
భారతీయ ఇతిహాసం మహాభారతం ఆధారంగా దాదాపు ఐదు సంవత్సరాల క్రితం విక్రమ్ హీరోగా ఆర్‌ఎస్ విమల్ దర్శకత్వంలో ‘సూర్యపుత్రన్ కర్ణన్’ అనే సినిమా ప్రకటన వెల్లడైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాని దాదాపు మూడొందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తారనే ప్రచారం అప్పట్లో సాగింది. కానీ వివిధ కారణాల వల్ల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు.
అయితే ‘సూర్యపుత్రన్ కర్ణన్’ సినిమా ‘రోలింగ్ సూన్’(త్వరలో చిత్రీకరణ ప్రారంభం అవుతుందన్నట్లుగా..) అంటూ కర్ణుడి పాత్రలో ఉన్న విక్రమ్ ఫోటోను షేర్ చేశారు విమల్. అలాగే ఈ సినిమా టీజర్ అంటూ మరో వీడియోను ఆదివారం షేర్ చేశారాయన. మరి... ఈ మూవీకి ఉన్న అడ్డంకులు తొలగినట్లేనా? త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందా? వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment