దర్శకుడు, హీరోయిన్ ఒకటయ్యారు | Filmmaker Amal Neerad marries actress Jyothirmayee | Sakshi
Sakshi News home page

దర్శకుడు, హీరోయిన్ ఒకటయ్యారు

Published Sat, Apr 4 2015 5:26 PM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM

జ్యోతిర్మయి - నీరద్

జ్యోతిర్మయి - నీరద్

కొచ్చి: ప్రముఖ మళయాళ సినిమా నిర్మాత,దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ అమల్ నీరద్, ప్రముఖ నటి జ్యోతిర్మయి శనివారం పెళ్లి చేసుకున్నారు. సన్నిహిత బంధుమిత్రుల సమక్షంలో వీరిద్దరూ స్థానికి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు. కోల్కతాలోని సత్యజిత్రే ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన తరువాత నీరద్ సినిమాటోగ్రాఫర్గా సినీ రంగప్రవేశం చేశారు. ఆ తరువాత నిర్మాత, దర్శకుడిగా మారి బిగ్ బీ, సాగర్ అలియాస్ జాకీ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు నిర్మించారు. బిగ్ బీలో ముమ్ముట్టీ నటించారు.

టీవీ సీరియల్స్లో నటించడం మొదలు పెట్టిన జ్యోతిర్మయి ఆ తరువాత సినిమా రంగంలోకి ప్రవేశించింది. దాదాపు 35 సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన 'మీషా మాధవన్', 'పటాలం' రెండు చిత్రాలు బ్లాక్బస్టర్ల్సే. జ్యోతిర్మయికి ఇది రెండవ పెళ్లి. ఐటీ నిపుణుడైన ఆమె మొదటి భర్త నుంచి 2011లో విడాకులు తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement