![Actress Aishwarya Lekshmi Shares About Her Successful Journey As a Producer - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/15/aishwarya-lakshmi.jpg.webp?itok=1K-GFFcs)
నటిగా, నిర్మాతగా హ్యాపీ జీవితాన్ని గడుపుతోంది నటి ఐశ్వర్యలక్ష్మి. నటుడు విశాల్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైంది ఈ మలయాళ బ్యూటీ. ఆ తరువాత ధనుష్ హీరోగా నటించిన ‘జగమే తందితరం’ చిత్రంలో శ్రీలంక తమిళ భాష మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నారు. ఇక మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం పొన్నియిన్ సెల్వన్‌లో పూంగుళళీ పాత్రలో నటించారు. ఇందులో నటనకు గాను సినీ ప్రముఖుల ప్రశంసలను అందుకున్నారు.
చదవండి: అందుకే సినిమాలకు గ్యాప్ తీసుకున్నా: నటుడు అజయ్
మాతృభాషలోనూ నటిస్తున్న ఈమె నిర్మాతగానూ అవతారమెత్తి విజయాలను అందుకుంటున్నారు. నటి సాయిపల్లవి నటించిన గార్గీ చిత్రాన్ని ఆమె నిర్మించారు. ఈ మూవీ మలయాళంతో పాటు తమిళ్ తదితర భాషల్లోనూ విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ప్రస్తుతం తెలుగులో కథానాయకిగా ప్రధాన పాత్రను పోషించిన అమ్ము చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుని ఈ నెల 19వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. అలాగే ఐశ్వర్యలక్ష్మి మలయాళంలో నటించి, నిర్మించిన కుమారి అనే చిత్రం కూడా నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని ఈ నెల 28వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది.
చదవండి: ‘బాహుబలి’ ఆఫర్ వదులుకున్నందుకు గర్వపడుతున్నా: మంచు లక్ష్మి
గార్గీ వంటి విజయవంతమైన చిత్రం తరువాత తాను నిర్మించిన చిత్రం కుమారి ఐశ్వర్యలక్ష్మి పేర్కొన్నారు. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రమని, ఇలా మూడు భాషల్లో మూడు మంచి పాత్రల్లో వరుసగా నటించడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం తమిళంలో నటుడు విష్ణు విశాల్‌కు జంటగా కట్టా కుస్తా చిత్రం, ప్రియా దర్శకత్వంలో అశోక్ సెల్వన్, వసంత రవిలతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా మలయాళంలో మమ్ముట్టితో క్రిస్టోఫర్, కింగ్ ఆఫ్ గోవా చిత్రంలో దుల్కర్ సల్మాన్‌కు జంటగా నటిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment