woman directors
-
షాకింగ్: నటుడిపై వేధింపులు.. మహిళా డైరెక్టర్ అరెస్ట్
సినీ ఇండస్ట్రీలో నటీనటులు ఎదర్కొనే వేధింపుల గురించి తెలిసిందే. లైంగిక వేధింపులు లేదా అభ్యంతరకర సన్నివేశాల్లో నటించాలంటూ వారిని బలవంతం చేస్తుంటారు. అయితే అవకాశాలు, డబ్బు కోసం మరోదారి లేక కొందరు బలవంతంగా వారు చెప్పింది చేస్తుంటారు. కానీ, ఇలాంటి సంఘటనలు ఎదుర్కొనేది ఎక్కువ నటీమణులే. మీ టూ ఉద్యమం ద్వారా ఎందరో నటీమణలు, హీరోయిన్లు దర్శక-నిర్మాతల నుంచి వారు ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. అయితే తాజాగా సౌత్ సినీ ఇండస్ట్రీలో జరిగిన ఓ సంఘటన అశ్యర్యానికి గురి చేస్తోంది. చదవండి: ఆరోగ్యంపై స్పందించిన పంచ్ ప్రసాద్, ముక్కులోంచి రక్తం... ఓ నటుడిని మహిళా దర్శకుడు వేధింపులకు గురి చేసి జైలు పాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. కేరళ చిత్ర పరిశ్రమకు చెందిన లక్ష్మి దీప అనే లేడీ డైరెక్టర్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో గుర్తింపు పొందుతుంది. ఇప్పటికే ఆమె పలు సినిమాలు తెరకెక్కించి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో ఆమె గతేడాది ఓ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిచింది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో నటించిన ప్రధాన నటుడు ఆమెపై సంచలన ఆరోపణలు చేస్తూ కోర్టును ఆశ్రయించాడు. దీంతో అతడి పటిషన్‌ను విచారించిన కోర్టు దీపను అరెస్ట్ చేయాల్సిందిగా కేరళ పోలీసులను ఆదేశించింది. దీంతో రెండు రోజులు క్రితం పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి కోర్టు హాజరు పరిచారు. చదవండి: ఆ స్టార్ హీరోల సినిమాను తిరస్కరించిన సాయి పల్లవి ‘డైరెక్టర్ లక్ష్మీ దీప ఓ వెబ్ సిరీస్ కోసం గతేడాది నన్ను సంప్రదించింది. నన్ను హీరోగా చేస్తానని చెప్పింది. దీనికి నాతో ఒప్పందం కూడా కుదర్చుకుంది. నాపై కొన్ని సీన్లను చిత్రీకరించిన అనంతరం అభ్యంతకర సీన్స్‌లో నటించాలని చెప్పింది. దానికి నేను ఒప్పుకోకపోవడంతో నన్ను బలవంతం చేసింది. కాంట్రాక్ట్ పేరుతో నన్ను బయపెట్టి ఆ పాడు సీన్లలో నటించేలా చేసింది. దీనికి సంబంధించిన షూటింగ్ 2022లో అరువిక్కురలోన ఓ ప్లాట్‌లో చోటు చేసుకుంది’ అని సదరు నటుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మొదట అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా దీపపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అతడు కోర్టు ఆశ్రయించినట్లు సమాచారం. -
రంగస్థలంపై పాకుడు రాళ్ళు
‘పాకుడు రాళ్ల’ మీద స్థిరంగా నిలవడం కష్టం. కుడు రాళ్లు పట్టుకుని పైపైకి ఎగబాకడమూ కష్టమే. సినిమా రంగంలో స్త్రీల కెరీర్ పాకుడు రాళ్లపై నడక వంటిదని రావూరి భరద్వాజ రాసిన నవల ‘పాకుడు రాళ్లు’జ్ఞానపీఠ్ అవార్డు గెలుచుకుంది. తెలుపు నలుపు కాలం నాటి నటీమణి జీవితాన్ని ఆధారం చేసుకుని 1978లో రాసిన ఈ నవల ఇప్పుడు నాటకంగా ప్రదర్శితమవుతోంది. ఒక భారీ నవలను నాటకంగా మలచడం కష్టమైనా దర్శకురాలు నస్రీన్ ఇషాక్ విజయం సాధించింది. ఒక మహిళ ప్రధాన పాత్ర వహించే ఈ నాటకానికి మరో మహిళ దర్శకత్వం వహించడం, వస్తువు ఈ కాలానికి కూడా రిలవెంట్గా ఉండటంతో ఇప్పటికి ఆరు ప్రదర్శనలు పూర్తి చేసుకుంది. నస్రీన్ ఇషాక్ పరిచయం... నవలను నాటకంగా మలచడంలో ఆమె సాధక బాధకాలు... గుంటూరు జిల్లాలోని ఒక ఊరిలో నాటకాలు ఆడే అమ్మాయి మంగమ్మ మొదట చెన్నైకి చేరి, అక్కడ ‘మంజరి’గా మారి, నటిగా టాప్‌స్టార్ అయ్యి, ఆ తర్వాత బొంబాయిలో ఎదిగి, భారతదేశం తరఫున సాంస్కృతిక రాయబారిగా అమెరికా వరకూ వెళ్లగలిగింది. అయితే ఆమె ముగింపు? ఆత్మహత్య. సినిమా రంగపు పాకుడురాళ్లు ఆమెను చివరకు పతనం అంచునే పడేస్తాయి. ఈ మంగమ్మ అను మంజరి కథనే రచయిత రావూరి భరద్వాజ ‘పాకుడురాళ్లు’ నవలగా రాశారు. నవల వచ్చాకగాని ఆ తర్వాతగాని ఈ మంజరి ఎవరి కథ అనేది ఆయన బహిరంగ పరచలేదు. మూకీల నుంచి టాకీలుగా సినిమా మారుతుండగా టాప్‌స్టార్ అయిన ఒక హీరోయిన్ కథ అని కొంతమంది, 1950లలో టాప్‌స్టార్ అయిన మరో హీరోయిన్ కథ అని మరి కొంతమంది అంటూ ఉంటారు. అయితే రచయిత రావూరి భరద్వాజ జర్నలిస్టు కూడా కావడం వల్ల తనకు తెలిసిన సమాచారంతో, ముగ్గురు నలుగురు హీరోయిన్ల జీవితాన్ని ఒక మంజరికి ఆపాదించి రాశారని నవలలోని ఘటనలను బట్టి అర్థమవుతుంది. ఇది ఒక రకంగా కొంతమంది హీరోయిన్ల ఉమ్మడి బయోగ్రఫీ. అందుకే ఆ నవలకు అంత బలం, చారిత్రక విలువ. ఇప్పుడు నాటకంగా ‘పాకుడురాళ్లను నాటకంగా చేయడం చాలా పెద్ద సవాలు. దీనిని గంటన్నర నిడివి గల నాటకంగా చేద్దామనుకున్నాను. కానీ గంటా యాభై నిమిషాల కంటే తగ్గించలేకపోయాను’ అంటారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ థియేటర్ విభాగంలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేస్తున్న 52 ఏళ్ల నస్రీన్ ఇషాక్. ఈమె దర్శకత్వం వహించిన ‘పాకుడు రాళ్లు’ నాటకం మొన్న జనవరి ఒకటిన విశాఖలో హౌస్‌ఫుల్ గా ప్రదర్శితమైంది. దానికి ముందు హైదరాబాద్, అద్దంకిలలో కూడా ప్రదర్శితమైంది. షోస్ రిపీట్ అవుతున్నాయి కూడా. ‘ఈ నాటకంలో మంజరి ఎదుర్కొన్న ఘటనలు నేటికీ సినిమా రంగంలో అలాగే ఉన్నాయి. ఆ మధ్య వచ్చిన మీటూ ఉద్యమాన్ని కూడా చూశాం. భరద్వాజ గారు ఈ నవలను విస్తృత ఘటనలతో రాశారు. మంజరి తానే బాధితురాలిగా ఉండి ఆ తర్వాత ఎదుటివారిని ఆడించే శక్తిమంతురాలు అవుతుంది. నవలలో ఆమె పాత్ర అంతర్గత పెనుగులాటను, దాని గాఢతను రచయిత రాయ లేదు. మంజరి పాత్రను సహానుభూతితో అర్థం చేసుకునేలా నాటకం ముగింపును మలచడానికి నవలను శోధించాల్సి వచ్చింది’ అంటారు నస్రీన్ ఇషాక్. ‘పైకి చూడటానికి ఈ నవల మంజరి తన శరీరాన్ని చూపిస్తూ ఇతరులతో ఆడిన ఆటగా ఉంటుంది. కాని లోన చూస్తే ఆ ఆట వల్ల ఆమె పడే వేదన తెలుస్తుంది’ అంటారు ఆమె. 18 మంది నటీనటులు వేదిక మీద 18 మంది నటీనటులు ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు. నవలలో ఎదురు పడే ముఖ్యపాత్రలు– కల్యాణి, రాజమణి, చంద్రం, చలపతి, మాధవరావు... ఈ పాత్రలన్నీ మంజరితో తలపడతాయి. నాటకంలో ఐదు పాటలు ఉన్నాయి. మంజరి పాత్రను భావనా వఝపాండల్ పోషించింది. ‘ఒక నటి బయోపిక్‌ను స్టేజ్ మీద ఏ మేరకు నిజాయితీగా చూపించగలమో ఆ మేరకు పాకుడురాళ్లలో చూపించాం’ అంటారు నస్రీన్ ఇషాక్. తెలుగు రాకపోయినా నస్రీన్ ఇషాక్ది ఢిల్లీ. అక్కడే ఢిల్లీ యూనివర్సిటీలో వీధి నాటకాల నుంచి నాటకరంగం మీద ఆసక్తి పెంచుకున్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో సీటు సాధించి చదువుకున్నారు. 2009 నుంచి హైదరాబాద్‌లో ఉన్నారు. ‘మొదట నేను ఇంగ్లిష్, హిందీ నాటకాలు వేయించేదాన్ని. కాని ఇక్కడ ఉన్నదంతా తెలుగు నటులు. మాతృభాషలో నాటకం ఆడటం నటులకు చాలా ముఖ్యం. అందుకని తెలుగు సాహిత్యం నుంచి నాటకాలను ఎంచుకోవాలని నిశ్చయించుకున్నాను. మొదట ‘మైదానం’ నవలను నాటకం చేశాను. ఇప్పుడు ‘పాకుడు రాళ్లు’ చేశాను. నాటకం చేయాలని అనుకున్నాక ఒక నెల రోజుల పాటు రీడింగ్ సెషన్స్ ఉంటాయి. మా నటీనటులు ఒక్కో చాప్టర్ చదువుతూ దాని సారాంశం నాకు హిందీలోనో ఇంగ్లిష్‌లోనో చెబుతూ వెళతారు. నవల ఆత్మను పట్టుకుంటే నాటకం వేయడానికి భాష అడ్డంకి కాదు అని నా భావన. సన్నివేశాల వరుస, నటీనటుల ఎక్స్ప్రెషన్స్, ఎనర్జీ, ఇన్వాల్వ్మెంట్, ఫీలింగ్, వేరియేషన్స్... వీటిని నేను చూసుకుంటాను. నాకు తెలిసిపోతాయి’ అంటారు నస్రీన్. ఆమె భర్త నౌషాద్ ముహమ్మద్ది కేరళ. అతను సెంట్రల్ యూనివర్సిటీ థియేటర్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. ‘పాకుడురాళ్లు నాటకాన్ని మరెన్నో ప్రదర్శనలు వేయాలని ఉంది’ అంటున్న నస్రీన్ కోరిక నెరవేరాలని కోరుకుందాం. (క్లిక్ చేయండి: స్త్రీ శక్తి.. సూపర్ ఫైటర్) -
1500 కు పైగా లిస్టెడ్ కంపెనీలకు షాక్
న్యూఢిల్లీ: దేశీయ కంపెనీల బోర్డుల్లో ఓ మహిళా డైరెక్టర్ ను తప్పనిసరిగా నియమించుకోవాలంటూ సెబీ పదే పదే హెచ్చరిస్తున్నా పట్టించుకోని కంపెనీలపై కొరడా ఝళిపించేందుకు రంగం సిద్దమైంది. సెబీ నిబంధనను బేఖాతరు చేసిన సుమారు1500 (బీఎస్సీలో 1375, ఎన్ఎస్సీలో 191) కంపెనీలపై జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేయనుంది. వీటిలో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, 22 ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడం విశేషం. మార్చి 31 నాటికి, బీఎస్సీలోని 5,451 కంపెనీలకు గాను 1,375 సంస్థలు సెబీ నిబంధనను పాటించడంలో విఫలమయ్యాయని స్టేట్ ఫినాన్స్ మినిస్టర్ జయంత్ సిన్హా లోక్ సభ్ లో ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు.బీఎస్సీలో 1375 కంపెనీలలో 201 మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయని మిగిలిన 1,179 లను కంపెనీలను సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. అలాగే సెబీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఎన్ఎస్ఈ నుంచి 191 కంపెనీల్లో 42 యాక్టివ్ గా ఉండగా మిగిలిన 149 సంస్థలను సస్సెండ్ చేశామన్నారు. ఈ నాన్ - కంప్లైంట్ సంస్థలపై జరిమానా విధించనున్నట్టు తెలిపారు. గత రెండేళ్లుగా గడువు కాలాన్ని పొడిగించుకుంటూ వచ్చిన సెబీ ఈ మార్చి 31 వరకు చివరి గడువుగా పేర్కొంది. గడువు ముగిసినా సదరు నియామకంలో కంపెనీలు వైఫల్యం చెందడంతో ఈనిర్ణయం తీసుకుంది. కనిష్టంగా రూ.50,000 జరిమానా, తరువాత నాలుగు దశల వారీగా జరిమానా పెరుగుతూ ఉంటుందని స్పష్టం చేసింది. అంతేకాదు కంపెనీల ప్రమోటర్లు, డైరెక్టర్లపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఇటీవల సెబీ తెలిపింది. వీటిని కంపెనీలు బేఖాతరు చేయడంతో కొంత గడువు విధించి, ఆ గడువు లోప తమ ఆదేశాలను అమలు చేయని కంపెనీలపై చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అయినా ఫలితం కనిపించకపోవడంతో సెబీ సీరియస్ గా స్పందించింది. సెబి నిబంధనల ప్రకారం నియమాల ప్రకారం మహిళ ఎగ్జిక్యూటివ్ ,లేదా నాన్ ఎగ్జిక్యూటివ్ లేదా ఇండిపెండెంట్, లేదా నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్లను గానీ మహిళా డైరెక్టర్లు నియమించుకోవచ్చన్నారు. సదరు డైరెక్టర్లు కచ్చితంగా ప్రమోటర్ల బంధువులై ఉండాలన్న కచ్చితమైన నిబంధన ఏదీ విధించలేదని జయంత్ సిస్హా స్పష్టం చేశారు. మార్కెట్ రెగ్యులేటరీ సెబీ ..2013 కంపెనీల చట్టం ప్రకారం అయా లిస్టెడ్ సంస్థలు తమ బోర్డులో కనీసం ఒక మహిళా డైరెక్టర్ ఉండేలా చూడాలని నిబంధన విధించింది. మహిళా సాధికారత, లింగ వివక్షను రూపుమాపేందుకు ఈ మార్గదర్శకాలను రూపొందించినట్టుతెలిపారు. దీన్ని కచ్చితంగా అమలుచేయాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది. లేనిపక్షంలో ఆయా కంపెనీలపై జరిమానా విధిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.