సినీ ఇండస్ట్రీలో నటీనటులు ఎదర్కొనే వేధింపుల గురించి తెలిసిందే. లైంగిక వేధింపులు లేదా అభ్యంతరకర సన్నివేశాల్లో నటించాలంటూ వారిని బలవంతం చేస్తుంటారు. అయితే అవకాశాలు, డబ్బు కోసం మరోదారి లేక కొందరు బలవంతంగా వారు చెప్పింది చేస్తుంటారు. కానీ, ఇలాంటి సంఘటనలు ఎదుర్కొనేది ఎక్కువ నటీమణులే. మీ టూ ఉద్యమం ద్వారా ఎందరో నటీమణలు, హీరోయిన్లు దర్శక-నిర్మాతల నుంచి వారు ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా సౌత్ సినీ ఇండస్ట్రీలో జరిగిన ఓ సంఘటన అశ్యర్యానికి గురి చేస్తోంది.
చదవండి: ఆరోగ్యంపై స్పందించిన పంచ్ ప్రసాద్, ముక్కులోంచి రక్తం...
ఓ నటుడిని మహిళా దర్శకుడు వేధింపులకు గురి చేసి జైలు పాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కేరళ చిత్ర పరిశ్రమకు చెందిన లక్ష్మి దీప అనే లేడీ డైరెక్టర్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో గుర్తింపు పొందుతుంది. ఇప్పటికే ఆమె పలు సినిమాలు తెరకెక్కించి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో ఆమె గతేడాది ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిచింది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో నటించిన ప్రధాన నటుడు ఆమెపై సంచలన ఆరోపణలు చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. దీంతో అతడి పటిషన్‌ను విచారించిన కోర్టు దీపను అరెస్ట్ చేయాల్సిందిగా కేరళ పోలీసులను ఆదేశించింది. దీంతో రెండు రోజులు క్రితం పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టు హాజరు పరిచారు.
చదవండి: ఆ స్టార్ హీరోల సినిమాను తిరస్కరించిన సాయి పల్లవి
‘డైరెక్టర్ లక్ష్మీ దీప ఓ వెబ్ సిరీస్ కోసం గతేడాది నన్ను సంప్రదించింది. నన్ను హీరోగా చేస్తానని చెప్పింది. దీనికి నాతో ఒప్పందం కూడా కుదర్చుకుంది. నాపై కొన్ని సీన్లను చిత్రీకరించిన అనంతరం అభ్యంతకర సీన్స్‌లో నటించాలని చెప్పింది. దానికి నేను ఒప్పుకోకపోవడంతో నన్ను బలవంతం చేసింది. కాంట్రాక్ట్ పేరుతో నన్ను బయపెట్టి ఆ పాడు సీన్లలో నటించేలా చేసింది. దీనికి సంబంధించిన షూటింగ్ 2022లో అరువిక్కురలోన ఓ ప్లాట్‌లో చోటు చేసుకుంది’ అని సదరు నటుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మొదట అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా దీపపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అతడు కోర్టు ఆశ్రయించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment