Jyothirmayi
-
బెయిల్ కోసం బాబు అడ్డదారులు.. ‘నెవర్ బిఫోర్’
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేసి జైలుపాలైన చంద్రబాబు ఇప్పుడు దాని నుంచి ఎలాగైనా బయటపడాలని బెయిల్ కోసం అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందుకోసం గతం నుంచి తాను అనుసరిస్తున్న తన ట్రేడ్‌మార్క్ అస్త్రం ‘నాట్ బిఫోర్’ ను ఆయన మరోసారి బయటకు తీశారు. తమ పార్టీకి, తమ లీగల్ సెల్‌కు ఏ సంబంధం లేని జీవీఎల్ మూర్తి అనే న్యాయవాదిని తెరపైకి తెచ్చారు. ఆయనతో తన తరఫున చంద్రబాబు కన్సెంట్ వకాలత్ (అప్పటికే దాఖలు చేసిన కేసులో వకాలత్ వేసిన న్యాయవాది అనుమతితో మరో న్యాయవాది కూడా వకాలత్ దాఖలు చేయడం) దాఖలు చేయించారు. చంద్రబాబు తరఫు న్యాయవాది జి.బసవేశ్వరరావు వకాలత్ వేసి ఉండగానే.. మూర్తితో వకాలత్ దాఖలు చేయించడం గమనార్హం. సాధారణంగా ఇలా వకాలత్ దాఖలు చేసిన కేసులో ఏ మాత్రం సంబంధం లేని మరో న్యాయవాది వకాలత్ దాఖలు చేసేందుకు ఏ న్యాయవాది ఒప్పుకోడు. కాగా చంద్రబాబు తరఫున వకాలత్‌లు దాఖలు చేసిన బసవేశ్వరరావు గానీ, మూర్తి గానీ వాదనలు వినిపించకపోవడం ఇందులో అసలు ట్విస్టు. శుక్రవారం జరిగిన విచారణకు మూర్తి రాలేదు కూడా. దీన్ని బట్టి చంద్రబాబు ఇక్కడ మూర్తిని ఓ నిర్దిష్ట ప్రయోజనం నిమిత్తం వాడుకోవాలని నిర్ణయించి, ఆయనతో వకాలత్ దాఖలు చేయించారని ఇట్టే అర్థమైపోతోంది. మూర్తి వెనుక ఉంది వారే.. జీవీఎల్ మూర్తితో వకాలత్ దాఖలు చేయించడం ద్వారా నిబంధనలకు అనుగుణంగా, ముక్కుసూటిగా నడుచుకుంటారనే పేరున్న న్యాయమూర్తి జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి ముందు తన బెయిల్ పిటిషన్‌ను రాకుండా చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారు. జస్టిస్ జ్యోతిర్మయి ముందు ఎవరు ‘నాట్ బిఫోర్’ న్యాయవాదులు ఉన్నారో ముందుగానే తెలుసుకుని, అందుకనుగుణంగా మూర్తితో వకాలత్ దాఖలు చేయించారు. వాస్తవానికి ఈ మూర్తిది కూడా చంద్రబాబు సామాజికవర్గమే. పెద్దగా ప్రాక్టీస్ ఉన్న న్యాయవాది కాదు. చిన్న చిన్న కేసులు, ఉద్యోగ వివాదాలకు సంబంధించిన కేసులను వాదిస్తుంటారు. ఎప్పుడూ టీడీపీ కేసులను కూడా వాదించింది లేదు. కాగా ఎల్లో మీడియాకు చెందిన ఓ న్యూస్ చానెల్ యజమానికి మూర్తి అత్యంత సన్నిహితుడు. జస్టిస్ జ్యోతిర్మయి ముందు మొత్తం నలుగురు న్యాయవాదులు ‘నాట్ బిఫోర్’గా ఉన్నారు. ఈ నలుగురిలో ముగ్గురు న్యాయవాదులు తమ ఉచ్చులోకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో తమవాడే అయిన మూర్తిని చంద్రబాబు అండ్ కో విజయవంతంగా తమవైపు తిప్పుకుంది. ఎల్లో మీడియా న్యూస్ చానెల్ యజమాని, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి.. ఈ విషయంలో మూర్తిని ఒప్పించారు. అంతేకాకుండా చంద్రబాబు అండ్ కో ఆయనకు భారీ మొత్తంలో ఫీజును ఆశగా చూపింది. జస్టిస్ నిమ్మగడ్డ లేదా జస్టిస్ అడుసుమిల్లి.. ప్రస్తుతం హైకోర్టుకు దసరా సెలవులు. ఈ నేపథ్యంలో అత్యవసర కేసులను విచారించేందుకు న్యాయమూర్తులు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, జస్టిస్ అడుసుమిల్లి వెంకట రవీంద్రబాబు, జస్టిస్ జ్యోతిర్మయిలు వెకేషన్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. జస్టిస్ జ్యోతిర్మయి విచారణ నుంచి తప్పుకుంటే చంద్రబాబు బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ పిటిషన్లు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు లేదా జస్టిస్ అడుసుమిల్లి రవీంద్ర బాబు ముందుకు వస్తాయి. చంద్రబాబు అండ్ కో కూడా ఇదే ఉద్దేశంతో మూర్తితో వకాలత్ దాఖలు చేయించి తమ ప్లాన్‌ను పక్కాగా అమలు చేసింది. అయితే జస్టిస్ నిమ్మగడ్డ లేదా జస్టిస్ అడుసుమిల్లిల్లో ఎవరికి చంద్రబాబు కేసును అప్పగించాలన్నది పూర్తిగా ప్రధాన న్యాయమూర్తి విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం సెలవులు కావడంతో సీజే అందుబాటులో లేరు. సోమవారం నుంచే హైకోర్టు తిరిగి తన కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఎప్పుడైతే జస్టిస్ జ్యోతిర్మయి ఈ వ్యాజ్యాలను సోమవారం నాడు విచారణకు వచ్చేందుకు వీలుగా ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారో అప్పుడే చంద్రబాబు అండ్ కో గతుక్కుమంది. అప్పటికే ఆన్లైన్లో ఉన్న చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, కోర్టు హాలులో ఉన్న మరో సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌లు వెంటనే జోక్యం చేసుకున్నారు. సోమవారం అనే పదాన్ని ఉత్తర్వుల నుంచి తొలగించాలని జస్టిస్ జ్యోతిర్మయిని కోరారు. కేసును తగిన బెంచ్ ముందు ఉంచేందుకు వీలుగా ఫైల్‌ను సీజే ముందు ఉంచాలని మాత్రమే ఉత్తర్వుల్లో పేర్కొనాలన్నారు. లేకపోతే రిజిస్ట్రీ ముందు తాము సీజే అనుమతి కోసం అభ్యర్థించలేమన్నారు. అయితే వారి అభ్యర్థన పట్ల న్యాయమూర్తి జోతిర్మయి సుముఖత వ్యక్తం చేయలేదు. రిజిస్ట్రీ ముందు అత్యవసర విచారణ నిమిత్తం అభ్యర్థించేందుకు ‘సోమవారానికి విచారణ వాయిదా’ అనేది ఎంత మాత్రం అడ్డంకి కాదని తేల్చిచెప్పారు. చట్ట ప్రకారం ఉన్న ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవచ్చునని తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో చేసేదేమీ లేక చంద్రబాబు న్యాయవాదులు ఉసూరుమంటూ కోర్టు బయటకు వచ్చారు. ఆ వెంటనే రిజిస్ట్రార్ వద్దకు వచ్చారు. చంద్రబాబు బెయిల్‌ను మరో న్యాయమూర్తికి నివేదించేందుకు వీలుగా సీజే అనుమతి తీసుకోవాలని రిజిస్ట్రార్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చినా వారి పప్పులు ఉడకలేదు. 19 నుంచే వ్యూహానికి పదును.. కాగా వాస్తవానికి చంద్రబాబు అండ్ కో ‘నాట్ బిఫోర్’ అస్త్రాన్ని తన బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా ప్రయోగించాలని గతంలోనే నిర్ణయించింది. అయితే దానిని ఈ నెల 19న నుంచే అమలు చేయడం ప్రారంభించింది. 19న చంద్రబాబు బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ కోసం వేసిన అనుబంధ పిటిషన్ జస్టిస్ సురేష్‌రెడ్డి ముందుకు వచ్చాయి. చంద్రబాబు అనారోగ్య కారణాలను సాకుగా చూపుతూ ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరఫు సీనియర్ న్యాయవాదులు లూథ్రా, దమ్మాలపాటి గట్టిగా వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుని, సుప్రీంకోర్టు చంద్రబాబు చేసిన మధ్యంతర బెయిల్ అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించలేదని జస్టిస్ సురేష్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ పట్ల సానుకూలంగా స్పందించని నేపథ్యంలో తాను కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వలేనని జస్టిస్ సురేష్‌రెడ్డి స్పష్టంగా చెప్పేశారు. దీంతో భోజన విరామం తర్వాత వ్యూహాన్ని మార్చేసిన చంద్రబాబు న్యాయవాదులు బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను వెకేషన్ కోర్టు ముందు పోస్ట్ చేయాలని న్యాయమూర్తిని కోరారు. ఇందుకు జస్టిస్ సురేష్‌రెడ్డి అంగీకరించి ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. పలుకుబడితో ముందే తెలుసుకుని.. కాగా చంద్రబాబు న్యాయవాదులు తమ వ్యూహం ఎందుకు మార్చుకున్నారంటే వెకేషన్ కోర్టుల్లో ఎవరెవరు జడ్జీలు ఉండబోతున్నారో తమ పలుకుబడిని ఉపయోగించి ముందుగానే తెలుసుకోగలిగారు. ఆ వెకేషన్ కోర్టులో జస్టిస్ జ్యోతిర్మయి కూడా ఉన్నారని నిర్ధారించుకున్నారు. వాస్తవానికి వెకేషన్ కోర్టులో ఏ న్యాయమూర్తులు ఉండబోతున్నారనది చివరి నిమిషం వరకు బయటకు వచ్చే అవకాశం ఉండదు. అయితే వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన చంద్రబాబు అండ్ కో వెకేషన్ కోర్టులో ఎవరెవరు ఉండబోతున్నారో ముందుగానే తెలుసుకుంది. దానికి అనుగుణంగానే తమ వ్యూహాలకు పదును పెట్టింది. జస్టిస్ జ్యోతిర్మయి ముందు ఎవరెవరు నాట్ బిఫోర్‌గా ఉన్నారో తెలుసుకోగలిగింది. నలుగురు న్యాయవాదులు ఉన్నట్లు తెలుసుకుని, అందులో తమ సామాజిక వర్గానికే చెందిన జీఎల్ఎన్ మూర్తితో ఆట మొదలుపెట్టింది. అయితే ఆటలో చివరకు ఓటమే ఎదురైంది. నైతిక విలువలకు కట్టుబడ్డ జస్టిస్ జ్యోతిర్మయి కాగా మూర్తి సతీమణి ఇందిరా ప్రియదర్శిని కింది కోర్టులో జడ్జిగా పనిచేస్తున్నారు. న్యాయాధికారి కావడంతో ఎంతో కాలంగా ఆమె జస్టిస్ జ్యోతిర్మయికి తెలుసు. తనకు మూర్తి సతీమణితో పరిచయం ఉన్న నేపథ్యంలో హైకోర్టులో మూర్తి తన ముందు దాఖలు చేసే కేసులను విచారించకూడదని నైతిక విలువలకు కట్టుబడి జస్టిస్ జ్యోతిర్మయి నిర్ణయం తీసుకున్నారు. అందుకనుగుణంగా మూర్తిని తన నాట్ బిఫోర్ జాబితాలో చేర్చారు. అయితే ఆమె నైతిక విలువలనే చంద్రబాబు ఓ అవకాశంగా మలుచుకున్నారు. ఆమె ముందు తన బెయిల్ పిటిషన్ రాకుండా చేసేందుకు మూర్తితో చంద్రబాబు విజయవంతంగా వకాలత్ దాఖలు చేయించారు. మూర్తి వకాలత్ వేస్తే ఆ పిటిషన్‌ను విచారించేందుకు జస్టిస్ జ్యోతిర్మయి నిరాకరిస్తారని తెలిసే ఆ పని చేశారు. నిబంధనల ప్రకారం వెళితే చంద్రబాబుకు బెయిల్ దొరకడం కష్టమని ఆయన తరఫు న్యాయవాదులకు బాగా తెలుసు. అందుకే తమకే సొంతమైన ‘నాట్ బిఫోర్’ అస్త్రాన్ని బయటకు తీశారు. మూర్తి దాఖలు చేసిన కేసును విచారించనని జస్టిస్ జ్యోతిర్మయి ఓపెన్ కోర్టులో చెప్పడంతో చంద్రబాబు అండ్ కో తమ పాచిక పారిందని సంతోషించారు. అయితే ఇంతలోనే సీజే అనుమతి తీసుకుని చంద్రబాబు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లలో విచారణను సోమవారానికి వాయిదా వేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ జస్టిస్ జ్యోతిర్మయి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో చంద్రబాబు అండ్ కో బిత్తరపోయింది. -
హైకోర్టు జడ్జిలుగా మరో ఇద్దరు
సాక్షి, అమరావతి : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల పోస్టులకు న్యాయాధికారుల కోటా నుంచి పి. వెంకట జ్యోతిర్మయి, వి. గోపాలకృష్ణారావుల పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర హైకోర్టు కొలీజియం చేసిన సిఫారసుకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన కొలీజియం మంగళవారం సమావేశమై ఈ మేరకు తీర్మానం చేసింది. ఈ ఇద్దరి పేర్లను కేంద్రానికి పంపింది. వీరికి కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత ఆ ఫైలు రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి నియామక ఉత్తర్వులు తరువాత వారి నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీచేస్తుంది. ఆ తరువాత వారి ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇక ఈ ఇద్దరు న్యాయాధికారుల్లో వెంకట జ్యోతిర్మయి ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జి (పీడీజే)గా వ్యవహరిస్తున్నారు. గోపాలకృష్ణ గుంటూరు మొదటి అదనపు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి పేర్లను హైకోర్టు కొలీజియం నాలుగు నెలల క్రితమే సుప్రీంకోర్టుకు పంపింది. వీరిద్దరి నియామకంతో ప్రస్తుతానికి న్యాయాధికారుల కోటా పూర్తవుతుంది. ఇదే సమయంలో వీరి నియామకంతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరుకుంది. అలాగే, హైకోర్టు మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 37 కాగా.. మరో ఐదు ఖాళీలుంటాయి. ఇవి న్యాయవాదుల కోటాకు సంబంధించినది. వీటిని సైతం భర్తీచేసేందుకు హైకోర్టు కొలీజియం త్వరలో న్యాయవాదుల పేర్లను సుప్రీంకోర్టుకు ప్రతిపాదించనుంది. మరోవైపు.. ఈ ఏడాది ముగ్గురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారు. పి. వెంకట జ్యోతిర్మయి గుంటూరు జిల్లా, తెనాలిలో బాలాత్రిపుర సుందరి, పీవీకే శాస్త్రి దంపతులకు జన్మించారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు తెనాలిలోనే విద్యాభ్యాసం పూర్తిచేశారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. చదువులో టాపర్. మూడు బంగారు పతకాలు సాధించారు. 2008లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. వివిధ హోదాల్లో రాష్ట్రంలో పలుచోట్ల పనిచేశారు. 2022 ఏప్రిల్ 18 నుంచి ఇప్పటివరకు తూర్పు గోదావరి జిల్లా ప్రిన్సిపల్ జిల్లా జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు కృష్ణాజిల్లా చల్లపల్లి గ్రామంలో కోటేశ్వరమ్మ, సోమయ్య దంపతులకు జన్మించారు. తండ్రి సబ్‌రిజిస్ట్రార్‌గా పనిచేశారు. పదవ తరగతి మచిలీపట్నం జైహింద్ పాఠశాలలో చదివారు. ఇంటర్ ఎస్ఆర్ వైఎస్పీ జూనియర్ కాలేజీలో పూర్తిచేశారు. డిగ్రీ, పీజీ మచిలీపట్నంలో చదివారు. 1994లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. 2007లో సీనియర్ సివిల్ జడ్జిగా పదోన్నతి పొందారు. 2016లో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు. గుంటూరు మొదటి అదనపు జిల్లా జడ్జిగా వ్యవహరిస్తున్నారు. వీరి కుటుంబంలో న్యాయాధికారి అయిన మొదటి వ్యక్తి ఈయనే. కుమారుడు వి.రఘునాథ్ ఇటీవల జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికై ప్రస్తుతం కర్నూలు జిల్లా, ఆత్మకూరు కోర్టులో పనిచేస్తున్నారు. -
ఫాదర్స్ డే స్పెషల్: సాయికుమార్ ఫ్యామిలీ వాయిస్!
‘‘కనిపించే మూడు సింహాలు నీతికీ న్యాయానికీ ధర్మానికీ ప్రతిరూపాలైతే... కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’’... సాయికుమార్ కెరీర్‌కి తొలి బ్రేక్ అయిన ‘పోలీస్ స్టోరీ’ చిత్రంలోని డైలాగ్ ఇది. సాయికుమార్ ఇంటి నాలుగు స్తంభాల్లో ముగ్గురు మన కళ్ల ముందు ఉన్నారు. కనిపించని నాలుగో స్తంభం పీజే శర్మ. ఈ మూడు స్తంభాల బలం ఆ నాలుగో స్తంభం. ఆ బలంతో సాయికుమార్ కుటుంబ వారసత్వం కొనసాగుతోంది. నేడు ‘ఫాదర్స్ డే’ సందర్భంగా సాయికుమార్ తన కుమారుడు ఆది, కుమార్తె జ్యోతిర్మయితో కలిసి ‘సాక్షి’తో చెప్పిన విశేషాల్లో కొన్ని... స్వరం నాన్నది.. సంస్కారం అమ్మది – సాయికుమార్ ► నా స్వరం నాన్న (ప్రముఖ నటుడు పీజే శర్మ) గారిది. సంస్కారం అమ్మ (కృష్ణజ్యోతి) ఇచ్చింది. ఆశీర్వాదం ఆ భగవంతుడిది. అభిమానం ప్రేక్షకులందరిదీ. మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్. ఈ విషయంలో ఆది, జ్యోతిర్మయి చాలా లక్కీ (నవ్వుతూ). నాన్నగారి నుంచి నాకు, నా నుంచి నా పిల్లలు ఆది, జ్యోతిర్మయికి క్రమశిక్షణ అలవడింది. ► మా నాన్నగారు హీరో అవ్వాలనుకున్నారు. అమ్మకి హీరోయిన్ అవ్వాలని ఉండేది. కానీ అప్పట్లో ఉన్న పోటీ, వారి వ్యక్తిగత పరిస్థితుల వల్ల వారు ఊహించిన స్థాయిలో కుదర్లేదు. కుటుంబం కోసం అమ్మ త్యాగం చేయాల్సి వచ్చింది. పీజే శర్మ ఎంత కాలం ఇండస్ట్రీలో ఉంటారు.. మళ్లీ తిరిగి అగ్రహారం వచ్చి పౌరోహిత్యం చేయరా? అనుకున్నవాళ్లూ ఉన్నారు. అమ్మ మాకు ఒక స్ఫూర్తిగా, నాన్న ఓ శక్తిగా నిలబడ్డారు. అమ్మ ప్రోద్బలంతో, నాన్న ప్రోత్సాహంతో కెరీర్లో ముందుకు వెళ్లాను. నాన్న ఏది సాధించాలనుకున్నారో అన్నీ కలగలిపిన హీరోగా ఆది తయారయ్యాడు. నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను.. ‘నేను అవుతాను’ అంటూ మా అమ్మాయి అయింది. ► ‘పోలీస్‌స్టోరీ’ సినిమా మంచి విజయం సాధించినందుకు నాన్నగారు చాలా హ్యాపీ ఫీలయ్యారు. తాను సాధించలేకపోయింది నేను సాధించానని సంతోషపడ్డారు. ఆ సినిమా 100డేస్ ఫంక్షన్లో వేదికపై చాలా మంది పెద్దలు ఉన్నా నేను అమ్మ, నాన్న చేతుల మీదుగా షీల్డ్ తీసుకున్నాను. మేం చెన్నైలో ఉన్నప్పుడు ప్రివ్యూస్ చూడటానికి వెళ్లినప్పుడు ఎవరైనా పెద్దవారు వస్తే మమ్మల్ని మేం కూర్చున్న సీట్ల నుంచి లేపి వేరే చోట కూర్చోమనేవారు. కానీ నాన్నగారు రిక్వెస్ట్ చేసి నన్ను, తమ్ముళ్లను అక్కడే కూర్చొనేలా చేసి తాను మరోచోట సినిమా చూసేవారు. ► సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులకు, హీరోలకు అర్థం చేసుకునే భార్య దొరకాలి. నా అదృష్టం సురేఖ దొరికింది. అలాగే ఆదికి అరుణ. జ్యోతికి కృష్ణ ఫల్గుణ మంచి సపోర్టివ్. ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడితో నేను ఫుల్ హ్యాపీగా ఉన్నాను. అలాగే ఈ ఏడాది నా 60వ పుట్టినరోజు రానుంది. నా మనవరాలు ఆద్యశ్రీకి యాక్టింగ్ అంటే ఆసక్తి. మనవడు ఇవాన్‌కు కార్ రేసింగ్ అంటే ఇష్టం. అలాగే ఆది కూతురు అయానా కూడా ఇంటెలిజెంట్ అమ్మాయి. యాక్ట్రస్ అవుతుందేమో చూడాలి. కానీ అయానాకు స్పోర్ట్స్‌లో ఇంట్రెస్ట్ అని ఆది చెబుతుంటాడు. ► నాన్నగారికి ఉన్న చిన్న చిన్న కోరికల్లో కొన్నింటిని తీర్చగలిగాం. మరికొన్నింటిని తీర్చలేకపోయాం. అప్పట్లో స్థోమత లేదు. ఇప్పుడు ఉన్నా ఆయన మాకు దూరమైపోయారు. ఇక అమ్మ పాస్‌పోర్ట్ చూసి ఇప్పటికీ బాధపడుతుంటాను. ఆమెను ఎక్కడికీ తీసుకుని వెళ్లలేకపోయాను. 1993లో నేను అమెరికా వెళ్లాను. తనే అమెరికా వెళ్లినంత హ్యాపీ ఫీలయ్యారు నాన్నగారు. అప్పుడు నేను సురేఖకు రాసిన ఉత్తరం ఇంకా ఉంది. ‘‘నాతో పాటు అమ్మ, నాన్న, మన పిల్లలు, నువ్వు కూడా వస్తే బాగుండేది. భవిష్యత్తులో అందరం వద్దాం. ఎంజాయ్ చేద్దాం’’ అని ఉంది ఆ ఉత్తరంలో. ఆ తర్వాత అమ్మగారు చనిపోయారు. నాన్నగారు అప్పట్లో వచ్చే స్థితిలో లేరు. కానీ ‘శంకర్‌దాదా’ చిత్రం కోసం ఆయన ఆస్ట్రేలియా వెళ్లినప్పుడు చాలా హ్యాపీ ఫీలయ్యారు. ఇకపై ఆది, జ్యోతిర్మయి నేను చూడని ప్లేసెస్‌ను చూపించాలి మరి (నవ్వుతూ). నాన్నకి వందకి వంద – ఆది సాయికుమార్ ► తాతగారిలా నాన్నగారు కూడా స్ట్రిక్టే. కానీ మరీ అంత స్ట్రిక్ట్ కాదు. ఫ్రెండ్లీగా ఉంటారు. నాకు క్రికెట్ అంటే ఇష్టం. నాన్నగారు బాగా ప్రోత్సహించారు... స్వేచ్ఛనిచ్చారు. నాన్నగారు ఫ్రెండ్లీగా ఉన్నా క్రికెట్, టెన్నిస్ టీమ్‌ల గురించి మాత్రం పోట్లాడుకుంటుంటాం (నవ్వుతూ). క్రికెట్‌ను చాలా మిస్ అవుతున్నాను. 2009లో వదిలేశాను.. ఆ తర్వాత సినిమాలవైపు వచ్చాను. కరోనా ఫస్ట్ వేవ్ లాక్డౌన్లో మళ్లీ స్టార్ట్ చేశాను. నేను, ప్రజ్ఞా ఓఝా, అంబటి రాయుడు అండర్ 19 ఆడాం. క్రికెట్లో నేను ఆల్‌రౌండర్. క్రికెట్లో అప్పుడైతే ఇండియాకి ఆడాలి.. లేదంటే రంజీ, రైల్వేస్. ఇప్పుడు ఐపీఎల్ లాంటివి చాలా ప్లాట్‌ఫామ్స్ వచ్చాయి.. ఇప్పుడు అనిపిస్తుంటుంది.. అయ్యో అనవసరంగా వదిలేశానే అని. ► నా తొలి చిత్రం ‘ప్రేమకావాలి’ వంద రోజుల ఫంక్షన్లో నాన్న పక్కన నేనుంటాను.. తాతగారు నాకు ముద్దు పెడుతుంటారు. ఆ ఫొటో చూసినప్పుడల్లా హ్యాపీగా ఉంటుంది. నేను నటన, డ్యాన్స్‌లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో నాన్నగారు ఫుల్ బిజీగా ఉండేవారు. ఆ సమయంలో నాకు, తాతగారికి మధ్య మంచి ర్యాపో ఉండేది. నాన్నకి నేను వందకి వంద మార్కులు వేస్తాను. మా నాన్న నుంచి నేను కుటుంబాన్ని ప్రేమించడం నేర్చుకున్నాను. నా పిల్లలకి నేర్పాలి. నా కూతురికి నాన్నగారి పోలికలు వచ్చాయేమో. అందరూ కావాలనుకుంటుంది. ఎక్కువమంది ఉంటే సంతోషపడుతుంది. నాన్నకి వందకి నూటపది – డాక్టర జ్యోతిర్మయి ► నేను డాక్టర్ అవ్వాలనే టాపిక్ ఇంట్లో నడుస్తుండేది. కానీ అసలు విషయం ఏంటంటే.. మా పెద్దవాళ్లు ఆశించడానికన్నా ముందే నేను డాక్టర్ (జ్యోతిర్మయి పీడియాట్రీషియన్)ని కావాలనుకున్నాను. నిజానికి చిన్నప్పుడు నేను ఐదారేళ్లు సినిమాలకు డబ్బింగ్ చెప్పాను. ‘బొంబాయి’ సినిమాలో ఇద్దరు పిల్లలు ఉంటారు. వాళ్లకి డబ్బింగ్ చెప్పడానికి ఆడిషన్‌కి వెళ్లాను. అందులోని ‘కాఫీ కావాలా, టీ కావాలా? అని అమ్మ అడగమంది’ అనే డైలాగు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా చెప్పలేదు. దీంతో ఎంపిక కాలేదు. మా బాబాయ్ ‘ఈశ్వర్’ సినిమాని ‘ఆయుధ’ పేరుతో తెలుగులో డబ్బింగ్ చేశాం. ఆ సినిమాలో నటించాల్సి ఉంది. అయితే ఎత్తు ఎక్కువ అని తీసుకోలేదు. పాప పాత్రకు తెలుగు డబ్బింగ్ చెప్పాను. నా తొలి సినిమా అదే. ఆ సినిమాకి రూ.5000 పారితోషికం ఇచ్చారు. అంత చిన్న వయస్సులో అంత పెద్దగా సంపాదించానని చాలా కాలం చెప్పుకున్నాను. ► నాన్నగారు నాకంటే మా ఆయనతో ఎక్కువ క్లోజ్‌గా ఉంటారు. మామ, అల్లుడిలా కాకుండా ఇద్దరూ మంచి స్నేహితుల్లా ఉంటారు. ఇక క్రికెట్ అంటే చాలు.. మా నాన్న సపోర్ట్ చేసిన టీమ్‌కి వ్యతిరేకంగా ఆది సపోర్ట్ చేస్తాడు. మా బాబాయిలు కూడా! వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ అప్పుడు ఇంట్లో ఎన్ని సామాన్లు పగిలిపోతాయో చెప్పలేం. నాన్నకి క్రికెట్ అంటే ఎంత ఇష్టం అంటే.. కృష్ణ ఫల్గుణతో నా పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడే క్రికెట్ మ్యాచ్ చూశారు. అంత ఇష్టం నాన్నకి! నాన్నకి నేను వందకి 110 మార్కులు వేస్తాను. మా నాన్నగారి నుంచి పాజిటివిటీ నేర్చుకున్నాను. నా పిల్లలకీ నేర్పించాలనుకుంటున్నాను. సాయికుమార్ తల్లితండ్రులు పీజే శర్మ, కృష్ణజ్యోతి ఆది, అరుణ, సురేఖ, సాయికుమార్, జ్యోతిర్మయి, కృష్ణ ఫల్గుణ -
వీరమాత
మహా భారతంలో కుంతి పాత్ర ఎంతో వైవిధ్యమైనది. విలక్షణ మైనది. భర్త పాండురాజు మరణించిన నాటి నుండి తన పిల్లలని, మాద్రి పిల్లలని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, వారికి విద్యాబుద్ధులు నేర్పించి, గొప్ప వీరులుగా తీర్చిదిద్దింది. ఏక చక్రపురంలో ప్రజలు బకా సురుని బారినపడి ప్రాణాలు కోల్పోతున్నప్పుడు భీముణ్ణి వానికి ఆహా రంగా పంపుతుంది. ఆమె అలా పంపటంలో ఆంతర్యాన్ని ప్రశ్నించిన ధర్మజునికి ఇచ్చిన సమాధానం ఆమె విజ్ఞతను, ఆశ్రయమిచ్చిన యజ మాని పట్ల చూపవలసిన కృతజ్ఞతను, మాద్రి పిల్లలలో ఒకరిని కాక తన పిల్లలలో ఒకర్ని పంపడంలో గల నిస్వార్థ చింతనను, ధర్మసూక్ష్మతా శక్తిని విశ దపరుస్తాయి. తన బిడ్డల బలాన్ని, బలగాన్ని పెంచేటందుకు హిడిం బను కోడలిగా స్వీకరించింది. కురు, పాండవుల మధ్య పోరు తప్పదని ఊహిం చిన ప్రజ్ఞాశాలి ఈమె. పాండవుల మధ్య ఐక్యత సాధించేటందుకు ద్రౌపదిని ఐదుగురు భార్యగా భావించాలని ఆదేశమిచ్చింది. కుంతి, కృష్ణుడు హస్తి నకు రాయబారిగా వచ్చినప్పుడు ధర్మజుని ‘ఐదూళ్లు చాలన్న’ మాట విని కోపించింది. యుద్ధం చేయమని ధర్మజునికి హితవు చెప్పమని కృష్ణునితో అంటుంది. ఇక్కడ కుంతి వీరమాతగానే కాక నిజమైన రాజమాతగా కూడా కనిపిస్తుంది. వ్యాసుడు, విదురుడు, భీష్ముడు, మేనల్లుడైన కృష్ణుడి అండదండ లతో, సహాయ సహకారాలతో పాండవులని పెంచి పెద్ద చేసి, వారిని అసహాయ శూరులను చేసింది. వారి శక్తి సామర్థ్యాలను జగద్విదితం చేసింది. ఓ ఉదాత్తమైన మాతృమూర్తిగా నిలిచింది. యుద్ధానంతరం, తన శేష జీవితాన్ని అడవులలో ఆశ్రమాలలో గడపటానికి వెళుతున్న కుంతిని భీముడు ఇందుకోసమా మమ్మల్ని యుద్ధం చేయమని ప్రేరే పించింది అని ఆక్రోశంతో ప్రశ్నిస్తాడు. కుంతి ఇదంతా వారి సుఖం కోసమని, హక్కుగా రావలసిన రాజ్యాధికారం కోసమని, గౌరవ జీవితం కోసమని చెబుతుంది. ఒక మాతృమూర్తిగా తన పిల్లల నుండి గౌరవ మర్యాదలను విరివిగా పొందిన ధీర వనిత కుంతి. వ్యాస భగ వానుని అద్భుత సృష్టి. – డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి -
గుండుతో నటి.. ఇప్పుడెందుకు ఇలా!
లాక్‌డౌన్‌తో ప్రస్తుతం ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. కరోనా ఇచ్చిన సెలవులను కుటుంబంతో కలిసి గడుపుతూ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక ఎల్లప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే సినీ సెలబ్రిటీలు లాక్‌డౌన్‌ను ఎలా ఆస్వాదిస్తున్నారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వంట చేస్తూ.. ఇంటిని శుభ్రపరుస్తూ.. చాలెంజ్‌ల మీద చాలెంజ్‌లు విసురుతూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో మలయాళ దర్శకుడు అమల్ నీరద్ షేర్ చేసిన ఓ ఫొటో నెటిజన్లను కన్ఫ్యూజ్ చేస్తోంది. (అందుకే నీకు ఈ గిఫ్ట్ ఇస్తున్నా: నటుడు) తన భార్య, నటి జ్యోతిర్మయి గుండుతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన అమల్.. చీకటి నుంచి వెలుగులోకి నడిపించు అనే అర్థం వచ్చేలా.. సంస్కృత శ్లోక పంక్తి.. ‘‘తమసోమా జ్యోతిర్గమయ’’అనే క్యాప్షన్ జతచేశాడు. ఈ క్రమంలో కొంత మంది నెటిజన్లు జ్యోతిర్మయి న్యూలుక్లో ఎంతో అందంగా ఉన్నారని కామెంట్ చేయగా.. అభిమానులు మాత్రం ఇప్పుడు గుండు చేయించుకోవాల్సిన అవసరం ఏమిటని ఆరా తీస్తున్నారు. ఇక జ్యోతిర్మయి ఫొటోపై సెలబ్రిటీలు కూడా స్పందించారు. నజ్రియా నంజీమ్, రీమా కలింగల్ థమ్సన్ గుర్తుతో మేకోవర్ బాగుందంటూ కితాబిచ్చారు. కాగా తమిళ, మలయాళ సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన జ్యోతిర్మయి తొలుత నిశాంత్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకున్నారు. ఆయన నుంచి విడాకులు తీసుకున్న తర్వాత 2015లో డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ అమల్ నీరద్ను వివాహమాడారు. ('ప్రభాస్‌ను నేను పెళ్లి చేసుకోవడం లేదు') View this post on Instagram Tamasoma Jyothirgamaya 😊 . #Jyothirmayee A post shared by Amal Neerad (@amalneerad_official) on Apr 22, 2020 at 2:18am PDT -
జే డే హత్య కేసులో చోటా రాజన్‌కు జీవిత ఖైదు
-
చోటా రాజన్‌కు జీవిత ఖైదు
సాక్షి, ముంబై: జర్నలిస్ట్ జ్యోతిర్మయి డే (జే డే) హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ సహా మొత్తం 9 మంది దోషులకు ముంబైలోని ఓ ప్రత్యేక కోర్టు బుధవారం జీవిత ఖైదు విధించింది. 2011 నాటి ఈ కేసులో దోషులందరూ ఒక్కొక్కరు రూ.26 లక్షల జరిమానా చెల్లించాలని మోకా (మహారాష్ట్ర వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం–ఎంసీవోసీఏ) కోర్టు ఆదేశించింది. జే డేను హత్య చేసేలా చోటారాజన్‌ను మాజీ జర్నలిస్టు జిగ్నా వోరా ప్రేరేపించారనీ, అలాగే ఈ హత్యకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పాల్సన్ జోసెఫ్ నిర్వహించారంటూ నమోదైన అభియోగాలను న్యాయమూర్తి సమీర్ అడ్కర్ కొట్టివేస్తూ వారిరువురినీ నిర్దోషులుగా విడుదల చేశారు. 2015లో చోటా రాజన్ ఇండోనేసియాలోని బాలి విమానాశ్రయంలో అరెస్టయ్యి, భారత్‌కు వచ్చాక అతను దోషిగా తేలిన ప్రధాన కేసు ఇదే. బుధవారం తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కేసు విచారణను చోటా రాజన్ వీక్షించాడు. అసలు కేసేంటి? జే డే (చనిపోయినప్పటికి ఆయన వయసు 56 ఏళ్లు) ముంబైలో మిడ్ డే అనే పత్రికకు సీనియర్ ఎడిటర్‌గా పనిచేసేవారు. గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్ ఆరోగ్యం దెబ్బతిందనీ, మాఫియాలో అతని బలం తగ్గిందంటూ వార్తలు రాయడంతో జే డేపై చోటా రాజన్ కోపం పెంచుకుని హత్య చేయించాడు. 2011 జూన్ 11న జే డే తన ఇంటికి వెళ్తుండగా ముంబైలోని పొవాయ్ ప్రాంతానికి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆయనపై కాల్పులు జరపడంతో జే డే మరణించారు. ఈ కేసుకు సంబంధించి అదే ఏడాది జూన్ 27న ఏడుగురిని, ఆ తర్వాత మరో ముగ్గురిని క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేసి మోకా కింద అభియోగాలు మోపారు. 2016 జనవరిలో ఈ కేసు సీబీఐకి చేరింది. -
అస్త్రాలూ– శస్త్రాలూ
అస్త్రాలూ– శస్త్రాలూ అగ్ని–5 క్షిపణి ప్రయోగం మరొకసారి విజయవం తమయింది. ఈ క్షిపణిని ప్రయోగిస్తే ఇది ఐదువేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని తాకి దాడి చేయగలదట. మానవ జాతి, అస్త్ర శస్త్రాల నిర్మా ణంలో కూడా సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి అనూహ్యమైన ప్రగతిని సాధిస్తున్నది. మూడో ప్రపంచ యుద్ధం రాలేదు కానీ వస్తే మానవాళిని సర్వనాశనం చేసేందుకు సరిపడే అణ్వాయుధ శక్తి ఈ రోజు ప్రపంచ దేశాలకు ఉంది. ఈ మారణాస్త్రాలు యావత్తు మానవాళిని చావుదెబ్బ తీసి మానవ నాగరికతను సర్వ నాశనం చేయగలవు. మరో ప్రపంచ యుద్ధం రాకుండా మానవాళిని డెబ్భై ఏళ్ళుగా కాపాడుకొస్తున్నది ఆ భయమే! పురాణ పురుషులు కొందరికి ఉన్నాయని చెబు తున్న అసాధారణమైన శక్తులు ఇప్పుడిప్పుడే ఆధునిక విజ్ఞానం ద్వారా మానవ జాతికి మళ్ళీ సంక్రమిస్తున్నట్టుగా కనిపి స్తుంది. విమానయానం, గ్రహాం తర యానం, దూర శ్రవణం, దూర దర్శనం లాంటి శక్తులు పురాణా లలో కనిపిస్తాయి. మళ్ళీ అత్యాధునిక కాలంలో కనిపిస్తున్నాయి. అలాగే అస్త్రాలూ శస్త్రాలూ కూడా. మన పురాణాలలో మహా వీరులు శస్త్రాలతో పాటు అస్త్రాలు కూడా వాడే వారు. ఈ అస్త్రాలు సామాన్య యోధులకు తెలియవు. ఈ ‘టెక్నాలజీ’ తెలిసిన వాళ్ళు జగదేకవీరులుగా ప్రసిద్ధి పొందేవారు. ఎన్ని రకాల అస్త్రాలు తెలిస్తే అంత గొప్ప. అస్త్రవిద్య అందరికీ అంత తేలికగా అబ్బే విద్య కాదు. దాన్ని నేర్చుకొనేందుకు అస్త్ర విద్యావేత్తలయిన విశిష్ట గురు వుల దగ్గర శిక్షణ అవసరం అయ్యేది. రామ లక్ష్మ ణులను విశ్వామిత్రుడు యాగ రక్షణ నెపంతో తీసుకు వెళ్ళింది వాళ్లకు ముందుముందు దుష్ట శిక్షణకు అవసరమయ్యే విలువైన అస్త్రాలన్నింటినీ నేర్పిం చటం కోసమే. భీష్ముడు పరశురాముడి దగ్గర అస్త్ర విద్యలు నేర్చుకొని ఓటమి ఎరగని వీరుడయ్యాడు. అర్జునుడు వనవాస సమయంలో ప్రత్యేకంగా తపస్సు చేసి సాక్షాత్తూ శివుడి నుంచి పాశుపతాస్త్ర ప్రయోగం నేర్చుకొన్నాడు. ఆ నాటి బ్రహ్మాస్త్రం శత్రువులను ముల్లో కాలలో ఎక్కడికి వెళ్ళినా వెంటాడి బంధించేది. సమ్మో హనాస్త్రం యుద్ధ భూమిలో అందరినీ ఒక్క పెట్టున మూర్ఛలో ముంచేసేది. వరుణాస్త్రం వానలతో ముం చెత్తేది. ఆగ్నేయాస్త్రం నిప్పులు కురిపించేది. బ్రహ్మ శిరో నామాస్త్రం గర్భస్థ శిశువులను కూడా కాల్చి వేసి వంశ నాశనం చేయగలిగేది. ఈ అస్త్రాలు భౌతికమైన ఆయు ధాలు కాదు. గరికపోచను శాస్త్ర విజ్ఞానం ఉపయో గించి మంత్రించితే అదే క్షిపణిగా, అస్త్రంగా మారేది. అప్పుడయినా ఇప్పుడయినా అస్త్రాలూ శస్త్రాలు ఆత్మరక్షణకు తప్పనిసరే అయినా, సర్వ మానవ సంక్షే మానికి నిజంగా ఉపకరించేవి వివేకమూ, సర్వ మానవ సౌభ్రాతృత్వం మాత్రమే అని చరిత్ర చెప్తున్నది. – ఎం. మారుతి శాస్త్రి -
‘ఉచితం! ఉచితం!’
ఈ మధ్య మన దినపత్రికలు రంగు రంగుల ‘జాకెట్ల’తో కళకళలాడుతూ పాఠకులకు కనువిందునూ, పత్రికాధిపతులకు కోశ పుష్టినీ కలిగిస్తు న్నాయి. కారణం వ్యాపార ప్రకటనల పండుగ హడా వుడి. ఈ హడావుడీ, కళ కళా ఆర్థిక వ్యవస్థ చురుకు దనాన్ని సూచిస్తాయి కనుక ఇది ఒక రకంగా క్షేమక రమే. ప్రకటన కర్తలు ఎంత ప్రతిభ చూపినా, ఎన్ని కలల లోకాలను కళ్లకు కట్టినా, పాఠకులను అన్నిటి కంటే ఎక్కువ ఆకర్షించేది మాత్రం ‘ఉచితం!’ మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారు లను ఆకర్షించే అయస్కాంతం ‘ఉచితం!’ అనే తారక మంత్రం. ‘అది కొంటే, ఇది ఉచితం!’ ‘రెండు కొంటే ఒకటి ఉచితం!’ లాంటి ఆకర్షణలు లేకపోతే ఎంత గొప్ప ప్రకటనలైనా సీదా సాదాగా కనిపిస్తాయి. కన్ను ఆగదు. ఈ ప్రకటనలలో ‘ఉచితం’ అంటే ప్రకటన కర్తలు చెప్పేదీ, పాఠకులకు అర్థమయ్యేదీ డబ్బు ఇవ్వనక్కర లేకుండా లభించేది, ఊరికే దొరికేదనే. చిత్రమేమిటంటే, ‘ఉచితం’ అంటే ఈ అర్థం మొన్న మొన్నటి దాకా, అంటే వ్యాపార ప్రక టనలు వ్యాప్తిలోకి వచ్చేదాకా ఉన్నట్టు కనిపించదు. ప్రముఖ నిఘంటువులలో, ‘ఉచితం’ అనే మాటకు ‘ఫ్రీ’ అనే అర్థం కనపడదు. ‘ఉచితం’ అనే సంస్కృత పదా నికి తగినది, సరైనది, సంప్రదాయ సిద్ధమైనది, హేతుబద్ధమైనది అనే అర్థాలే కనిపిస్తాయి. ‘ఉచితజ్ఞు’ డయిన మహాకవి కాళిదాసు, ‘ఉచిత’ పదాన్ని తర చుగా ఉపయోగిస్తాడు. కానీ ‘రెండు కొంటే ఒకటి ఉచితం’ లాంటి అర్థంలో కాదు. ‘శుభ సమయంలో ఇలా రోదించటం నీకు ఉచితం కాదు’ అని శకుంత లను ఊరడించటం శాకుంతలం నాటకంలో కనిపి స్తుంది. రఘు వంశ కావ్యంలో, వశిష్ఠాశ్రమంలో లేడి పిల్లలు ‘నీవార భాగదేయ ఉచితాలు’– ఋషుల ఇళ్ల లోని నివ్వరి ధాన్యంలో తమదైన భాగం పొందేందుకు అర్హత కలిగినవి. ‘రక్త చందనోచితు’డైన ఈ వృకోద రుడు ఇలా అడవిలో దుమ్ము కొట్టుకొని ఉంటే చూస్తున్న నీకు బాధ కలగటం లేదా?’ అంటుంది భారవి కావ్యంలో ద్రౌపది, ధర్మరాజుతో. తెలుగు నిఘంటువులలో కూడా ‘ఉచితం’ అనే మాటకు, తగినది, అలవాటుపడినది, పరిచితం, మితం లాంటి అర్థాలు మాత్రమే కనిపిస్తాయి. ‘ఉచితా హారము వల్లనె,/ఉచితంబుగ బుద్ధి స్థిరత ఒప్పుట వలనే,/ఉచిత గురు బోధ వల్లనె,/సుచరితుడై పరము గాంచు సుమ్ముర వేమా!’ అనే వేమన పద్యంలో, ఉచితం అనే మాటకు, ‘డబ్బివ్వకుండా లభించేది’ అని అర్థం చెప్పటం అనుచితం. శ్రీ కృష్ణ పరమాత్మ శిరస్సును, సత్యభామ తన ఎడమకాలితో తొలగదోస్తే, ‘అట్లయగు! పేరలుకన్ చెందినయట్టి కాంతలు ఉచిత వ్యాపారముల్ నేర్తురే!’ అని ప్రశ్నించి. సమర్థిస్తాడు ముక్కు తిమ్మన. పట్టరానంత కోపం వచ్చిన మానినీ మణుల మాటేమో కానీ, మామూలు మహిళలకు మాత్రం ‘ఉచిత’ వ్యాపా రాల గురించిన అవగాహన మగవారితో సమానం గానే ఉంటుందంటారు అనుభవజ్ఞులైన వ్యాపారులు. (వ్యాసకర్త : ఎం. మారుతి శాస్త్రి ) -
మహా వాక్యాలు
మహాద్భుత భాష్య ప్రకరణ గ్రంథాలతో వేదాంత జిజ్ఞాసువులకు మహోపకారం చేసిన జగద్గురువులు ఆదిశంకరులు అవతార సమాప్తి సమయంలో ఐదు శ్లోకాలను బోధించారు. ‘సోపాన పంచకం’ అని వాటికి పేరు. వాటిలో ఆయన సత్యాన్వేషణకు అను సరించదగిన కర్తవ్యాలను చెప్పారు. మూడో శ్లోకంలో ఎనిమిది ముఖ్య అంశాల కార్య ప్రణాళికను ప్రతిపా దించారు: ఒకటి, వాక్యార్థం బాగా విచారించండి. అంటే ఉపనిషత్తులు చెప్పిన మహా వాక్యాల తాత్పర్య మేమిటో బాగా చింతన చేయండి. రెండు, శ్రుతి-శిర స్సులయిన ఉపనిషత్తుల బోధనలు బాగా అవగాహన చేసుకొని అనుసరించండి. వేదాలకు శీర్ష భాగాలు - ‘వేద=అంతం’ - ఉపనిషత్తులే కదా! మూడు, వితండ వాదాలూ, దుష్టతర్కాలకు దూరంగా ఉండండి. వాటి వలన కాల యాపనా, చిత్త విభ్రమం, చాంచల్యం, రణ గొణ ధ్వనీ తప్ప ప్రయోజనం శూన్యమే. నాలుగు, సత్యాన్వేషణలో ఆసక్తి ఉంటే వేద శాస్త్ర సమ్మతమైన తర్క పద్ధతి అవలంబించండి. ఐదు నేను బ్రహ్మ స్వరూపుడిని అని నిరంతరం భావన చేస్తూ ఉండండి. ఆరు, గర్వాన్ని ఎప్పుడూ, పూర్తిగా త్యజిం చండి. నాకు ఈ విషయం అంతా ముందే తెలుసు అన్న భావన వదలకపోతే, ఇక ఆ విషయాన్ని తెలుసుకొనే అవ కాశమే ఉండదు. ఏడు, ‘ఈ శరీరమే నేను’ అనే తాదాత్మ్యత వదిలిపెట్టండి. ఎనిమిది, పండి తులతో వాదాలకు దిగవద్దు. మొదటి అంశంలో చెప్పి న వాక్యార్థ విచారణ ఉపనిషత్తులు చెప్పిన మహా వాక్యాల గురించి. ఈ మహా వాక్యాలు వేదాలూ, ఉపని షత్తులలో వివరించిన జ్ఞానకాండకు కీలకాలు. వీటి విస్తరణే వేదాంతశాస్త్రం. ‘ప్రజ్ఞానం బ్రహ్మ’ (జ్ఞానమే బ్రహ్మ) అనే మహా వాక్యం ఋగ్వేదానికి కీలకం. ఇది పరమార్థ ‘సాక్షాత్కార’ మహా వాక్యం. యజుర్వేదం లోని ‘అహం బ్రహ్మాస్మి’ (నేను పరబ్రహ్మమును అయి ఉన్నాను) ‘అనుభవ’ మహావాక్యం. ‘నేను సర్వ వ్యాపి అయిన పరబ్రహ్మ కంటే భిన్నం కాదు’ అన్న సత్యం నోటి మాటలుగా, గురువు చెప్పిన పాఠాలుగా నేర్చు కోవటం కాకుండా దాన్ని అపరోక్షంగా అనుభవించ మంటుంది. సామవేదంలోని ‘త్-త్వం-అసి’ (అది - నువ్వు- అయి ఉన్నావు) అన్న మహావాక్యం ఆ పరబ్రహ్మవు నువ్వే అని చెప్పే ‘ఉపదేశ’ మహావాక్యం. అథర్వణ వేదంలోని ‘అయం- ఆత్మా-బ్రహ్మ‘ (ఈ ఆత్మయే పరబ్రహ్మము) అన్నది జ్ఞాన బోధను సంపూ ర్ణం చేసే ‘సమాప్తి’ మహావాక్యం. ఈ మహా వాక్యాల అర్థాలు అంత తేలికగా అం తుచిక్కేవి కావు. వీటి తాత్పర్యం తెలుసుకొనేందుకు, అంతకంటే ముఖ్యంగా దానిని అనుభూతి చేసుకొ నేందుకు, అనేక జన్మల కఠోర సాధన అవసరం. తత్-త్వం-జ్ఞానం-ఆత్మ-బ్రహ్మ లాంటి మాటలకు సరయిన అర్థం తెలుసుకోవాలంటే బహుకాలం పాటు శ్రవణ, మనన, నిదిధ్యాసనలు అవసరమని ఉపనిషత్తు చెప్తున్నది. ఆదిశంకరుల వాక్య వృత్తి, లఘు వాక్య వృత్తి, మహా వాక్య దర్పణం మొదలైన భాష్య ప్రకరణ గ్రంథాలు ఈ మహా వాక్యాలను విశదం చేయటానికి ఉద్దేశించినవే. ఈ మహా వాక్యాల నిరంతర చింతనే ముముక్షువైన సాధకుడికి జీవితం. -ఎం. మారుతిశాస్త్రి -
దంపతుల కలహం.. ఆరుగురు బలి
ఒడిశాలో విషాదం అత్త, మామ సహా ఐదుగురిని కాల్చి చంపిన కానిస్టేబుల్ అనంతరం తానూ ఆత్మహత్య కొరాపుట్(ఒడిశా), భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం ఆరు నిండు ప్రాణాలను బలిగొంది. భార్య మీద కోపంతో ఓ వ్యక్తి అత్తింటి వారిలో నలుగురిని, వారితో పాటు ఉన్న కారు డ్రైవర్‌ను కాల్చి చంపడమే కాకుండా, చివరకు తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒడిశాలోని కొరాపుట్‌లో సోమవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు అందించిన వివరాలు.. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన డిస్ట్రిక్ట్ వాలెంటరీ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా ఉన్న నరేంద్ర కండపాన్ కుటుంబంతో కలసి స్థానిక ఓల్డ్ మైనింగ్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తింది. కోపోద్రిక్తుడైన నరేంద్ర తన భార్య జ్యోతిర్మయి ఎడమ కాలిపై ఇనుపరాడ్‌తో కొట్టాడు. దీంతో ఆమె భయంతో వేరే గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నానని, వెంటనే వచ్చి కాపాడాలని తండ్రి జలేందర్ సమర్లియాకు ఫోన్ చేసింది. ఆందోళన చెందిన ఆమె తండ్రి అద్దె కారులో భార్య హేమలత, కుమారుడు మిథున్, తొమ్మిదేళ్ల కుమార్తె రచన లతో కలసి రాత్రి 12 గంటల సమయంలో కొరాపుట్ చేరుకున్నాడు. ఇంటి ముందు కారు ఆగిన శబ్దం విన్ననరేంద్ర మరింత ఆగ్రహంతో ముందుకెళ్లాడు.కారులో ఉన్న అత్తమామలు, బావమరిది, మరదలితో పాటు డ్రైవర్‌పై తనవద్ద ఉన్న ఏకే-47 తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం, ఆ ఇంటికి కొద్ది దూరంలో ఉన్న తుప్పల మధ్యకు వెళ్లి తుపాకీతో పేల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మూడేళ్ల క్రితమే పెళ్లిచేసుకున్న నరేంద్ర, జ్యోతిర్మయిలకు ఏడాదిన్నర వయసున్న పాప ఉంది. -
కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు
= కారు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు =నలుగురు దుర్మరణం =రక్తసిక్తమైన బస్టాప్ సాక్షి, విజయవాడ : విధి వారి జీవితాలతో చెలగాటం ఆడింది. అప్పటివరకు చదువుకుని ఇంకో గంటలో ఇంటికి వెళ్లడానికి బస్టాప్‌లో ఎదురు చూస్తున్న ముగ్గురు విద్యార్థినులను కారు రూపంలో మృత్యువు వెంటాడింది. వివాహ బంధంలోకి వచ్చి మూడు నెలలు కూడా దాటని మరో వైద్యుడిని కూడా కబళించింది. డ్రైవింగ్ లెసైన్స్ కూడా లేని ఫుట్‌వేర్ కంపెనీ ఉద్యోగి నడుపుతున్న కారు బస్టాప్‌లోకి దూసుకొచ్చి నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. త్వరగా విమానాశ్రయానికి చేరాలన్న ఆదుర్దాలో బీపీ డౌన్ అయి ఒక్కసారిగా కారు అదుపు తప్పిందని డ్రైవర్ చెబుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే... అది విజయవాడ రామవరప్పాడు రింగ్ సెంటర్. సాయంత్రం ఐదు కావస్తోంది. సమీపంలోని ఎస్సార్కే ఇంజినీరింగ్ కళాశాల అప్పుడే వదిలిపెట్టారు. ఇంటికి వెళ్లేందుకు విద్యార్థులు రామవరప్పాడు రింగ్ సెంటర్ వద్దకు వచ్చి బస్టాప్‌లో నిలుచున్నారు. పిన్నమనేని వైద్యకళాశాల కూడా అప్పుడే వదిలిపెట్టారు. అందులోని డాక్టర్లు, విద్యార్థులు కూడా బయటకు వచ్చారు. ఇలా అక్కడ కోలాహలం నెలకొంది. బస్టాప్‌లో ఆయా కాలేజీలకు చెందిన విద్యార్థులు, డాక్టర్లు, ఇతర ప్రయాణికులు నిలుచుని ఉన్నారు. చాలా సురక్షిత ప్రాంతంలోనే ఉన్నా మృత్యువు వారిపైకి కారు రూపంలో దూసుకొచ్చింది. గుంపుగా బస్టాప్ వద్ద నిలుచున్నవారిని వేగంగా ఢీకొట్టింది. ఒక్కసారిగా అక్కడ ఏం జరిగిందో ఎవరికీ అర్థంకాలేదు. తేరుకునేసరికి 15 మందికి పైగా గాయాలతో కిందపడిపోయారు. ఆ ప్రదేశమంతా రక్తసిక్తమైంది. హాహాకారాలు, ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ ఘటనలో ఇంజినీరింగ్ విద్యార్థిని జ్యోతిర్మయి అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్ర గాయాలపాలైన మరో పదిమందిని అక్కడే ఉన్న పోలీసులు, సమీపంలోని వారు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చందుశ్రీ, సింధుజ అనే మరో ఇద్దరు విద్యార్థినులు మారుతి సురేష్ అనే వైద్యుడు కన్నుమూశారు. కుటుంబాల్లో తీరని శోకం... ఊహించని దుర్ఘటనలో నలుగురు మృతిచెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. మృతుల్లో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థినులు కాగా, మరొకరు పిన్నమనేనిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న శ్వాసకోశ వైద్యుడు డాక్టర్ మారుతి సురే ష్. ఆయన ఏడాదిన్నర క్రితమే ఎండీ పూర్తిచేసి ఉద్యోగంలో చేరారు. మూడు నెలల క్రితమే (గత ఆగస్టులో) పెళ్లయింది. ఆయన భార్య కూడా దంత వైద్య నిపుణురాలు. ఈ ఘటనతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. ‘నా కుమారుడిని ఉదయమే బస్టాప్‌లో దింపా.. వెళ్లొస్తా నాన్నా అన్నాడు.. కానీ రాకుండానే వెళ్లిపోయాడు..’ అంటూ సురేష్ తండ్రి కన్నీళ్ల పర్యంతమయ్యారు. మృతుల్లో టి.జ్యోతిర్మయి స్వస్థలం నున్న. తండ్రి శివశంకర్ ఎలక్ట్రీషియన్. దాసరి చందుశ్రీ (20) స్వస్థలం కూడా నున్న గ్రామమే. మరో విద్యార్థిని పెసల సింధూజ (20) స్వస్థలం న్యూరాజీవ్నగర్ ప్రాంతం. తండ్రి జనార్ధన్ ఆటోడ్రైవర్. మృతుల బంధువులు, ఆప్తుల రోదనలతో ప్రభుత్వాస్పత్రితో పాటు, సెంటినీ ఆస్పత్రి ప్రాంగణం మార్మోగింది. ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు ప్రమాదానికి గురైన విషయం తెలుసుకుని వందలాది మంది ప్రభుత్వాస్పత్రి, సెంటినీ ఆస్పత్రుల వద్దకు చేరుకున్నారు. దీంతో ఆయా ఆస్పత్రుల ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. ప్రమాద ఘటన విషయం తెలిసిన వెంటనే డీసీపీ రవిప్రకాష్ విద్యార్థినులు చికిత్స పొందుతున్న సెంటినీ ఆస్పత్రికి వచ్చి పరిస్థితిని సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ ఉషాకుమారి, సబ్ కలెక్టర్ హరిచందనలు ఆస్పత్రికి చేరుకుని మృతుల బంధువులను పరామర్శించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సమీక్షించారు.