్తలు గతంలో హల్చల్ చేశాయి. ఆమిర్ అలా చెప్పారో లేదో.. ఏ పాత్రకు ఎవరు సరిపోతారంటూ బాలీవుడ్లో చర్చలు జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ చిత్రంలో ద్రౌపది పాత్రకి దీపిక పదుకోన్‌ని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారట ఆమిర్. ‘బాజీరావ్ మస్తానీ, పద్మావత్’ వంటి చారిత్రక సినిమాల్లో తన నటనతో దీపిక ఏ రేంజ్లో ప్రేక్షకులను అలరించారో తెలిసిందే. ఆ రెండు చిత్రాల్లో దీపిక కనబర్చిన నటన చూసి, ‘మహాభారతం’ సినిమాలో ద్రౌపది పాత్రకు ఆమె అయితేనే కరెక్ట్‌గా సరిపోతారని ఆమిర్ ఆలోచనట. ‘బాజీరావ్ మస్తానీ, పద్మావత్’ చిత్రాల్లో దీపిక పాత్రలు వివాదాస్పదమైన సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ అనుభవాలతో ద్రౌపదిగా నటించేందుకు దీపిక ఒప్పుకుంటారా? అని కొందరు అంటుంటే.. ఆమిర్ అంతటివాడు అడిగితే ఈ బ్యూటీ కాదంటారా? అనేవారూ లేకపోలేదు. ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ద్రౌపది పాత్రను దీపికానే చేస్తారా? ఈ ప్రాజెక్ట్‌లో నటించే చాన్స్ ఎవరెవరికి దక్కుతుంది? అనే విషయాలకు కాలమే సమాధానం చెప్పాలి. -
భారతంలో ఇంటర్నెట్.. నిజమే!
అగర్తలా: మహాభారతం సమయంలోనే ఇంటర్నెట్, ఉపగ్రహ సమాచార వ్యవస్థ ఉందన్న త్రిపుర ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు ఆ రాష్ట్ర గవర్నర్ తథాగత్ రాయ్ మద్దతు లభించింది. పురాణ కాలం నాటి విషయాలపై ముఖ్యమంత్రి సమయోచితంగా మాట్లాడారన్నారు. ఆ రోజుల్లో ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేకుండా దివ్య దృష్టి, పుష్పక రథం వంటివి సాధ్యం కావని ట్వీటర్లో తెలిపారు. మహాభారతం కాలం, ఆ తర్వాత ప్రస్తుతం సాంకేతిక విజ్ఞానం విస్తృతంగా వినియోగంలో ఉండగా మధ్యయుగాల్లో ఏమైందో మాత్రం తనకు తెలియదన్నారు. ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. -
భీమ్ కీ గురు?
మోహన్‌లాల్ భీముడిగా ‘మహాభారతం’ ఆధారంగా వెయ్యి కోట్లతో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విశేషాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అన్ని భారతీయ భాషలకు చెందిన టాప్ హీరోలు ఈ సినిమాలో ఏదో ఓ పాత్రలో తళుక్కున మెరుస్తారని చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడీ సినిమా తారగణంలోకి చైనీస్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ హీరో జాకీచాన్ కూడా యాడ్ అయ్యారు. భీమసేనుడికి యుద్ధవిద్యలు నేర్పిన నాగరాజు పాత్రలో జాకీచాన్ కనిపించనున్నారని సమాచారం. మలయాళ రచయిత ఎమ్.టీ వాసుదేవన్ నాయర్ రాసిన నవల ఆధారంగా రూపొందనున్న ఈ ‘మహాభారతం’ సినిమాను ఆల్రెడీ మోహన్‌లాల్‌తో ‘ఒడియన్’ అనే సినిమాను తెరకెక్కించిన శ్రీకూమార్ మీనన్ దర్శకత్వం వహించనున్నారు. -
కురుక్షేత్రంలో ఖిల్జీ!
కర్ణుడా.. దుర్యోధనుడా.. అర్జునుడా.. భీముడా.. రణ్వీర్ సింగ్ ఏ రోల్ చేస్తే బాగుంటుందంటారు? ఇదిగో ఇలాంటి చర్చే జరుగుతుంది బీటౌన్‌లో. ఎందుకంటే బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’లో రణ్వీర్ నటించనున్నారట. ఎప్పటినుంచో ఈ ప్రాజెక్ట్ పనిలో ఉన్న ఆమిర్ రీసెంట్ టైమ్స్‌లో కాస్త స్పీడ్ పెంచారు. రణ్వీర్ సింగ్‌తో చర్చలు జరిపారు. రణ్‌వీర్‌ని తీసుకోవాలని ఆమిర్ అనుకోవడానికి కారణం ‘పద్మావత్’ సినిమా. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపికా పదుకోన్, షాహిద్ కపూర్, రణ్‌వీర్‌సింగ్ ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రంలో ఖిల్జీ పాత్రలో అందర్నీ మెప్పించారు రణ్వీర్. ఆమిర్ ఖాన్ కూడా ఖిల్జీకి ఫిదా అయ్యారు. అంతకుముందు రణ్వీర్ చేసిన పాత్రలు ఇష్టమైనప్పటికీ ఖిల్జీ పాత్ర ఆయనకు బాగా నచ్చిందట. అందుకే మహాభారతం సినిమా తీస్తే అందులో ఏ క్యారెక్టర్ సూట్ అవుతుందా? అని రణ్‌వీర్‌తోనే చర్చలు జరిపారు. రీసెంట్గా ఓ ప్రైవేట్ ప్రోగ్రామ్ కోసం కలిసిన వీళ్లు.. మరో కార్యక్రమం కోసం మళ్లీ కలిశారు. అక్కడే ఇద్దరి మధ్య మహాభారతం గురించిన టాపిక్ వచ్చిందట. ఈ సంగతి ఇలా ఉంచితే ప్రస్తుతం ‘గల్లీబాయ్’ చిత్రంతో రణ్వీర్, ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ సినిమాతో ఆమిర్ బిజీగా ఉన్నారు. మరి.. ‘మహాభారతం’ పట్టాలెక్కేదెప్పుడు? కాలమే చెప్పాలి. -
ఆ ముగ్గురి కల ఒక్కటే..!
ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన సౌత్ దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో ఒక్కసారిగా అంతర్జాతీయ సినీ సెలబ్రిటీగా మారిన అతడు ఆ చిత్రం కన్నా భారీగా మహా భారతాన్ని తెరకెక్కిస్తానంటూ ప్రకటించాడు. అయితే ఆ సినిమా రూపొందించే స్థాయి, పరిజ్ఞానం తనకింకా రాలేదన్న జక్కన్న ఏ రోజుకైనా మహాభారతానికి దృశ్యరూపం ఇవ్వటమే తన కల అంటూ ప్రకటించాడు. తాజాగా బాలీవుడ్ రీమేక్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవ కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు. కొరియోగ్రాఫర్‌గా సత్తా చాటి ఇప్పుడు దర్శకుడిగా హవా చూపిస్తున్న ప్రభుదేవా, ఎప్పటికైన మహాభారతాన్ని తన దర్శకత్వంలో తెరకెక్కించాలని భావిస్తున్నాడట. అది కూడా హాలీవుడ్ సినిమా లార్డ్ ఆఫ్ ద రింగ్స్ స్థాయిలో భారీగా తెరకెక్కించడానికి ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇక దర్శకరత్న దాసరి కూడా మహాభారతానికి దృశ్యరూపం ఇవ్వాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాడు. కొంత కాలంగా దర్శకత్వానికి దూరంగా ఉన్న ఆయప సరైన సమయంలో మరోసారి మెగాఫోన్ పట్టి మహాభారత పౌరాణిక గాథను తనదైన స్టైల్లో వెండితెర మీద ఆవిష్కరించే ఆలోచనలో ఉన్నాడు. మరి ఈ ముగ్గురిలో ఎవరు ముందుగా మహాభారతాన్ని మొదలు పెడతారో చూడాలి. -
జయమ్ - భారతమ్ - మహాభారతమ్
మహాభారతం కురువంశ చరిత్ర. కురువంశానికి మూలం చంద్రవంశం. చంద్రవంశానికి ఆద్యుడు ‘చంద్రుడు’. ఈ వంశ పరంపరలో, చంద్రుడి తర్వాత వచ్చిన రాజుల్లో దుష్యంతుడి కొడుకు ‘భరతుడు’ వంశకర్త. భరతుడి పేరుమీద ‘చంద్రవంశం’, ‘భరతవంశం’ అయింది. మనదేశం ‘భారతదేశం’ అయింది. భరతుడికి అయిదు తరాల తర్వాత వచ్చిన రుక్షుడు అనే రాజుకు ‘సంవరణుడు’ అనే కొడుకు పుట్టాడు. ఈ సంవరణునికి, తపతికి పుట్టిన సంతానం ‘కురువు’. ఇతడు వంశకర్త. భరతవంశం ‘కురువంశం’గా వ్యవహారానికి వచ్చింది. ధృతరాష్ట్రుడి కుమారులు ధార్తరాష్ట్రులు. పాండురాజు కొడుకులు పాండవులు. ధార్తరాష్ట్రులు, పాండవులు - అందరూ కౌరవులే! ‘ధార్తరాష్ర్టులు’ పలకడంలో క్లిష్టత ఉంది. ఆ కారణంగా వారిని కౌరవులు అనడం మొదలైంది. అదే ‘కౌరవులు’ పదాన్ని పాండురాజు కొడుకులకు కూడా ఉపయోగిస్తే ఎవరు ఎవరని సందిగ్ధత ఏర్పడుతుంది. కాబట్టి, పాండురాజు కొడుకులు ‘పాండవులు’ అయ్యారు. దాయాదుల మధ్య వైరం ఇంత వినాశనానికి దారితీసిందే - ఈ చరిత్రకు కావ్యరూపం ఇస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది వ్యాసుడికి. మొదట వ్యాసుడు రాసిన కావ్యం ‘జయమ్’. మహాభారత యుద్ధం ప్రకటించబడిన మూడు సంవత్సరాల కాలంలో పూర్తిచేశాడు. యుద్ధంలో మరణించిన వీరులకు అంతిమ సంస్కారాలు చేసి, ధర్మరాజు హస్తినలో అడుగుపెట్టడంతో ‘జయమ్’ పూర్తవుతుంది. ఈ కావ్య నిడివి 8800 శ్లోకాలు మాత్రమే! ఈ శ్లోకాలు అన్నీ మహాభారతంలోని లక్ష శ్లోకాలలో కలసిపోయి ఉన్నాయి. సౌతి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ‘‘ఆ గ్రంథం ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలు కలది. ఆ శ్లోకాలు నాకు తెలుసు. శుకుడికి తెలుసు. సంజయుడికి తెలుసో తెలియదో (అష్టౌ శ్లోక సహస్రాణి హ్యష్టౌ శ్లోక శతానిచ, అహంవేత్తి శుకోవేత్తి సంజయో వేత్తివానవా - అనుక్రమణికాధ్యాయం)’’ అన్నాడు. ఎక్కువమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం క్రీస్తుపూర్వం 1535లో మహాభారత యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కురువంశం దాదాపు నశించి పాండవుల వారసుడిగా అభిమన్యుడి కొడుకు పరిక్షిత్తు మిగిలాడు. అతడికి 36 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కృష్ణుడు మరణించాడు. పాండవులు కోరికలు చంపుకొని స్వర్గారోహణ కోసం దేవభూములున్న హిమాలయ పర్వతాలకు వెళ్లడానికి ముందు పరిక్షిత్తుకు పట్టాభిషేకం చేశారు. ధృతరాష్ట్రుడికి, ఒక వైశ్య కన్యకు పుట్టిన యుయుత్సుణ్ని సంరక్షకుడిగా ఉండమన్నారు. పరిక్షిత్తు 60 సంవత్సరాల పాటు రాజ్యంచేసి కొడుకు జనమేజయుడికి పట్టం కట్టాడు. ఆ జనమేజయుడు వయసు మీరుతున్న సమయంలో సర్పయాగం చేశాడు. జనమేజయుడు సర్పయాగం సంకల్పించినప్పుడు వైశంపాయనుడు కౌరవ పాండవుల చరిత్రను చెప్పాడు. వైశంపాయనుడు చెప్పింది వ్యాసమహర్షి చెప్పిన జయం కావ్యాన్నే. అయితే మధ్యమధ్యలో జనమేజయుడు ఎన్నో ప్రశ్నలు అడిగాడు. ఎన్నో సందేహాలు వెలిబుచ్చాడు. వాటన్నిటికీ వైశంపాయనుడు సమాధానాలు చెప్పాడు. వాటన్నిటినీ కలుపుకొని జయేతిహాసం నిడివి పెరిగింది. 24,000 శ్లోకాలతో వైశంపాయనుడు చెప్పిన జయం ‘భారతం’ అయింది. వైశంపాయనుడు భారతకథను చెప్పినప్పుడు ఎందరో సూతులు విని ఉంటారు. ఆ విన్నవారిలో ఉగ్రశ్రవసుడు ఒకడు. ఆ సూతుడు భారతాన్ని మననం చేసుకొని తన శిష్యులకు నేర్పి ఉంటాడు. ఉగ్రశ్రవసుడి ద్వారా భారతం నేర్చుకొన్న సౌతి నైమిశారణ్యంలో శౌనకాది మునులు ‘దీర్ఘసత్త్రం’ చేసినప్పుడు వారికి వినిపించాడు. వింటున్న మునులు మరింకెన్నో ప్రశ్నలు వేయడం, సౌతి ఉపాఖ్యానాలు చేర్చి మునులను తృప్తిపరచడంతో భారతం నిడివి మరింత పెరిగింది. సౌతి ఒక్కడే కాదు, ఆ తర్వాత వచ్చిన పౌరాణికులు సందర్భానికి తగినట్లు ఎన్నెన్నో కథలను, నీతులను చేర్చి ఉంటారు. రామాయణం, నలదమయంతుల కథలు కూడా భారతంలో చేరిపోయాయి. ఈ కోణంలో చూస్తే 8800 శ్లోకాలు లక్ష శ్లోకాలు కావడం వింత కలిగించే విషయం కాదు. వ్యాసుడు జయం రాసిననాటికి - సౌతి మునులకు చెప్పిన నాటికి నడుమ 150-170 సంవత్సరాల కాలం దొరలి ఉంటుంది. క్రీస్తుశకం 4వ శతాబ్దానికి చెందిన గుప్తశాసనం ద్వారా అప్పటికి భారతం, మహాభారతం రెండూ ప్రచారంలో ఉండేవని, మహాభారతం పరిమితి లక్ష శ్లోకాలని స్పష్టంగా తెలుస్తోంది. ఎవరు ఎంత చేర్చినా ఎంత మార్చినా కొన్ని వేల సంవత్సరాల పాటు భారతం నిలబడింది అంటే అది ఆ కథ గొప్పదనం. భారతం మూలకథలో కృష్ణుడు ఒక రాజనీతిజ్ఞుడు. క్రీస్తుపూర్వం 12వ శతాబ్దం శాకటాయనుడి కాలంలో అదే కృష్ణుడు ఒక యుద్ధవీరుడు. క్రీ.పూ.5వ శతాబ్దం వచ్చేటప్పటికి అదే కృష్ణుడు వైదిక మత ప్రవక్త అయ్యాడు. గౌతమబుద్ధుడి కాలం తర్వాత రామ, కృష్ణులు అవతార పురుషులు అయ్యారు. భగవద్గీత భారతంలో అంతర్భాగం అయింది. ఇదంతా బౌద్ధమతం వల్ల, మ్లేచ్ఛుల వల్ల ప్రతిష్ఠ కోల్పోవడం మొదలైన వైదికమత పునరుద్ధరణ కోసం! ప్రాచీన కాలంలో మతం అంటే యజ్ఞాది కర్మలు చేయడం, ప్రకృతిని ఆరాధించడం. ఆ కాలంలో దేవతలు ప్రకృతిలో భాగమైన అగ్ని, వరుణుడు, సూర్యుడు, మరుత్తులు లాంటివాళ్లు. దేవతలకు రాజు దేవేంద్రుడు. ఆరోగ్యాన్ని ప్రసాదించేది అశ్వినీ దేవతలు. అప్పట్లో మొత్తం దేవతల సంఖ్య ముప్ఫై మూడు మాత్రమే! దేవతలంతా జనకల్యాణం కోసం ఎత్తయిన ప్రదేశాల్లో నివసిస్తారని ప్రజలు నమ్మేవారు. హిమాలయాల్లో దేవలోకం ఉందని, స్వర్గలోకానికి పొలిమేరలాంటి గంధమాదన పర్వతం దాటితే దేవతలు కనిపిస్తారని అనుకొనేవారు. మహాభారతంలో అర్జునుడు శివుడి అనుగ్రహం సంపాదించడానికి, దేవేంద్రుడితో చెలిమి చెయ్యడానికి వెళ్లింది హిమాలయ పర్వతాలలోకే! చివరికి స్వర్గారోహణ పర్వంలో పాండవులు నడిచింది కూడా అటువైపుకే! అద్భుతాలు జరుగుతాయి అంటే నమ్మేకాలం మహాభారతకాలం. దేవతలు, మానవాతీత శక్తుల పట్ల అవధులు లేని విశ్వాసం ఉండేది. వాన, గాలి, గడ్డి, కడవ, అగ్ని, నది, సూర్యుడికి పిల్లలు పుట్టారు అంటే నిజమే కాబోలు అనుకొన్నారు. అటువంటి కాలంలో వ్యాసమహర్షి సృష్టించిన జయేతిహాసంలోకి నమ్మశక్యంకాని చిట్టడవుల్లాంటి చిన్న చిన్న కథలు వచ్చి చేరాయి. దేవుళ్లు, వేదాంతం, రకరకాల శాస్త్రాలు, లోకనీతులు, రాజనీతులకు సంబంధించి అసంఖ్యాకంగా అంతులేని వ్యాఖ్యానాలు చోటుచేసుకొన్నాయి. ఎన్నో ఊహకందని ఉపాఖ్యానాలు, నీతికథలు, ముగింపులేని యుద్ధాలు, మరణం లేని మహావీరులు, అవినీతిమంతులు, సహనం లేని మునులు, నేలవిడిచి సాముచేసే సాహసవీరులు - మహాభారత కథలోకి బలవంతంగా చొచ్చుకొచ్చారు. జయమ్ భారతంగా మారి, మహాభారతంగా స్థిరపడింది. (నాయుని కృష్ణమూర్తి,ఫోన్: 9440804040, వ్యాసకర్త నవలారూపంలో రాస్తున్న మహాభారతం మూలకథ ‘జయమ్’ అనుబంధం నుండి...)