Amal Neerad
-
గుండుతో నటి.. ఇప్పుడెందుకు ఇలా!
లాక్‌డౌన్‌తో ప్రస్తుతం ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. కరోనా ఇచ్చిన సెలవులను కుటుంబంతో కలిసి గడుపుతూ సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇక ఎల్లప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే సినీ సెలబ్రిటీలు లాక్‌డౌన్‌ను ఎలా ఆస్వాదిస్తున్నారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వంట చేస్తూ.. ఇంటిని శుభ్రపరుస్తూ.. చాలెంజ్‌ల మీద చాలెంజ్‌లు విసురుతూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలో మలయాళ దర్శకుడు అమల్ నీరద్ షేర్ చేసిన ఓ ఫొటో నెటిజన్లను కన్ఫ్యూజ్ చేస్తోంది. (అందుకే నీకు ఈ గిఫ్ట్ ఇస్తున్నా: నటుడు) తన భార్య, నటి జ్యోతిర్మయి గుండుతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన అమల్.. చీకటి నుంచి వెలుగులోకి నడిపించు అనే అర్థం వచ్చేలా.. సంస్కృత శ్లోక పంక్తి.. ‘‘తమసోమా జ్యోతిర్గమయ’’అనే క్యాప్షన్ జతచేశాడు. ఈ క్రమంలో కొంత మంది నెటిజన్లు జ్యోతిర్మయి న్యూలుక్లో ఎంతో అందంగా ఉన్నారని కామెంట్ చేయగా.. అభిమానులు మాత్రం ఇప్పుడు గుండు చేయించుకోవాల్సిన అవసరం ఏమిటని ఆరా తీస్తున్నారు. ఇక జ్యోతిర్మయి ఫొటోపై సెలబ్రిటీలు కూడా స్పందించారు. నజ్రియా నంజీమ్, రీమా కలింగల్ థమ్సన్ గుర్తుతో మేకోవర్ బాగుందంటూ కితాబిచ్చారు. కాగా తమిళ, మలయాళ సినిమాల్లో నటించి గుర్తింపు పొందిన జ్యోతిర్మయి తొలుత నిశాంత్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లిచేసుకున్నారు. ఆయన నుంచి విడాకులు తీసుకున్న తర్వాత 2015లో డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ అమల్ నీరద్ను వివాహమాడారు. ('ప్రభాస్‌ను నేను పెళ్లి చేసుకోవడం లేదు') View this post on Instagram Tamasoma Jyothirgamaya 😊 . #Jyothirmayee A post shared by Amal Neerad (@amalneerad_official) on Apr 22, 2020 at 2:18am PDT -
దర్శకుడు, హీరోయిన్ ఒకటయ్యారు
కొచ్చి: ప్రముఖ మళయాళ సినిమా నిర్మాత,దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ అమల్ నీరద్, ప్రముఖ నటి జ్యోతిర్మయి శనివారం పెళ్లి చేసుకున్నారు. సన్నిహిత బంధుమిత్రుల సమక్షంలో వీరిద్దరూ స్థానికి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. కోల్‌కతాలోని సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన తరువాత నీరద్ సినిమాటోగ్రాఫర్‌గా సినీ రంగప్రవేశం చేశారు. ఆ తరువాత నిర్మాత, దర్శకుడిగా మారి బిగ్ బీ, సాగర్ అలియాస్ జాకీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు నిర్మించారు. బిగ్ బీలో ముమ్ముట్టీ నటించారు. టీవీ సీరియల్స్‌లో నటించడం మొదలు పెట్టిన జ్యోతిర్మయి ఆ తరువాత సినిమా రంగంలోకి ప్రవేశించింది. దాదాపు 35 సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన 'మీషా మాధవన్', 'పటాలం' రెండు చిత్రాలు బ్లాక్బస్టర్ల్సే. జ్యోతిర్మయికి ఇది రెండవ పెళ్లి. ఐటీ నిపుణుడైన ఆమె మొదటి భర్త నుంచి 2011లో విడాకులు తీసుకున్నారు.