సాక్షి, ఢిల్లీ : ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో ఇప్పటికే సినిమాలు, సీరియళ్లు, వీడియోగేమ్‌లు, అమెజాన్‌ప్రైమ్‌లు..అబ్బో చాలానే వచ్చేశాయి. అయినప్పటికీ మన భారతీయులకు రామాయణ, మహాభారతం లాంటి పౌరాణిక గాధలపై మమకారం ఏమాత్రం తగ్గలేదు. అప్పటికీ, ఇప్పటికీ అదే ఆదరణ, అదే భక్తి వాత్సల్యం. దీనికి నిదర్శనమే ఇప్పుడు దూరదర్శన్ ఛానెల్‌కు లభిస్తున్న రేటింగ్. ప్రస్తుతం దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న రామాయణ్, మహాభారత్ సీరియల్స్.. రేటింగ్స్‌లో దుమ్ముదులిపే రికార్డులను సాధిస్తుంది. 33 ఏళ్ల క్రితం ప్రసారమైన ఈ సీరియల్స్..లాక్‌డౌన్ పుణ్యమా అని మళ్లీ టెలికాస్ట్ అయ్యాయి.
రామానంద్‌సాగర్, బిఆర్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన రామాయణ్, మహాభారత్ సీరియళ్లకు భారీ ఆదరణ లభిస్తోంది. దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న ఈ సీరియల్స్ మొదటి నాలుగు ఎపిసోడ్‌లకు 170 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు బార్క్ ఇండియా తెలిపింది. వీటిలో ఆదివారం ప్రసారమైన ఒక్క ఎపిసోడ్‌కే 5కోట్ల వ్యూయర్‌షిప్ నమోదైంది.దేశ చరిత్రలోనే సీరియల్స్‌కు ఈ రేంజ్‌లో వ్యూయర్‌షిప్ రావడం ఇదే మొదటిసారి.దీంతో డీడీ ఛానల్ వ్యూయర్‌షిప్ అమాంతం పెరిగింది. దీంతో డీడీ ఛానల్‌కి మునుపెన్నడూ లేనంతగా 650 శాతం లాభాల్లో దూసుకుపోయింది. దీనిపై దూదర్శన్ సీఈవో శశి శేఖర్ మాట్లాడుతూ.."దూరదర్శన్ వీక్షకులందరికీ చాలా ధన్యవాదాలు. భారతదేశం అంతటా అత్యధిక వీక్షించిన ఛానెల్ ఇదే. మీ అందరి మద్దతుకు కృతఙ్ఞతలు. ఇంట్లోనే ఉండండి. సురక్షితంగా ఉండండి "అంటూ ట్వీట్ చేశారు.
A Big Thank You to all the viewers of Doordarshan - per @BARCIndia the most viewed channel during week 13 is @DDNational across India. With your support Public Broadcaster has helped India Stay Home, Stay Safe as we fight back #COVID-19 pandemic.
— Shashi Shekhar (@shashidigital) April 9, 2020
మార్చి 28న రీ టెలికాస్ట్ అయిన ఈ సీరియల్స్..పాత రికార్డులను బద్దలుకొడుతూ కొత్త రికార్డులను సెట్‌చేసింది. పైగా దీని ద్వారీ ఈ తరం వారికి పౌరణిక గాధలపై అవగాహన ఏర్పడే మంచి అవకాశం లభించింది.
Comments
Please login to add a commentAdd a comment