జూనియర్​ ఎన్టీఆర్, అల్లు అర్జున్​ మల్టీస్టారర్​ మూవీ! | Allu Arjun And Jr.NTR In The Race For The Immortal Ashwatthama - Sakshi
Sakshi News home page

మరోసారి మెగా-నందమూరి కాంబో రిపీట్ కానుందా!

Published Mon, Apr 17 2023 4:12 AM | Last Updated on Mon, Apr 17 2023 8:52 AM

Allu Arjun and Jr NTR in the race for Immortal Ashwatthama - Sakshi

మహాభారతం ఆధారంగా బాలీవుడ్‌లో ‘ది ఇమ్మోర్టల్‌ అశ్వథ్థామ’ అనే మైథలాజికల్‌ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌’ ఫేమ్‌ దర్శకుడు ఆదిత్యా థార్‌ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో హీరోగా తొలుత విక్కీకౌశల్, రీసెంట్‌గా రణ్‌వీర్‌ సింగ్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తాజాగా టాలీవుడ్‌ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ పేర్లను మేకర్స్‌ పరిశీలిస్తున్నారని బాలీవుడ్‌ టాక్‌.

వారిద్దరిలో ఎవరో ఒకర్ని హీరోగా తీసుకునేందుకు పరిశీలిస్తున్నారా? లేక ఇద్దర్నీ ఈ సినిమాలో నటింపచేసేలా సంప్రదింపులు జరుపుతున్నారా? అనే విషయంపై ఓ స్పష్టత రావాల్సి ఉంది.   రోనీ స్క్రూవాలా నిర్మించనున్న ఈ సినిమాను ఇటీవల జీ స్టూడియో టేకోవర్‌ చేసిందని బీటౌన్‌లో ప్రచారం సాగుతోంది. అదేవిధంగా ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్రకు సమంత పేరు పరిశీలనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరి.. ‘ది ఇమ్మోర్టల్‌ అశ్వథ్థామ’ చిత్రంలో ఫైనల్‌గా ఎవరు  హీరోగా నటిస్తారు? అనే విషయంపై ఓ క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement