
జాకీచాన్, మోహన్‌లాల్
మోహన్‌లాల్ భీముడిగా ‘మహాభారతం’ ఆధారంగా వెయ్యి కోట్లతో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో విశేషాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అన్ని భారతీయ భాషలకు చెందిన టాప్ హీరోలు ఈ సినిమాలో ఏదో ఓ పాత్రలో తళుక్కున మెరుస్తారని చిత్రబృందం ఇదివరకే ప్రకటించింది.
ఇప్పుడీ సినిమా తారగణంలోకి చైనీస్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ హీరో జాకీచాన్ కూడా యాడ్ అయ్యారు. భీమసేనుడికి యుద్ధవిద్యలు నేర్పిన నాగరాజు పాత్రలో జాకీచాన్ కనిపించనున్నారని సమాచారం. మలయాళ రచయిత ఎమ్.టీ వాసుదేవన్ నాయర్ రాసిన నవల ఆధారంగా రూపొందనున్న ఈ ‘మహాభారతం’ సినిమాను ఆల్రెడీ మోహన్‌లాల్‌తో ‘ఒడియన్’ అనే సినిమాను తెరకెక్కించిన శ్రీకూమార్ మీనన్ దర్శకత్వం వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment