గుండుతో నటి.. ఇప్పుడెందు‍కు ఇలా! | Director Amal Neerad Shares Wife Jyothirmayi Photo See New Look | Sakshi
Sakshi News home page

లాక్‌డౌన్‌: భార్య ఫొటో షేర్‌ చేసిన డైరెక్టర్‌

Published Fri, Apr 24 2020 3:22 PM | Last Updated on Fri, Apr 24 2020 3:45 PM

Director Amal Neerad Shares Wife Jyothirmayi Photo See New Look - Sakshi

లాక్‌డౌన్‌తో ప్రస్తుతం ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. కరోనా ఇచ్చిన సెలవులను కుటుంబంతో కలిసి గడుపుతూ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక ఎల్లప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే సినీ సెలబ్రిటీలు లాక్‌డౌన్‌ను ఎలా ఆస్వాదిస్తున్నారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వంట చేస్తూ.. ఇంటిని శుభ్రపరుస్తూ.. చాలెంజ్‌ల మీద చాలెంజ్‌లు విసురుతూ సోషల్‌ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో మలయాళ దర్శకుడు అమల్‌ నీరద్‌ షేర్‌ చేసిన ఓ ఫొటో నెటిజన్లను కన్‌ఫ్యూజ్‌ చేస్తోంది. (అందుకే నీకు ఈ గిఫ్ట్‌ ఇస్తున్నా: నటుడు)

తన భార్య, నటి జ్యోతిర్మయి గుండుతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన అమల్‌.. చీకటి నుంచి వెలుగులోకి నడిపించు అనే అర్థం వచ్చేలా.. సంస్కృత శ్లోక పంక్తి.. ‘‘తమసోమా జ్యోతిర్గమయ’’అనే క్యాప్షన్‌ జతచేశాడు. ఈ క్రమంలో కొంత మంది నెటిజన్లు జ్యోతిర్మయి న్యూలుక్‌లో ఎంతో అందంగా ఉన్నారని కామెంట్‌ చేయగా.. అభిమానులు మాత్రం ఇప్పుడు గుండు చేయించుకోవాల్సిన అవసరం ఏమిటని ఆరా తీస్తున్నారు. ఇక జ్యోతిర్మయి ఫొటోపై సెలబ్రిటీలు కూడా స్పందించారు. నజ్రియా నంజీమ్‌, రీమా కలింగల్‌ థమ్సన్‌ గుర్తుతో మేకోవర్‌ బాగుందంటూ కితాబిచ్చారు. కాగా తమిళ, మలయాళ సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన జ్యోతిర్మయి తొలుత నిశాంత్‌ కుమార్‌ అనే వ్యక్తిని పెళ్లిచేసుకున్నారు. ఆయన నుంచి విడాకులు తీసుకున్న తర్వాత 2015లో డైరెక్టర్‌, సినిమాటోగ్రాఫర్‌ అమల్‌ నీరద్‌ను వివాహమాడారు. ('ప్రభాస్‌ను నేను పెళ్లి చేసుకోవడం లేదు')

Tamasoma Jyothirgamaya 😊 . #Jyothirmayee

A post shared by Amal Neerad (@amalneerad_official) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement