నేచురల్ స్టార్ నాని చేసిన 'కృష్ణార్జున యుద్ధం' సినిమాలో ఓ ఊపూ ఊపేసిని జానపద పాటలో వస్తుంది ఈ గాంధరి వాన గురించి. అందులో కురస కురస అడివిలోన పిలగా..కురిసినీ గాంధారి వాన అంటూ.. మంచి బీట్‌తో సాగిపోతుంది. అసలు ఇంతకీ గాంధారి వాన అంటే ఏమిటి? ఎప్పుడైనా దాని గురించి విన్నారా? అయినా మహాభారతంలోని దృతరాష్ట్రుని భార్య గాంధారికి, ఈ వానకి సంబంధం ఏమిటి? ఎందకని అలా వానను ఆమె పేరుతో పిలుస్తున్నారు?..
గాంధారి వాన అంటే..అవసరం లేనప్పుడు అదును లేనప్పుడూ కురిసే పెద్ద వానను గాంధారి వాన అంటారు. గాంధారి వాన గురించి చెప్పాలంటే ముందు గాంధారి గురించి తెలియాలి. గాంధారి మహాభారతంలో ధృతరాష్ట్రుని భార్య. ఆమె గాంధార దేశ రాకుమారి. దుర్యోధనుని తల్లి. ఆమెకు నూరుగురు సంతానం అని మనందరికి తెలిసిందే. దుస్సల అనే కూతురుతో కలిపి మొత్తం నూటొక్కమంది పిల్లలు ఆమెకు.
ఇక ఆమె పేరు మీదగానే వానను పిలవడానికి కారణం ఏంటంటే..ముందుగా ఆమె గురించి తెలుసుకోవాలి. ఆమె తన భర్తకు కళ్లు లేవని, తన భర్త చూడని లోకం తాను చూడనంటూ కళ్లకు గంతలు కట్టుకున్న మహాసాధ్వీమణి గాంధారి. కాని దానివల్ల ఎలాంటి నష్టం జరిగిందో మహాభారతంలో చూశాం. ఇక్కడ ఒక కుటుంబానికి రెండు చక్రాలాంటి వాళ్లు తల్లిదండ్రలు. అందులో ఒక చక్రం పరిస్థితి బాగోనప్పుడూ ఇంకో చక్రం పూర్తిస్థాయిలో ఆధారభూతమై నిలబడి సంసారాన్ని లాగాలి. ఇక్కడ ఆమె భర్తపై ఉన్న అమితమైన ప్రేమతో చేసిన పని కాస్తా తన పిలల్లను చెడు మార్గంలో పయనించేలా చేసింది.
గాంధారి తన కళ్లకు గంతలు కట్టుకోవడంతో పిల్లలను తడిమి చూసుకునేదేగానే..వాళ్లు ఎలా పెరుగుతున్నారు, వారి బుద్ధే ఏ మార్గంలో పయనిస్తుందో చూసే అవకాశం లేకుండా పోయింది. దీంతో కౌరవులు పాండవులపై చేయరాని అకృత్యాలకు పాల్పడ్డారు. ఇక్కడ గాంధారి, దృతరాష్ట్రుడు ఇద్దరు కూడా వారిని సరైన మార్గంలో పెట్టకుండా అవ్యాజమైన ప్రేమను మాత్రమే చూపించారు.
అలాగే సయమం కాని సమయంలో..అకాలంగా అవసరం లేకుండా ధారగా కురిసిన వాన వల్ల ఏం ప్రయోజనం ఉండదు. కేవలం నష్టమే తప్ప. పంట అదునుతో సంబంధం లేకుండా వర్షం అచ్చం గాంధారిలా.. పిల్లల ఎదుగుతున్న విదానంపై దృష్టి పెట్టకుండా చూపిన అవ్యాజ ప్రేమ మాదిరిగా వర్షం కురిస్తే..అచ్చం కౌరవులు నాశనం అయినట్లే..పంటలు పాడవుతాయి. దీనివల్ల అంతమంచి వర్షమైనా.. నిరుపయోగమే అవుతుందే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి దీన్ని గాంధారి వాన అని పిలిచారు. ఈ మాట రాయలసీమ, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎక్కువగా ఆపాదించవచ్చు.
(చదవండి: ఈ తల్లులు ప్రకృతి మురిసేలా ..పిల్లల పెళ్లి ఘనంగా చేశారు)
Comments
Please login to add a commentAdd a comment