మహా భారతంలో కుంతి పాత్ర ఎంతో వైవిధ్యమైనది. విలక్షణ మైనది. భర్త పాండురాజు మరణించిన నాటి నుండి తన పిల్లలని, మాద్రి పిల్లలని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, వారికి విద్యాబుద్ధులు నేర్పించి, గొప్ప వీరులుగా తీర్చిదిద్దింది. ఏక చక్రపురంలో ప్రజలు బకా సురుని బారినపడి ప్రాణాలు కోల్పోతున్నప్పుడు భీముణ్ణి వానికి ఆహా రంగా పంపుతుంది.
ఆమె అలా పంపటంలో ఆంతర్యాన్ని ప్రశ్నించిన ధర్మజునికి ఇచ్చిన సమాధానం ఆమె విజ్ఞతను, ఆశ్రయమిచ్చిన యజ మాని పట్ల చూపవలసిన కృతజ్ఞతను, మాద్రి పిల్లలలో ఒకరిని కాక తన పిల్లలలో ఒకర్ని పంపడంలో గల నిస్వార్థ చింతనను, ధర్మసూక్ష్మతా శక్తిని విశ దపరుస్తాయి. తన బిడ్డల బలాన్ని, బలగాన్ని పెంచేటందుకు హిడిం బను కోడలిగా స్వీకరించింది.
కురు, పాండవుల మధ్య పోరు తప్పదని ఊహిం చిన ప్రజ్ఞాశాలి ఈమె. పాండవుల మధ్య ఐక్యత సాధించేటందుకు ద్రౌపదిని ఐదుగురు భార్యగా భావించాలని ఆదేశమిచ్చింది. కుంతి, కృష్ణుడు హస్తి నకు రాయబారిగా వచ్చినప్పుడు ధర్మజుని ‘ఐదూళ్లు చాలన్న’ మాట విని కోపించింది. యుద్ధం చేయమని ధర్మజునికి హితవు చెప్పమని కృష్ణునితో అంటుంది. ఇక్కడ కుంతి వీరమాతగానే కాక నిజమైన రాజమాతగా కూడా కనిపిస్తుంది.
వ్యాసుడు, విదురుడు, భీష్ముడు, మేనల్లుడైన కృష్ణుడి అండదండ లతో, సహాయ సహకారాలతో పాండవులని పెంచి పెద్ద చేసి, వారిని అసహాయ శూరులను చేసింది. వారి శక్తి సామర్థ్యాలను జగద్విదితం చేసింది. ఓ ఉదాత్తమైన మాతృమూర్తిగా నిలిచింది. యుద్ధానంతరం, తన శేష జీవితాన్ని అడవులలో ఆశ్రమాలలో గడపటానికి వెళుతున్న కుంతిని భీముడు ఇందుకోసమా మమ్మల్ని యుద్ధం చేయమని ప్రేరే పించింది అని ఆక్రోశంతో ప్రశ్నిస్తాడు. కుంతి ఇదంతా వారి సుఖం కోసమని, హక్కుగా రావలసిన రాజ్యాధికారం కోసమని, గౌరవ జీవితం కోసమని చెబుతుంది. ఒక మాతృమూర్తిగా తన పిల్లల నుండి గౌరవ మర్యాదలను విరివిగా పొందిన ధీర వనిత కుంతి. వ్యాస భగ వానుని అద్భుత సృష్టి.
– డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment